Header Top logo

Karma “burned” (story) కర్మ”కాలింది”  (కథ)

Karma “burned” (story)

కర్మ”కాలింది”  (కథ)

ఈ మధ్యే మా సమీప బంధువు అనగా మా పిన్ని భర్త చనిపోతె నేను హైదరాబాద్ కు వెళ్ళాను. ఉదయం పది గంటలకు బయలుదేరిన బస్సు మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమయానికి బస్ స్టేషన్ చెరుకుంది. బస్సు దిగి వెంటనే ఆటో మాట్లాడుకుని వాళ్ళింటికి చేరుకున్నాను. అప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను మా పిన్నిని, పిన్ని కొడుకు రంగారావుని, కూతురుని, ఇంకా అక్కడున్న దగ్గరి కుటుంబ సభ్యులను సమీపించి ఓదార్చడానికి  ప్రయత్నం చేశాను.

అటు తర్వాత  నేను కూడా అక్కడ  జరుగుతున్న కార్యక్రమంలో నేను తోచిన పని చేశాను. పట్టుమని పది మంది లేరు. అందులో నలుగురు డెబ్బై దాటిన వారే, ఎండా కాలం కదా ఎండలకు భయపడి రావల్సిన బంధు వర్గంలోమి చాలా మంది  రాలేదు. ఆ తతంగమంతా అయ్యే సరికి నాలుగు అయ్యింది. సూర్యా స్తమయం లోగా దహన కార్యక్రమాలు పూర్తి చెయ్యాలని హడావిడి చేసి పాడే లేపే సమయంలో అందరితో పాటు నేనూ ఓ చెయ్యి వేశాను. కొంత దూరం మోసి దగ్గరలోనే ఆపివుంచిన వాహనంలోకి తీసుకెళ్ళాము.

శ్మశాన వాటిక వరకు వెళ్ళలేదు. కర్మ చేయ వలసిన ముఖ్యమైన వాళ్ళు అదే మోటారు వావానంలో కూర్చుండిపోయారు. ఇక ఆ ఇంటి వారికి ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోవాలట ఇప్పుడే తెలిసిందీ విషయం. బయిటికొచ్చి చూశాను. తమ ఇంటికి టూవీలర్ మీద వెళ్ళబోతున్న మా స్వయాన నా చిన్న బావ తమ్ముడిని  సమీపించి  తనతో పాటు  వాళ్ళ ఇంటికి వెడదామని అతని వెనక కూర్చో బోయాను. ఎక్కడికి అన్నాడు. నేనన్నాను. మీ ఇంటికే నని.

కుదరదు అలా ఎలా వస్తావు ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఇంటికొచ్చిన తర్వాత నేను నా ఇంటికే నేరుగా వెళ్ళిపోవాలిట దిగు దిగుమన్నాడు. పరాయి ఊరి వాడి నైన నా పరిస్థితి ఏంటి అని అడిగాను అమాయకంగా. అందుకే ముందు బంధువుల ఇంటికి చేరుకుని మన లగేజి ఎదైనా వుంటే అక్కడ వాళ్ళింట్లోనే పెట్టుకుని చనిపోయిన వారి ఇంటికి వెళ్ళ వచ్చట. తిరిగి ఆ బంధువుల ఇంటికి వెళ్ళవచ్చని ధర్మోపదేశమిచ్చి నేను పూర్తిగా దిగకముందే స్కూటర్ పోనిచ్చాడు. ఓరి నీ అసాధ్యం కూల అనుకున్నాను. ఈ లాజిక్ నాకు అస్సలు అర్థం కాలేదు.

సర్లే అని నేను తిరిగి మా ఊరు వెడదామని బస్సు స్టేషన్ చెరుకున్నాను. సాయంకాలం ఐదు అయ్యింది.  ఆకలిగా వుంది. బస్ స్టేషన్ ఆవరణలోనే హోటళ్ళు  వున్నాయి. కానీ ఏంవీ తినాలని అనిపించ లేదు. దగ్గరే వున్న కొట్లో రెండు అరటి పళ్ళుకొని తిన్నాను. లోపలికి వెళ్ళి మా ఊరి బస్సు గురించి వాకబు చేస్తే  మరో “చావు”  వార్త చల్లగా చెప్పాడు.

అనివార్య కారణాల వల్ల  ఆ సాయంకాలం మాఊరు వెళ్ళ వలసిన బస్సుసర్వీసులు రద్దుచేశారట.  ఈ వార్త తెలియగానే బాగా నీరస పడిపోయాను ఏం చేయాలో తోచడం లేదు ఈ ఊళ్ళోనే  ఇంకా కొంత మంది దగ్గరి  చుట్టాలున్నారు. కాని వారికి  కనీసం ఫోన్ చేద్దామన్నా నాకు ధైర్యం చాల లేదు. నేను ఎవరింటికి వెళ్ళకూడదన్న సంగతి తెలుసుకున్నాక.  ఏంచేద్దాం. మర్నాడు బస్సులుంటాయో లేవొకూడా తెలియదు.

ఏదైనా మంచిహోటల్లో బస చేద్దామన్నా లేదా కారు మాట్లాడుకుని వెడదామంటే జేబులో అంత డబ్బు లేదు. ఏం చేయలేని పరిస్థితిలో బస్ స్టేషన్ లోనే ఎదో ఓ మూలనో కుర్చిమీదో మర్నాడు ఉదయం ఐదు గంటల వరకు సమయం వెళ్ళబుచ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాతో తెచ్చుకున్న వార్తా పత్రికలోని చదివిన వార్తలనే మళ్లీ మళ్ళీ చదివాను ఇక తప్పని పరిస్థితిలో కాల క్షేపం కోసం విజయవాడలో  నివసిస్తున్న మరో దగ్గరి బంధువు అనగా  హైదరాబాదు  మా పిన్ని కొడుకుకి స్వయంగా బావ మరిది. నాతో చాలా సరదాగా వుంటాడు.

పేరు వేణుగోపాల రావు నా వయసు వాడే. అతనికి  ఫోన్ కలిపాను. వేణుగోపాల రావు వెంటనే తెలుసుకున్నాడు. నేను హైదరాబాద్లో వున్నానని  ఫలాన పనికి వచ్చానని మరయితే మా పిన్ని కొడుక్కి స్వయంగా  బావమరిదివి కదా నువ్వెందుకు రాలేదు అని అడిగాను. తను  చెప్పిన కారణం ఏమిటంటే తను కన్యాదానం చేసి ఒక సంవత్సరం కూడా కాలేదట పైగా తన కూతురు ఐదు నెలల  గర్భిని కాబట్టి తను తన కుటుంబ సభ్యులు అటు అల్లుడి గారి కుటుంబ సభ్యులెవ్వరు రాకూడదట. అస్సలు వీల్లేదు అని ఘంట పదంగా చెప్పడం విని విస్తు పోయాను.

సర్లే ఇంకా వేణుగోపాల్ రావుతో మాట్లాడితే ఈ మూర్ఖపు  నమ్మకాన్ని వేదాలకు, పురాణాలకు ఆపాదించగల సాథ్యుడు అని ఫోన్ కట్టేశాను.  నాకు కాల క్షేపం కావాలిగా అని ఈనాటి కార్యక్రమానికి రాని మరో ఊళ్లో వున్న మరో బంధువుకు ఫోన్ కలిపాను. తప్పించుకోవడానికి  భలే కారణాలు చెబుతారు అని ముందే రెడీ అయిపోయాను. ఈయన గారు ఎవరంటే నా పిన్నికొడుక్కి తోడల్లుడు. చాలా మంచి వాడు. టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన గారు  రాలేని కారణం మరీ విడ్డూరంగా వుంది. తన రెండో కూతురుకు పెళ్ళి కుదిరిందిట ఈరోజే లగ్న పత్రిక రాయించుకుంటున్నారట. రావడానికి వీల్లేదు అని సెలవిచ్చాడు. మరో రోజు పెట్టుకోవచ్చుగా అని అడిగితే ఈరోజు చాలా.. మంచి రోజుట అని ఫోన్  పెట్టే ధోరణి ధ్వనిస్తుంది.

పోనీ ఇంట్లో చాలా మందే వున్నారుగా ఆయన పెద్దకొడుకు మరీ చిన్న పిల్లాడు కాదు ఉద్యోగం కూడా వెలగబెడుతున్నాడు. వాడినైన పంప వచ్చుకదా అన్నాను. ఊంహూ కుదరదట కుటుంబం మొత్తం రాకూడదనే పంతులు గారు చెప్పారని పంతులు గారి మీదికి తోచేశాడు. ఇది పూర్తిగా అర్థం లేదనిపించింది. ఇలాంటివే ఇంకెన్ని కారణాలుంటాయో అని రిసెర్చి చేస్తే  పి.హెచ్.డి చేయవచ్చనిపిస్తుంది.

ఈ సమాజం నుండి నేను చాలా విషయాలు నేర్చుకోవాలి సుమా అనిపించింది. నాలుగు వేదాలు తెలిసిన మహ పండితుడు మానాన్న ఇలాంటి విషాయలేవి చెప్పలేదు. చనిపోయిన వారింటికి వెళ్ళినా శవాన్ని తాకినా ఇంటికి వచ్చి  శుభ్రంగా  వేడి నీళ్ళతో స్నానం చెయ్యాలి అని మాత్రమే చెప్పాడు. ఎందుకంటే  చనిపోయిన వ్యక్తికి  ఏవైనా అంటువ్యాధులు కానీ ( వైరస్ గానీ బ్యాక్టిరియాగానీ)  వుంటే ఎవరికి సోకకుండా అంతే. అలాగే చిన్న పిల్లలు దూరంగా వుండాలని ఎందుకంటే చిన్న పిల్లలకు అంటువ్యాదులు  తొందరగా అంటుకుంటాయని.

అతి కష్టంగా రెండుగంటలు గడిచింది. మళ్ళో  రెండుఅరటి పండ్లుకొని తిన్నాను. నాలాగే  చాలా మంది   బస్ స్టేషన్లో  వుండి పోయారు. రాత్రి పది దాటింతర్వాత  కూర్చోనే కొంతమంది కునికిపాట్లు పడుతున్నారు. కాని నాకు నిద్ర రావడం లేదు. అటూ ఇటూ రెండు రౌండ్లు నడిచాను. అప్పుడే ఒక  బస్సు వచ్చింది కిక్కిరిసిన జనాలనేసుకుని అదే ఆఖరి బస్సు అనుకుంటాను. నేను.బస్సు.దిగుతున్న వారివైపు అప్రయత్నంగా చూస్తుండి పొయాను.  అందులోంచి నా స్నేహితుడు వినోద్ లగేజీతో దిగాడు.

నేను వచ్చిన పని  జ్ఞాపకం రాగానే నేను వాడిని కూడా కలవ వద్దనుకుని వెను తిరిగాను. కాని వాడే నా దగ్గరకు వచ్చి నన్ను పలకరించాడు. మేమిద్దరం ట్రేనింగ్ సమయంలో రూం మేట్స్ మి. కొద్ది రోజుల్లోనే చాలా దగ్గరయ్యాడు. ఇద్దరం ఒకర్నొకరం అరే ఒరేయ్ అనుకునే చనువువుంది. ఈ ఊరు ఎందుకొచ్చానో తిరుగు ప్రయాణాంకి బస్సులు రద్దు అయినసంగతీ చెప్పాను.

ఐతే పద మా ఇంటికి అన్నాడు. వద్దులే రాకూడదట అని అన్నీ విషయాలు చెప్పాను.    ఈ రోజుల్లో ఈమూఢాచారాలు ఈ మూర్ఖపు పద్దతులేంట్రా పద పద అని వాడి ఇంటికి నన్ను బలవంతంగా ఒక ఆటో మాట్లాడుకుని తనతో పాటు కూర్చోబెట్టుకుని  తనకు ఎదురైన ఇలాంటి అనుభవం నాతో చెప్పసాగాడు. తనకు తెలిసిన ఒక ఊర్లో ఒక కుటుంబంలో ఇద్దరన్నదమ్ములు. ఇద్దరు ఉద్యోగాలు చేసి రిటైరైన వారె. ఇద్దరిలో అన్నగారికి మధుమేహాం ఎక్కువే. దానికితోడు బి.పి. ఇంకేవుంది రెండు కిడ్నీలు పనిచేయలేదు. హాఠాత్తుగా హైదరాబాద్ నిమ్స్ లో  చెర్పించారు. కానీ ప్రాణం దక్కలేదు.

శవాన్ని అదే రోజు  అంబులెన్సులో ఊరికి తరలించగా ఊరి పొలిమేరలోనే తమ్ముడు మరో ఇద్దరు పెద్దవారిని పోగేసుకుని వాహనానికి అడ్డు పడి శవాన్ని ఇంటికి తేవద్దని  గొడవపడ్డాడు. ఎందుకంటే ఆ ఇద్దరన్నదమ్ములు పూర్వీకుల ఇంటిని సమంగా చేసుకుని ఇద్దరు చెరో వైపు జీవిస్తున్నారు. ఇప్పుడు తమ్ముడి వాదన ఏమిటంటే, తన కూతురు ఏడో నెల గర్భందాల్చి మొదటి కాన్పు ఆనవాయితీగా పుట్టింటి వారే చేయాలి.

కాబట్టి తన ఇంట్లోనే వుందని,  ఆ  ఇరు కుటుంబాలు నివసిస్తున్న ఆ పాతకాలం నాటి ఇంటికి ఒకే చూరు వుంది. కాబట్టి అది ఒకే ఇంటిగా పరిగణించాల్సి వస్తుందట. అన్నగారి శవాన్ని ఇంటికి తేకూడదని తనతో తెచ్చుకున్న పెద్దవాళ్ళతో కూడా చెప్పిచ్చాడు. అప్పటికే సాయంత్రమయ్యింది.

భర్త చనిపోయి రోధిస్తున్న భార్యను కనీసం ఓదార్చేవాడు లేడు. చేసేదేమి చేయలేక  రాత్రికి రాత్రికి ఊరికి దూరంగా వున్న తమ పొలంలో బోర్ వేసే వారిని పిలిపించి బోర్ బాయివేయించి, అక్కడే టెంట్లు వేయించుకుని అపర కర్మలన్ని చేసి శవాన్ని ఊరికి చెందిన శ్మశాన వాటికలో దహనం చేసారు. ఆ పదమూడు రోజులు అక్కడే పొలంలో వేసుకున్న టేంట్లోనె  నిత్య కర్మ కార్యక్రమాలు నిర్వహించాల్సి  వచ్చిందని ముగించాడు.

చాలా అన్యాయం తన స్వంత ఇంటి లోకికూడా శవాన్ని తీసుకు రాలేని, తీసుకు  రాకూడని  ఇంత ఘోరమైన మూర్ఖత్వం  విని విస్తుపోయాను.  ఈలోగా ఇల్లు  చేరుకున్నాము. నేను నా స్నేహితుడి ఇంట అడుగు పెట్టే ముందు నేను మనసులోనే వాడికి హృదయపూర్వకంగా థాంక్స్ చెప్పుకున్నాను. వద్దు వద్దన్నా వినకుండా వినోద్ భార్య విసుగు చెందకుండా అంత  రాత్రి, తయారుగా వున్న  పెరుగు ఆవకాయతో అన్నం మా ఇద్దరికి  వడ్డించింది.  భోజనం తిని ఐదున్నర  గంటలకు అలారం పెట్టుకుని పడుకున్నాను. ఎండలో బాగా అలసిపోయాను కదా  బాగా నిద్ర పట్టింది.  పొద్దున్నే అలారం మోగింది. లేచి కాలకృత్యాలు తీర్చుకుని  హాల్లోకి వచ్చి వెళ్ళెందుకు సిద్దమవుతండగా  నా మిత్రుడు  వినోద్ అతని భార్య ఇద్దరూ లేచారు.  అతని శ్రీమతి నాకు కాఫి కలిపిచ్చింది.  వివరాలేవి తెలియవని నాకో  క్యాబ్ బుక్ చేయమన్నాను.

ఇంతలో నా  ఫోన్ మోగింది ఎవరా అని   వెంటనే  హలో అన్నాను. మా  పిన్ని భర్త చనిపోతే రావల్సిన ముఖ్యమైన  వ్యక్తి అంటే మా పిన్ని కొడుక్కి  స్వయాన బావ మరిది పేరు వేణు గోపాల్. రాత్రి మాట్లాడానే అతనే.  ‘నేను వేణుగోపాల్ ను మాట్లాడుతున్నాను’  గొంతులో జీర ద్వనిస్తుంది.  “రాత్రి నిద్రలోనే మానాన్న చనిపొయాడు అని చెప్పి సైలెంట్ అయిపోయాడు.

“అలాగా.. “మరీ నువ్వు కన్యాదానం చేసి సంవత్సరం కూడా కాలేదు పైగా నీ కూతురు గర్భిణి మరెలా”  అని అడిగేశాను అతనితో నాకు వున్న చనువుతో.

“అదే కదా కర్మ కాలింది. ఇప్పుడు  నేను చేయక తప్పదుగా” అన్నాడు. కాస్తా విసుగుతో తండ్రికి అంతిమ సంస్కారము  చేయవలసిన కొడుకు తండ్రి పట్ల్ల మాట్లాడుతున్న ధోరణి, అతి మూర్ఖత్వపు నమ్మకాలతో.   కూతురు వైపే మొగ్గు  చూపుతున్న ప్రేమ పట్ల నాకు ఆశ్చర్యం కలిగించింది. వేణు గోపాల రావు ఫోన్ పెట్టేశాడు. తన దాకా వస్తే విసుగుతోనైనా సరె అన్నింటికి సడలింపులుంటాయి. చచ్చినట్లు ‘కర్మ” చెయ్యాల్సిందే. ఇతరుల విషయంలో సడలింపులుండవు మూర్ఖులకు అని నా లోనే అనుకోవాల్సిన మాటలు పైకే  అనుకుంటూ  ఫోన్ నా భార్యకు కలిపాను. వినోద్ దంపతులకు ఏం అర్ధం కానట్లుంది ప్రశ్నార్థకంగా నా వైపుచూస్తున్నారు. ఇంతలో  నాకు ఫోన్ కలిసింది.

“ఏంవిటండి రాత్రే వస్తానన్నారు రాలేదు” అంది నా భార్య

“ రాత్రి బస్సు  కాన్సిల్ అయ్యింది.  ఎలా వచ్చేది.. అది సరే మన అమ్మాయి గాని నెల తప్పిందా” అని అడిగాను సంబంధం లేకుండా.

“లేదు! అదేంటండి అలా అడిగారు?”  అన్నది ఊహించని ప్రశ్నకు  ఆశ్చర్యంగా  నవ్వుతూ..

“….. మరేం లేదులే”  ఊరికే అలా అన్నాను. కర్మకాలి నాకు కూడా అంటుకుందా ఏవిటి ఈ అంటువ్యాధి  అని మనుసులో అనుకుంటూ ఫోన్ కట్ చేసి వినోద్ వైపు తిరిగి “వస్తారా”  అని వెంటనే నాలిక్కరుచుకుని   “సారీ” అన్నాను. నేను హైదరాబాద్ కు వచ్చిన పని గుర్తుకొచ్చి.

“మరేం పర్వాలేదురా బయట క్యాబ్ వేయిటంగ్ లో వుంది.  బై” అన్నాడు చిరు నవ్వుతో నేను ఆ దంపతులకు  హృదయపూర్వకంగా చేతులు జోడించి బయిటికి నడిచాను.

‘‘మనమ్మాయి నెల తప్పితే  నేను మరెవ్వరు చనిపోయినా వెళ్ళక్కర్లేదు” అన్నాను.

“ అదేవిటి వింత కోరిక ! ఒక్క నిమిషం ఆగండి మరో ఫోన్ మొగుతుంది”  అని నన్ను ‘హోల్డ్ లో పెట్టింది.

నేను మాట్లాడకుండా ఫోన్ అలాగే పట్టుకొని వున్నాను. ఏవిటో తెలుసుకుందామని. మళ్ళీ తనే  నా లైన్లోకి వచ్చి “ ఏవండి కంగ్రాట్చులేషన్స్ ‘ మీరు తాత కాబోతున్నారు. నేను అమ్మమ్మని. ఇప్పుడే ‘ వైజాగ్  వియ్యంకురాలు”  ఫోన్ చేసి చెప్పింది.  మన అమ్మాయికి మూడొ నెలట’

“మూడొ నెలైతే ముందే చెప్పలేదు” అన్నాను.

“అవును మూడో నెల వరకు ఆగి చెప్పాలని అనుకున్నారట” సరె అని చెప్పి ఫోన్  కట్ చేశాను.

నా సంతోషానికి అవధులు కేకుండా పోయింది. విషయం వినోద్ దంపతులకు చెప్పగానే ఇద్దరు నాకు అభినందనలు తెలిపారు. నేను   “వస్తారా”  అని వెంటనే   “సారీ” అన్నాను. నేను హైదరాబాద్ కు వచ్చిన పని గుర్తుకొచ్చి.

“మరేం పర్వాలేదురా బయట క్యాబ్ వేయిటంగ్ లో వుంది  బై” అన్నాడు.  నేను ఆదంపతులకు  హృదయపూర్వకంగా చేతులు జోడించి బయిటికి నడిచాను.

Karma "burned" (story) కర్మ”కాలింది” (కథ)

కోట ప్రసాద్, రచయిత

సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు

Leave A Reply

Your email address will not be published.

Breaking