Header Top logo

Life of Prophet Muhammad (Pawada) ప్రవక్త ముహమ్మద్ జీవితం

Life of Prophet Muhammad (Pawada) ప్రవక్త ముహమ్మద్ జీవితం

*మహాత్మా జోతీ రావు పూలే ‘”పవాడా”, (Pawada) ” మానవ ముహమ్మద్ ” (స)…

ప్రపంచంలో మనకెందరో గొప్ప వ్యక్తులు దర్శనమిస్తారు.అయితే అన్నివిధాల పరిపూర్ణమైనజీవితం, అన్ని రంగాల్లో విజయవంతమై అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన వారిలో ప్రవక్త ముహమ్మద్ (స) ముందుంటారు.ముహమ్మద్ (స) గొప్పింటి బిడ్డే అయినా అనాథగా బతికారు. మేకలకాపరిగా అతి సామాన్యమైన‌జీవితంగడిపారు.వ్యాపారిగా, ఆడ పిల్లల తండ్రిగా,రాజకీయ వేత్తగా,సేనానిగా, పాలకునిగా అన్నిటినీ మించి దైవ ప్రవక్తగా ఇస్లాం వ్యాప్తి కర్తగా ముహమ్మద్ (స) అన్నిరంగాలకు విస్తరించి పరిపర్ణమైన జీవితం గడిపారు.అందుకే 1500 సంవత్సరాలు గడిచినా నేటికీ ముహమ్మద్ (స)కార్యాచరణ, సాధించిన విజయాలు అజరామరంగా వున్నాయి. మహాత్మా జోతీరావు ఫూలే తన జీవిత కాలంలో రెండు ‘ పవాడా'(Pawada)  లు రాశారు. ఇందులో ఒకటి ప్రవక్త ముహమ్మద్ (స) గురించి రాసింది. రెండోది ఛత్రపతి శివాజీ గురించి రాసింది.ప్రస్తుతంముహమ్మద్ (స) గురించి రాసిన ‘పవాడా ‘ గురించి తెలుసుకుందాం !

‘పవాడా ‘ అంటే..స్తుతి గీతం.(Poem of Appreciation or Ballad ) ఫూలే రాసిన ఈ గీతాన్ని ఆయన దత్తకుమారుడు ‘యశ్వంత్ జ్యోతిరావు పూలే’ 1891 లో పూనాలోని సుభోద్ ప్రకాశ్ ప్రెస్ ద్వారాప్రచురించి విడుదలచేశారు. అప్పట్లో దాని ధర 12 అణాలు. ఆతర్వాత పూనె  యూనివర్సిటీకి చెందిన Prof.Hari Narke సంపాదకత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వ  ‘సాంస్కృతిక విభాగం ‘ ద్వారా…..Mahatma Phule  Samagra Vangmay పేరిట వెలు వరించిన సంపుటాలలో పుట 608, 609 లోఈ పవాడా చోటుచేసుకుంది.మానవ్ ముహమ్మద్(స)  చాలా సుదీర్ఘమైంది.ఆ పవాడాలో ఇస్లాం,ప్రవక్త ముహమ్మద్( స)నాటి  ముస్లింలగురించి, అప్పటి సామాజిక స్థితిగతులు, శూద్ర, అతిశూద్ర కులాల వెతలు,ఆధిపత్య కులాల చేష్టలను గురించి పేర్కొంటూ చాలా ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శనాత్మక వ్యాఖ్యలను తీసుకోకుండా ముహమ్మద్ (స) ముస్లింల గురించి చేసిన ప్రస్తావనలకు మాత్రమే పరిమితమై షోలాపూర్ కు చెందిన ఉర్దూ కవి , ప్రొఫెసర్‌డాక్టర్ ఇబ్రహీం ఫైజ్  ఉర్దూనుంచి హిందీలోకి అనువదించారు.ఆ అనువాదం..

‘ “pawadaఖూషే జావిదా” అనే పుస్తకం లోచోటుచేసుకుంది. దీన్నిహిందీ నుండి తెలుగు లోకి తర్జుమా చేశారు. కరీంనగర్ కు చెందిన జనాబ్ ‘అబుల్ ఫౌజాన్.’ ఈ అనువాద పాఠాన్ని పునః సమీక్షించి ప్రముఖ ముస్లిం చారిత్రక పరిశోథకులు సయ్యద్ నశీర్ అహమ్మద్ గారు తమతాజా పుస్తకం’ఆధునిక భారత తొలి ముస్లింఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ ‘అనే పుస్తకం లో అనుబంధంగా చేర్చారు. ఇప్పుడు ‘ఫూలే ‘ రాసిన ‘పవాడా’ ను  కవి కరీముల్లా… తెలుగులోకి  అనువదించారు..మీరూ చదవండి.!! *మహాప్రవక్త ముహమ్మద్(స)పై మహాత్మా జ్యోతిరావు పూలే రాసిన స్తుతి గీతం.!! ముహమ్మద్(స)

అవనిపై అరుదెంచె ముహమ్మద్ బోధకుడై చీకటి ఛాయల్లో ఉదయించె ముహమ్మద్ పరమాత్మ బంధువై తన తనువెంత ముడిపడిందో విగ్రహ దాస్యాల నుండి ఆ ఆత్మెంత విడివడిందో అసత్యంతో తనను తాను రక్షించుకోమన్నారు పరమాత్మే సత్యం.చాలిక!తనే నా రక్షకుడన్నారు. విగ్రహాల ఊహల వలపులిక ఆపండి. శ్రేయస్సు ఆనవాళ్లను ప్రవక్త లక్ష్యవీథిలో వెతకండి. ముహమ్మద్(స)ధర్మం విశ్వాస పరిమళ పవనం విశ్వప్రేమతో ఖురాను సాగించేను అనురాగ పయనం ఒక్కడే,అందరి దైవం ఒక్కడే అంటారాయన. సకల చరాచరాలకు అతడే ఆధారమన్నాడాయన. నింగి, నేల, సూర్యచంద్రాది తారకలు అల్లాహ్ ఆజ్ఞతో చరిస్తాయన్నారాయన సర్వ సృష్టికర్త సృష్టితాలమే మనంఅందరి దైవం ఆ ఒక్కడి ముందు అంతా సమం అల్లాహ్ తప్ప ఆరాధ్యుడెవ్వడూ లేడని చాటారాయన ఆయన తప్ప ఆరాధనార్హులెవరూ లేరని నాటారాయన తను సత్య సందేశహరుడై ఇలపై వచ్చెఇహపరాల బహుమానం అందరికై తెచ్చె ముహమ్మద్(స) సత్యానికి సజీవ రూపం ముహమ్మద్(స)వాస్తవానికి సజీవ సాక్ష్యం ముహమ్మద్ ఆజ్ఞాపించె అల్లాహుఅక్బర్ ముహమ్మద్ వాక్కు చేరె ఇంటింటా,ప్రతి నట్టింటా ముహమ్మద్ వాక్కు సదా!వ్యాప్తి చెందు ముహమ్మద్ త్యాగం సదా మన జీవిత వెలుగు ముహమ్మద్ మనోఫలకాన అల్లాహ్ ఆరాధనే ముహమ్మద్ తనువు శిఖరాన అల్లాహ్ పారవశ్యమేముహమ్మద్ అసమానతల్ని వలదన్నారు. ముహమ్మద్ ఆలింగనాన అందరూ సమమయ్యారు.

అజ్ఞాన తిమిరాన్నుండి అందర్నీ లేపాడాయన. మనిషిని మనిషిగా మల్చిన మహోన్నతుడాయన ముహమ్మద్ రంగు మానవత్వమై విలసిల్లె భూమి మూలమూలల్లో సమ భావనై భాసిల్లె అల్లాహ్ ఒక్కడే,అంతా దైవత్వమే మానవులంతా పరస్పరం సోదరులే. నమ్మలేదు,మక్కా ఆయన్ని ఒప్పనే లేదు. ముహమ్మద్ కు పీడకుల ముప్పు తప్పలేదు. ఇంతింతై,ద్వేషం అంతింతై అల్లాహ్ ఆదేశాన వలసెళ్ళె ముహమ్మద్ మదీనా హత్తుకుంది తననో హృదయమై మదీనా వెలుతురై వ్యాపించె జ్ఞాన ప్రపంచమై మొఘలులు హిందుస్తాన్ పాలకులయ్యె ముహమ్మద్ సత్య సందేశానికి సతతం సాక్ష్యులయ్యె ప్రవక్త శత్రుత్వ ద్వేషాల నుండి విముఖులయ్యె ప్రవక్త మితృత్వాల మదీనాలో ఆవాసమయ్యె ధూర్త ఆర్యులదే ఈ వర్తనమంతాశూద్రులు పశువుల కన్నా హీనమనే వారి వనలంతాశూద్రులు,ముస్లింలు ఒక ఇంటి వారయ్యారు. ముస్లింలు అందరికీ ప్రేమ ఆలింగనాయ్యారు.

పీడితులంతా నడిచె శూరత్వ రూపాలై విశ్వాస ముస్లింలకై నడిచె స్నేహ దీపాలైఅప్పుడెట్లా హోలీ,దీపావళులయ్యారో ఇప్పుడట్లే మొహరం పండుగలయ్యారు. బాంధవ్యాల నిర్మించేదే నిజ ధర్మం ద్వేషాన్ని నిర్మూలించేదే మనందరి ధర్మం వాళ్లు(ఆర్యులు)మతం పేర అడ్డుగోడలు కడతారు. మనుషులపై మనుషుల్లో విష బీజాలు నాటుతారు. మనమంతా వారి(ఆర్యులు)దృష్టిలో పరాయీలమే వారి దౌర్జన్యాల ప్రతిఫలం ముందుందిలే జ్యోతిరావును చెప్తున్నా!చెవులొగ్గి వినరండోయ్ ఎందుకైనా మంచిది సదా!అప్రమత్తులమై ఉండాలండోయ్.  *మరాఠీ మూలం: జ్యోతిరావు పూలే *ఉర్దూ అనువాదం: డా.ఇబ్రహీం పైజ్  *తెలుగు అనువాదం: కవి కరీముల్లా*వినుకొండ, గుంటూరు జిల్లా.ఎ.పి.”ముహమ్మద్ (స) ప్రపంచంలోకి విచ్చేశారు.చీకట్లను వెలుగుల్లోకి మార్చేశారు..పరమాత్మతో సంబంధాన్ని ధృడ పరిచారువిగ్రహారాధన పట్ల విముఖత కలిగించారుపరమాత్మ సత్యం ఆయన్నే ఆరాధించమన్నారుఅసత్యం నుండి‌ ….దూరంగా ఉండమన్నారు.ఊహాజనిత విగ్రహాల ఊసే వద్దన్నారు.మంచివైపుకు ఊహలు మళ్ళించమన్నారు.ముహమ్మద్ (స) ధర్మ విశ్వాసాలతో ముందుకుసాగారు. సౌభ్రాతృత్వ సందేశమిచ్చే ఖురాన్ తో కదిలారు.సృష్టికర్త ఒక్కడే అని నొక్కి వక్కాణించారు.సృష్టికంతటికీ ఆయనే ఆధారభూతమన్నారు.భూమ్యాకాశ,సూర్యచంద్ర నక్షత్రాలు…..ఆయన ఆజ్ఞానుసారమే  చరిస్తున్నాయన్నారు.ఆ సృష్టి కర్త సృజించిన వారమే మనమంతా. ‘ఆయనే అందరికీ ప్రభువు. ఆయనే అందరికీ యజమాని అన్నారు. అయనొక్కడే ఆరాధ్యుడు…ఆయన తప్ప ఆరాధనకు ఇంకెవరూ…. అర్హులు కారు’.!!

ఆ సందేశం తీసుకొని మీ వద్దకొచ్చాను.మీ కోసం శ్రేయో సాఫల్యాల కానుక తెచ్చాను.ముహమ్మద్( స) వాస్తవికతకు నిలువెత్తు రూపం ముహమ్మద్ ( స) యదార్ధానికి తిరుగులేని సాక్ష్యం.అల్లాః మహోన్నతుడని ముహమ్మద్ (స) పలికారు. ఇస్లాంను ఇంటింటా చేరవేశారు. ముహమ్మద్ (స) అతి సామాన్య జీవితం గడిపారుఆ మహనీయుని కోసం అర్పింతును నా ప్రాణంముహమ్మద్( స) ❤️గుండె నిండా దైవభావమే ముహమ్మద్ (స)మనస్సునిండా దైవసౌందర్యమే.స్వపరాల భేదాల్ని  రూపుమాపారు.సర్వజనులను ముహమ్మద్ (స) హృదయానికిహత్తుకున్నారు…

అజ్ఞానం ,అధోపతనాల నుండి విముక్తం చేశారు. మనిషిని మనీషిగా మార్చారు ముహమ్మద్ ( స)ముహమ్మద్ (స) మానవత్వం మహిమ చూపింది. నలుదిక్కులా ఈ నినాదమే పిక్కటిల్లిందిసృష్టి కర్త ఒక్కడే , సృష్టి అంతా ఆయనదే .విశ్వజనులంతాపరస్పరం సహోదరులే .వినలేదు మక్కా వాసులు ఆయన మాటను విచ్చల విడిగా ముహమ్మద్ (స)పై దౌర్జన్యాలుచేశారు. శతృవుల శతృత్వం తీవ్రమైనప్పుడుఅల్లాః ఆదేశం మీద ఆయన మదీనాకు ‘వలస’  వెళ్ళారు.! శతృవుల దుష్కృత్యం నుండి ముహమ్మద్ (స) విముక్తమయ్యారు.మదీనాను ఆయన ఆవాసం చేసుకున్నారు. మదీనాలో సత్యసందేశం వికసించింది, ఫలించింది.మదీనా నుండి వెలుగు భువిఅంతా వ్యాపించింది. ముహమ్మద్ (స) ఏకేశ్వరోపాసన సందేశం తీసుకొనిభారతావనికి మొఘలులు పాలకులుగా ఏతెంచారు. ఆర్యులిక్కడ ఎంతో కాలంగా ఆధిపత్యంలోవున్నారు. శూద్రులు పశువులకన్నా హీనమనివారుభావించారు. శూద్రుల్ని ముస్లింలు తమవారుగా చేసుకున్నారు. గౌరవించి ❤️ గుండె లకు హత్తుకున్నారు.శౌర్యానికి క్షత్రియులు ప్రతిరూపాలుముస్లింలకు వారంతా…. మిత్రులై మెలిగారుహోలీ,దివాలీల్ని జరుపుకున్నారు.

పీర్ల పండుగని కూడా తమదిగా చేసుకున్నారు.మనస్సులను కలిపేదే నిజమైన ధర్మం, ద్వేషాలను మాపేదే సత్య ధర్మ నిష్టత కొందరు మతం,మతం విశ్వాసాలను అడ్డుపెట్టుకొని  ప్రజల్లో కలహాల్నిరాజేసి ,తరచూ ఘర్షణలకుగురిచేస్తారు. స్వజనులు కూడా వారి దృష్టిలో పరాయి వారే యే పరిణామాలకు దారితీస్తుందో వారి వైఖరిచూడాల్సిందే.. చెవులు రిక్కరించి ‘ జ్యోతి ‘ చెప్పేది వినండోయ్! ఇలాంటి వారితో జాగ్రత్తగా వుండటమేమేలండోయ్”!

*.’పవాడా.’..జ్యోతిరావు ఫూలే.!! సముద్రం రాజీపడదు.ఎన్ని నదులనైనా తనలో కలుపుకుంటుంది. కానీ ..సతన ఉనికిని మాత్రం‌మార్చుకోదు. ముహమ్మదు(స) కూడా అంతే. తన చుట్టూ ఎంత అజ్ఞాన తిమిరం వున్నా ఇస్లాం వెలుగుల్ని వెదజల్లుకుంటూ….. ముందుకు నడిచారు.పరి సరాలతో, పరిస్థితులతో ఎప్పుడూ..‌ రాజీపడలేదు. నిరంతరంసంఘర్షించారు.పోరాడారు.ఎన్నడూ… మడమతిప్ప లేదు.సమాజ గమనపు ప్రవాహదిశనే మార్చేశారు.

ముహమ్మద్ (స) గారి కాలంలో అరాచకత్వం రాజ్యమేలింది.అరబ్బులకంటూ ఓ పాలనా వ్యవస్థ లేదు.వేలాది సంవత్సరాలుగా సంచార జాతులతో తల్లడిల్లిన ప్రాంతం. యే.. రెండు విరోధి తెగల మధ్య ఏనాడు సయోధ్య లేదు.ఈ నేపథ్యంలో ముహమ్మద్ నడుం కట్టి విఛ్ఛిన్నమై వున్న వేలాది తెగల్ని ఒకే గొడుగు కిందకుతెచ్చారు.పగ,ద్వేషాలతో రగిలిపోయే వారిమధ్య ప్రేమ పాదును నెలకొల్పి, వారి మధ్య అనురాగ బంధాన్ని నెలకొల్పారు. హజ్రత్ ముహమ్మద్(స) యేం చేశారు ? *మూఢనమ్మకాల అంధకారం నుంచి మతభావననుతొలిగించారు. ఆధ్యాత్మికతను క్రియాత్మక జీవితపు సువిశాల క్షేత్రంలోకి రప్పించి, గొప్ప సంస్కర్త అయ్యారు..

*సమాజంలో విలువలు,శీల్యం,విత్రత నెలకొల్పి గొప్ప పాలకుడయ్యారు. “కులగోత్రాలు,వంశ,వర్గ పరిమితులు,భాషా ప్రాంతాల హద్దులు,సరిహద్దులు లేకుండా అందరినీ ‘ఇస్లాం’ ఛత్రఛాయలోకి తీసుకొచ్చిన  ‘పురుషోత్తముడయ్యారు. *అందరి దేవుడొక్కడే,మానవులంతా ఒక్కటే అని చాటిచెప్పి మహనీయులయ్యారు. *మనుషులు పుట్టుక రీత్యా గొప్పవాడు కాలేరని, దైవభీతి,దైవారాధనచేతనే గొప్పవారవుతారని, ధార్మిక పరిమళాలు వెదజల్లారు.

*బానిసత్వానికి వ్యతిరేకంగా గళం విప్పి,తెల్లవానికీ, నల్లవానికి మధ్య రంగు భేదమే గానీ ఆధిపత్య భావన లేదని చాటిచెప్పి మానవతామూర్తిగా నిలిచారు. *కూలి వాని చెమట బిందువులు ఆరకముందే అతని శ్రమ తాలూకు కూలి చెల్లించాలని చెప్పిసామ్యవాదానికి  బాటలు వేశారు. *ఖురాన్ సిధ్ధాంతం..ముహమ్మద్ (స)ఆచరణ !!ముస్లిం సమాజానికి ముఖ్యమైన ప్రమాణాలు రెండు. 1.పవిత్ర ఖురాన్ సిధ్ధాంతం 2.హజ్రత్ ముహమ్మద్ (స) కార్యాచరణ సిధ్ధాంతం,ఆచరణ ఖురాన్,ముహమ్మద్ బోధనలు రెండూ ఇస్లాంకు రెండు కళ్ళవంటివి. ఇవే ముస్లింల జీవన విధానానికి మార్గదర్శకాలు.

*ముహమ్మద్ (స) కూ  కష్టాలు తప్పలేదు…!! హజ్రత్ ముహమ్మద్ (స)ఇస్లాం వ్యాప్తికి ఎన్నో కష్టాలు పడ్డారు….చివరకు పుట్టి పెరిగిన ‘ మక్కాను’  వదిలి మదీనాకు వలసపోవాల్సి వచ్చింది.అదే హిజ్రీ శకానికి ఆరంభంగా చెబుతారు. మదీనాకు చేరుకున్నాక ఇస్లాం ఉద్యమంలో కొత్త దశ ఆరంభమైంది. మక్కాలో ఖురైషీల ఆధిపత్యం, కాగా మదీనాలో మాత్రంశముస్లింల మాటే చెల్లేది.అంటే మదీనా ఓ రకంగా తొలి   ‘ విముక్తి ‘ ప్రాంతం అన్న మాట. 40 సంవత్సరాల వయసులో హజ్రత్ ముహమ్మద్ (స)ను అల్లాః తమ అంతిమ ప్రవక్తగా ఎన్నుకొని ఆయన ద్వారా  23 సంవత్సరాలలో ఖురాన్ ను కొద్ది కొద్దిగాఈ భూమ్మీద అవతరింప జేశారు. ఈమాన్,,నమాజ్,రోజా,జకాత్,హజ్ అనేవి ఇస్లాంధార్మిక జీవనానికి ఐదు ముఖ్య సూత్రాలయ్యాయి. ఇక మహాప్రవక్త తీసుకొచ్చిన ”  ఖురాన్ గ్రంథం “ఓ అధ్భుతం. పగలు,రాత్రి తేడా లేకుండా ప్రపంచంలో కోట్లాది మంది నిత్యం  పఠించే పవిత్ర గ్రంథమిది. హజ్రత్  ముహమ్మద్ (స) దైవప్రవక్తగా 23 సంవత్సరాలలో  మక్కా..మదీనా చుట్టుపక్కల ఉన్న తెగల వారందరినీ కలిపి ఒక్కటి చేశారు. దైవ సందేశం ప్రకారం మలిచారు! మానవాళి ఇహ పరాలనన్నింటికీ ప్రవక్త జీవితం సశక్తమైన ఓ పరిష్కార మార్గాన్ని చూపింది.ఇస్లాం ఓ జీవనమార్గమై విలసిల్లుతోంది. ప్రవక్త ముహమ్మద్ ( స) జీవితమే ఒక సందేశం. ఆయన ఉదారస్వభావం,మన్నింపు వైఖరి,నిరాడంబరత,సత్యసంధత,కలుగోలుతనం.నీతి, నిజాయితీ,నిస్వార్ధం,దైవభీతి, దైవచింతన మనందరికీ ఆదర్శం కావాలి. మానవాళిని సన్మార్గంలో పెట్టడానికి పంపబడిన అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స)బోధనలు…!!

*ఇస్లాం ఓ జీవన మార్గం.విలువలతో కూడిన ధార్మిక ధర్మపథం. *తనకోసం ఇష్టపడేదే తన సాటివారికోసంకూడా ఇష్టపడనంత వరకు ఎవరూ ముస్లిం కాజాలరు.*పేదవారిని పిలవకుండా కేవలం ధనికుల్ని మాత్రమే విందుకు ఆహ్వానించడం మంచిది కాదు.*తన సహచరులపట్ల,ఇరుగు పొరుగు వారి పట్ల మంచిగా మెలిగే వాడే అల్లాః దృష్టిలో ఉత్తముడు. *సముద్రంలో వేలు ముంచి తీస్తే ఎంత అంటుకుంటుందో పరలోక జీవితం ముందు ఇహలోక జీవితం కూడా అంతే.*కనీసం ఒక ఖర్జూర పండు ను దానం చేసైనా మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి.*క్షమాగుణం,సమభావన,భూతదయ కంటే మించిన సద్గుణాలు లేవు.*అల్లాః ను,అంతిమ దినాన్ని విశ్వసించే వారు ఎల్లప్పుడూ మంచి మాటలే పలకాలి. లేకుంట మౌనంగా వుండాలి.*తల్లి పాదాల కింద స్వర్గ ముంది.తండ్రి స్వర్గలోకప్రవేశపు మధ్య ద్వారం వంటి వాడు.*తల్లి ఒడి ఓ బడి.తల్లి విద్యవంతురాలైతే మొత్తంజాతి చదువుకున్నదవుతుంది.

ప్రవక్త ముహమ్మద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఓ యోధుడు. ఓ వ్యాపారి, ఓ రాజకీయవేత్త,గొప్ప వక్త.అనాథలకు ఆశ్రయ కర్త.బానిసలకు అండ.స్త్రీల రక్షకుడు.న్యాయ మూర్తి. సాధుమూర్తి. సంపూర్ణ గుణధాముడు. ఆయన జీవితమే ఓ సందేశం. ఆయన మార్గం మానవాళికి ఆదర్శం.*ఫూలే.. ముస్లింలు..!! ఫూలే చిన్నతనం నుండి ముస్లిం జన సముదాయాలతో కలిసి తిరిగారు.బళ్ళో కూడా ఆయనకు చాలామంది ముస్లిం మిత్రులయ్యారు.వారితో ఇస్లాం, హిందూమతం మంచీ చెడుల గురించిచర్చించేవారు.ఆధిపత్య కులాల పెత్తనం పై జోతీరావు ఫూలే దృష్టిసారించారు.రాజకీయ బానిసత్వం కంటే..సామాజిక బానిసత్వం నుండి స్వేఛ్ఛకోసం పాటుపడాలని ఆయన భావించారు.అప్పుడే ఆయన సామాజిక ఉద్యమాల దిశగా ప్రయాణంసాగించారు. చిన్నప్పటి నుండి ముస్లింలతో సఖ్యతగా మెలగడం వల్ల ముస్లింలపై ఫూలేకు సానుకూలత యేర్పడింది. తండ్రి చదువు మాన్పించి నప్పుడు పాఠశాల పునః ప్రవేశానికి జోతిరావుకు తోడ్పడింది మున్షీ గఫ్ఫార్ బేగ్. జ్యోతిరావు శూద్రులకు,అతిశూద్రులకు పాఠశాలలు ప్రారంభించాక  తండ్రి కోపగించి ఇంటినుండి బయటకు వెళ్ళగొడితే జోతిరావు ఫూలే దంపతులకు ఆశ్రయం కల్పించింది ఉస్మాన్ షేక్. ఫూలే దంపతుల విద్యావ్యాప్తి ఉద్యమానికి చేయూతనిచ్చి, సహకరించింది ఫాతిమా షేక్.. ఇలా ఫూలే లో ఇస్లాం, ముస్లిం లు,  ముహమ్మద్( స) పట్ల సానుకూల భావజాలం యేర్పడింది. అదే… ముహమ్మద్ (స) గురించి పవాడా రాసేందుకు దోహదపడింది.

మహాత్మా జోతీ రావు ఫూలే ఇస్లాం, ముస్లిం, ముహమ్మద్ ( స)ను శ్లాఘించడం తోనే సరిపెట్టుకోలేదు. ముస్లిం పాలకులు, ముస్లిం ప్రజానీకం, ముస్లిం ధార్మిక వేత్తల తీరుతెన్నులపై కూడా విరుచుకుపడ్డారు.”ఫూలే  ఇస్లాంను స్వాగతించారు. ముస్లింలను పొగిడారు.దాంతోపాటే వారి లోపాల్నీ,,వారికి  చెందిన చారిత్రక తప్పిదాల్ని కూడా ఎత్తి చూపారు.ఇస్లాం మతం బోధించిన సామాజిక సమానత్వం,బాధిత ప్రజల పక్షం వహించడం లో తమ బాధ్యత ను మరిచిపోయారని  విమర్శించారు.ఇస్లాం బోధించిన సాంఘిక సమానత్వం,బాధిత పక్షం పట్ల.పోరాటాన్ని విస్మరించి,విలాసాల్లో మునిగిపోయారని “సర్వజనిక్ సత్యధర్మ్ ‘ పుస్తకంలో ఆక్షేపించారు.ఏది ఏమైనా, ముహమ్మద్ (స) గురించి ఫూలే సవివరంగా మానవ్ ముహమ్మద్ (సల్లల్లాహు)శీర్షికతో.రాసిన .” పవాడా” ఆయన సాహితీసంపదలో ఓ గొప్ప విషయంగా మిగిలి పోయింది… పవాడాను తెలుగులోకి అనువదించిన కవి కరీముల్లా అభినందనీయుడు.

Abdul Rajahussen writer..

ఎ.రజాహుస్సేన్, రచయిత

హైదరాబాద్

Leave A Reply

Your email address will not be published.

Breaking