Header Top logo

నాడు నక్సలైట్.. నేడు మండలి డిప్యూటీ స్పీకర్

డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ ప్రస్థానం

కలిసి వచ్చే  కాలంలో నడిసి వచ్చే పదవులు స్వాగతం పలుకుతాయి..  ఔను.. ఈ సామెత అక్షరాల బండ ప్రకాష్ ముదిరాజ్ కు వర్తిస్తోంది.

విద్యార్థి దశలో విప్లవ రాజకీయాల వైపు ఆకర్శితుడైన బండ ప్రకాష్ కొంత కాలం కొండపల్లి సీతారామయ్యతోొ పని చేసిన అనుభవం ఉంది.

ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో పని చేస్తునే వరంగల్ జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో ఉన్నత పదవులు అలంకరిస్తున్నారు బండ ప్రకాష్ ముదిరాజ్.

జీవిత ప్రస్థానం..

డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ ది వరంగల్. సత్యనారాయణ – శకుంతల దంపతులకు 18 ఫిబ్రవరి 1954లో జన్మించారు. విద్యార్థి దశ నుంచి విప్లవ రాజకీయాలలోకి వెళ్లాడు అతను. 1970 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల కార్యకలపాలు విస్తరించిన కొండపల్లి సీతారామయ్యతో పని చేశారు.

కొంత కాలం ఆ కొండపల్లి సీతారామయ్యకు గన్ మెన్ గా విధులు నిర్వహించినట్లు చెబుతారు. సీపీఐ (ఎం.ఎల్) మావోయిస్టు గ్రూప్ అధినేతలు గణపతి అలియాస్ ముప్పళ్ల లక్ష్మన్ రావు, మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ లాంటి వాళ్లతో కొంత కాలం పని చేసి ఆ విప్లవ బాటను వదిలి జనం బాట పట్టారు.

అర్ధాంతరంగా ఆపేసిన విద్యను కొనసాగిస్తూ వ్యాపారాలు ప్రారంభించారు. కాకతీయ యూనిర్సిటీ నుంచి పిహెచ్ డి పట్టా పొందారు. ఆయన భార్య పేరు అనిత, ఆమె వృత్తి రీత్యా టీచర్, సామాజిక కార్యకర్తగా కూడా పని చేస్తోంది. Life of Dr. Banda Prakash Mudiraj

రాజకీయ జీవితం..

విప్లవ బాటను వదిలిన బండ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో క్రీయశీల కార్యకర్తగా పని చేశారు. 1981 నుండి 1986 వరకు వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు. ఆయన 1981 నుండి 1984 వరకు వరంగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాడు. బండ ప్రకాష్ ముదిరాజ్ 1981 నుండి 1986వరకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) పాలకమండలి సభ్యుడిగా పని చేశారు. ఆయన 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.

రాజ్యసభ సభ్యుడిగా..

బండ ప్రకాష్ ముదిరాజ్ ఎప్పుడు తాను రాజ్యసభ సభ్యుడి పదవి చేపడుతానని ఊహలో కూడా అనుకోలేదు. తెలంగాణ ఫీషారిస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తాదని తన ఆత్మీయులతో షేర్ చేసుకున్నారు.

అప్పటికే తన జాతీ మత్య్స  కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును బండ ప్రకాష్ కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ దృష్టిలో పడ్డారు ప్రకాష్. అయితే.. కేసీఆర్ ఆశీస్సులతో 2018లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి బండ ప్రకాష్ ముదిరాజ్ గెలిచాడు. Life of Dr. Banda Prakash Mudiraj

ఈ ఎన్నికలో బండా ప్రకాశ్‌కు అత్యధికంగా 33 ఓట్లు పోలయ్యాయి. ఆయన 2018 మార్చి 23న తెరాస తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యాడు. బండ ప్రకాష్, 2018-2019 వరకు ప్రాచీన స్మారక కట్టడాలుపై రాజ్యసభలో సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. 2019లో రాజ్యసభలో కార్మిక చట్టాలు & సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. 2019 జూన్ లో  జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో రాజ్యసభలో టిఆర్‌ఎస్ పక్ష ఉపనాయకుడిగా బండ ప్రకాష్‌ నియమితులయ్యాడు.

ఎమ్మెల్సీగా బండ ప్రకాష్..

తెలంగాణలో రాజకీయ సమీకరణలలో భాగంగా రాజ్యసభ సభ్యుడి పదవికి రాజీనామా చేయించింది బీఆర్ ఎస్ అధిష్టాన వర్గం. అప్పటికే ముదిరాజ్ మహసభ నేత పిట్టల రవీంధర్ కు ఖాయమైన ఎమ్మెల్సీ పదవి నాటకీయ పరిణామాల మధ్య బండ ప్రకాష్ కు దక్కింది. తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో 16 నవంబర్ 2021న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆ పదవిలో 30 నవంబర్ 2027 వరకు కొనసాగుతారు బండ ప్రకాష్ ముదిరాజ్.

రాజ్యసభలో లేవనెత్తిన పలు అంశాలు

– జులై 2019లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నాత్తరాల సమయంలో విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలో నూతన విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

– 2020 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మేడారం అభివృద్ధికి కేంద్రం రూ.1000 కోట్లు కేటాయించాలని, మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

శాసన మండలి డిప్యూటీ స్పీకర్ గా..

తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండ ప్రకాష్ ముదిరాజ్ కు ఈటెల రాజేందర్ ముదిరాజ్ బీజేపీలోకి వెళ్లిన తరువాత మంత్రి పదవి వస్తోందని ముదిరాజ్ జాతీ భావించింది. అయితే.. రాజకీయ విశ్లేషణలో భాగంగా ఆ పదవి స్థానంలో శాసన మండలి డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్ వేయాలని సీఎం కేసీఆర్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు.

కంగ్రాష్యులేషన్ బండ ప్రకాష్ భాయ్ సాబ్

– యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking