AP 39TV 01 ఏప్రిల్ 2021:
బొమ్మనహల్ మండల పరిధిలోని తారక పురం గ్రామంలో పలు సంవత్సరాలుగా లెవెన్ కె.వి విద్యుత్ లైన్లు వేలాడ బడి పలు ప్రమాదాలకు కారణం అవుతూ గత సంవత్సరం కూడా వైర్ల షార్ట్ కట్ తో గడ్డివాములు తగలబడి పోయి నా విషయం ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దృష్టికి వచ్చి ఆ సమస్య శాశ్వత పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపి లెవెన్ కె.వి విద్యుత్ లైన్ ఊరి బయట నుండి బయట ప్రాంతంలో వేయించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పనులను ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న తమ సమస్యలకు పరిష్కారం చూపినందుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి , చంద్ర శేఖర్ రెడ్డి , ఎల్. లోకేష్ , తదితరులు పాల్గొన్నారు.
R. ఓబులేసు,
ఏపీ 39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.