Header Top logo

Best Journalist venu gopal chary బెస్ట్ జర్నలిస్ట్ గా వేణుగోపాల్ చారి

Best Journalist venu gopal chary

జర్నలిస్ట్  వేణుకు సన్మానం

venu

అతను కలం పడితే అక్షరాలు పరుగులు పెడుతాయి. కష్ట జీవుల కన్నీళ్లను, అణచ బడుతున్న పేద వర్గాల మానవీయ కథనాలు ఆలోచింప చేస్తుంటాయి.

ఊహా తెలిసినప్పటి నుంచి జర్నలిజం జర్నీ చేస్తున్నసేపూరి వేణు గోపాల చారి లైఫ్ జర్నీలో మరిచి పోలేని ఎన్నో అనుభూతులు అతని స్వంతం..

సామాజిక బాధ్యతను మరిచి పోకుండా జర్నలిస్ట్ గా మానవీయ కథనాలు ఇచ్చే వేణును ఆర్ ఎస్ ఎన్ సేవా ఫౌండేషన్ వారు ‘‘బెస్ట్ జర్నలిస్ట్’’ అవార్డు కు ఎంపిక చేశారు.

వేణు ‘కలం’కు సన్మానం

సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ సార్ గారి ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఎన్ సేవా సంస్థ ఉత్తమ మానవీయ కథనాలకు అవార్డులు ప్రకటించింది. అందులో కామారెడ్ది జిల్లా విలేకరి వేణు గెోపాల్ చారి మానవీయ  కథనం రాష్ట్ర స్థాయిలో రెండో బహుమతి గా ఎంపికైంది. మే 31, 2022 నాడు  రం గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావ్ చేతుల మీదుగా పురస్కారం, రూ.40 వేలు ప్రశంసా పత్రం అందుకున్నాడు వేణు.  ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు రామచంద్ర మూర్తి, నందిని సిధారెడ్డి, ఆర్ సత్యనారాయణ, కే. శ్రీనివాస్ రెడ్డి, విరాహత్ అలీ, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Best journalist venu

జర్నలిజం కత్తిమీద సామే

కామారెడ్డి జిల్లా మాచా రెడ్డి మండలం గన్ పూర్(ఎం) గ్రామానికి చెందిన సేపూరి వేణుగోపాల చారి 1993 లో ఉదయం దిన పత్రిక లో మాచారెడ్డి మండల విలేఖరి గా జర్నలిజం లో అడుగిడారు. 1996 లో వార్త పత్రిక లో చేరారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన మాచారెడ్డి పీపుల్స్ వార్ నక్సల్ ఉద్యమానికి కేంద్ర బిందువు గా కొనసాగింది. మద్దికుంట అనే గ్రామాన్ని విముక్తి గ్రామంగా ప్రకటించుకుని జనతన సర్కార్ కొనసాగించారు. ఆ కాలంలో జర్నలిజం కత్తిమీద సామే.

నక్సల్స్ ఇలాకలో..

ప్రజా సమస్యలపై నిరంతరం వార్తా కథనాలు రాస్తూ గుర్తింపు పొందారు జర్నలిస్ట్ సేపూరి వేణు గోపాల్ చారి. నక్సల్స్ కార్యకలపాలపై చంద్రబాబు ప్రభుత్వం క్రూర నిర్బంధాన్ని అమలు చేస్తున్న సందర్భంలో అప్పటి ఓఎస్డీ ఒకరు వేణుగోపాల్ చారి కి నక్సల్స్ తో సంబంధాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. నక్సలైట్లు సంబంధించిన ఎన్నో వార్తలు, ఇంటర్వ్యూలు రాయడం ఒక కారణమైతే ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలపై నిత్యం ప్రశ్నించే గొంతుకగా పనిచేయడం ప్రభుత్వానికి కంటగింపైంది.

Best journalist venu

మలేరియా వ్యాధికి ‘‘వార్త’’ చికిత్స

మాచారెడ్డి మండలం సోమార్పేట, ఎల్లంపేట గిరిజన తండాల్లో మలేరియా వ్యాధి వందలాది మందిని మంచాన పడేసింది. దీన్ని వేణుగోపాల్ చారి వెలుగులోకి తీసుకురావడంతో అప్పటి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. మంత్రులు, ఉన్నతాధికారులు, వైద్యులు, ప్రొఫెసర్లు ఎంతో మంది ఆ తండాలకు తరలివచ్చారు. దాదాపు ఆరు నెలల పాటు వైద్య శిభిరాలు కొనసాగాయి. ‘ ఎల్లంపెట ను చుట్టుముట్టిన మలేరియా ‘ అన్న వార్త కథనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించింది. అప్పుడు అన్నారం లో పీ హెచ్ సీ, ఎల్లంపెట్ లో హోమియో డిస్పెన్సరీ మంజూరు చేశారు. అలాగే సాగు, తాగు నీటి వసతులు, రోడ్ల నిర్మాణాలకు అప్పట్లోనే దాదాపు రూ. 20 కోట్లు మంజూరు చేశారు.

Best journalist venu

అప్పుల బాధలతో ఆత్మహత్యలు

సాగునీటి సౌకర్యాలు లేక రైతులు బిర్లపైనే ఆధారపడి సేద్యం చేసేవారు. అప్పట్లో వర్షాలు లేక బోర్లు ఎట్టిపోవడం, బోర్ల తవ్వకం కోసం అప్పులు చేసిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం పై ‘ అప్పులకు పరిష్కారం ఆత్మహత్యలేనా ‘ ఆన్న శీర్షికన రాసిన కథనం తో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరుబాట పట్టాయి. అప్పుడు ప్రభుత్వం దిగివచ్చి రైతులకు ఆర్థిక చేయూత అందించింది.

Best journalist venu

సాక్షి రిపోర్టర్ గా ఎన్నో కథనాలు

Best journalist venu

2009 లో సాక్షి పత్రికలో కామారెడ్డి ఆర్సీ ఇంచార్జీ గా , 2016 నుంచి సాక్షి స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. జిల్లాలో సామాజిక సమస్యలపైన , అలాగే మానవీయ, పరిశోధనాత్మక కథనాలు అనేకం రాశారు.
– కామారెడ్డి పట్టణం సమీపంలోని శాబ్దిపూర్ వద్ద ఒక నిరుపేద ముస్లీం కుటుంబంలో ముగ్గురు పిల్లలు పుట్టుకతో అంధులు. ‘ అల్లాహ్ కే ప్యారే బందే ‘ శీర్షికన ఫ్యామిలీ పేజీలో రాసిన కథనం ఎన్నో హృదయాలను కదిలించింది. ఆ కుటుంబానికి చాలా మంది ఆసరాగా నిలిచారు.

Best journalist venu

ప్రభుత్వం కళ్లు తెరిపించిన ‘సాక్షి’

– కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజి వాడి గ్రామానికి చెందిన రైతులు తమను మోసం చేసిన వ్యాపారిపై తిరగబడిన పాపానికి 22 మంది రైతులపై రౌడీ షీట్ తెరిచారు. ఆ రైతుల ఫోటోలను పోలీస్ స్టేషన్ లో గోడకు అతికించారు. ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో ప్రభుత్వం స్పందించింది. ఫోటోలను తీసేయడం తో పాటు రైతులపై పెట్టిన రౌడీ షీట్ లు ఎత్తివేశారు.

Best journalist venu

డిగ్రీ పాఠ్యపుస్తకంలో ‘‘వేణు’’ వార్త కథనం

లింగం పేట మండలం బూరు గిద్ద అనే చిన్న గ్రామం. ఇది కామారెడ్డి – ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఉంటుంది. ఆరేడు దశాబ్దాల క్రితం వలస వచ్చిన కుటుంబాలు భూమి కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకుని ఉంటున్నారు. ఆధార్, రేషన్, ఎలక్షన్ కార్డులు ఉన్నాయి. ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు. అయితే కొందరు బూరుగిద్ద ఊరు ఉన్న భూమిని తప్పుడు పత్రాలతో తమ పేర రిజిస్ట్రేషన్ చేసుకుని జేసీబీ లతో వచ్చి ఇండ్లు ఖాళీ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ‘ ఊరునే అమ్మేశారు ‘ శీర్షికన రాసిన కథనం తో ఉన్నతాధికారులు స్పందించారు. విచారణ జరిపి ఆ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి, వాళ్లకు పొజిషన్ సర్టిఫికెట్ లు ఇచ్చారు.
– బూరుగిద్ద పై రాసిన ఊరును అమ్మేశారు అనే కథనం డిగ్రీ థర్డ్ ఇయర్ తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా పెట్టారు.

Best journalist venu

వృద్దురాలి కుటుంబానికి ‘సాక్షి’ కథనంతో..

– కామారెడ్డి బస్టాండ్ లో బిక్షాటన చేసే గంగవ్వ అనే వృద్ధురాలి సొంత ఊరు కుప్రియాల్ కు వెళ్లి ఆమె గురించి తెలుసుకుని ‘ ముగ్గురు పిల్లలు నాయనమ్మ ‘ శీర్షికన రాసిన కథనం జిల్లా కలెక్టర్ శరత్ ను తట్టి లేపింది. అదే రోజు గంగవ్వ, పిల్లలను పిలిపించి రూ 50 వేల సాయం అందించారు. గంగవ్వ మనవరాలికి ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగం ఇప్పించాడు. పూరి గుడిసెలో ఉంటున్న గంగవ్వకు రూ.5.50 లక్షలతో ఇల్లు కట్టించి ఇచ్చారు.

కలెక్టర్ సహాయంతో కుటుంబానికి..

– కామారెడ్డి పట్టణంలో కతోనాతో భార్య భర్తలు చనిపోయారు. ఇద్దరు పదేళ్ల లోపు పిల్లలు, తల్లి ఉన్నారు. వాళ్లకు భవిషత్తు భారమే. ఇదే సమయంలో ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అప్పు రూ. 18 లక్షలు భారంగా మారింది. దీనిపై రాసిన కథనం కలెక్టర్ ను కదిలించింది. బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి వన్ టైం సెటిల్మెంట్ కింద రూ. 8 లక్షలు మాఫీ. చేయించారు. రూ. 10 లక్షల కోసం కలెక్టర్ ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి కొందరు ప్రముఖులు, కాంట్రాక్టర్ల ద్వారా రూ 10 లక్షలు సమకూర్చి బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి ఇంటి పత్రాలు ఆ కుటుంబానికి ఇప్పించారు. నాయనమ్మ కు ఉపాధి కూడా చూయించారు.

Best journalist venu

కుటుంబం..

పూర్తి పేరు : సేపూరి వేణుగోపాల్ చారి
తల్లిదండ్రులు : లక్ష్మి నర్సయ్య, లక్ష్మి నర్శవ్వ
భార్య : జయశ్రీ
కూతుళ్లు :
1. రచన ( BHMS) చదువుతోంది.
2. అక్షర ( పదో తరగతి )

యాటకర్ల మల్లేష్

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

1 Comment
  1. online dallasfortwork.com says

    Hi! I understand this is kind of off-topic however I had to
    ask. Does managing a well-established blog such as yours take
    a large amount of work? I’m brand new to blogging however I do
    write in my journal every day. I’d like to start
    a blog so I can easily share my personal experience and thoughts online.
    Please let me know if you have any ideas or tips for new aspiring blog owners.
    Appreciate it!

Leave A Reply

Your email address will not be published.

Breaking