Header Top logo

హైద‌రాబాద్ లో జ‌ర్న‌లిస్టులకు ఇళ్ల స్థ‌లం రావాలంటే

మళ్లోస్తున్నాయిరో మాయదారి ఎలక్షన్ లు..

ఔను.. ముప్పయి ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాంతాలలో నక్సల్స్ ప్రభావం ఎక్కువ ఉండే ప్రాంతాలలో వినిపించిన పాట ఇది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడి  ఎనిమిది ఏళ్లు గడుస్తున్నాయి. మరో ఏడాదిలో అసెంబ్లీకి ఎలక్షన్ లు వస్తాయి.. ఇప్పుడు జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు అనే చర్చ విసృతంగా కొనసాగుతుంది. 

కేసీఆర్ ప్రభుత్వం ముందస్తుకు పోతే రేపో మాపో కూడా ఎలక్షన్ లు రావచ్చు. ఇగో ఆ ఎలక్షన్ లకు ముందు మరోసారి హైదరాబాద్ లో ఇళ్ల స్థలాల చర్చ తెరపైకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా జర్నలిస్ట్ లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ సి.హెచ్. దేవేంద‌ర్ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇది..

– యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్

—-      ——     ——

హైద‌రాబాద్ లో జ‌ర్న‌లిస్టులకు

ఇళ్ల స్థ‌లం రావాలంట…

హైద‌రాబాద్ లో జ‌ర్న‌లిస్టులకు ఇళ్ల స్థ‌లం రావాలంటే ప్ర‌భుత్వం అలోచిస్తున్న తీరు ఇలా ఉంద‌ని అనిపిస్తుంది. వీటికి దీటుగా స‌మాధానం, విశ్లేష‌ణ ఎలా ఉండాలో రేపు చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంది.

ఈ నాలుగు రోజులుగా హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టుల ఇండ్ల జాగా పై జ‌రుగుతున్న ర‌చ్చ‌. అధికారికంగా అల్లం నారాయ‌ణ గారి మీటింగ్ దృష్టా కొన్ని విష‌యాలు చేదుగా అనిపించినా చ‌ర్చించుకోవాల్సి ఉంటుంది. తిట్టుకున్నా.. నిజం ఎంటో భ‌య‌ట‌కు రావాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వం అలోచ‌న ఎలా ఉంది. అయినా ఈ లోపు ఎలా ల‌బ్దిపొందాలో విశ్లేచించుకోవాల్సి అవ‌స‌రం ఉంది.

ఇళ్ల స్థ‌లాల విష‌యంలో జ‌ర్న‌లిస్టులం మూడు ర‌కాలుగా విడిపోయినాం.

1. ఐదేళ్ళ సినియార్టీతో 2008లో జె.ఎన్.జెహెచ్.ఎస్. భూములు కేటాయించ‌డం. డ‌బ్బులు పోగు చేసుకోని ప్ర‌భుత్వానికి ఇవ్వాల్సి ఉండ‌గా సోసైటీ వ‌ద్ద‌నే ఉండ‌టం. హైద‌రాబాద్ కి 60 కిలోమీట‌ర్ల లోపు ఇళ్లు ఉంటే మ‌ళ్లీ జాగా ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని హైకోర్టులో రావు చెల‌కాని వేసిన పిటిష‌న్ పై ఇన్నాళ్లు వేయిట్ చేయాల్సి వ‌చ్చింది.

లేకపోతే ఇప్ప‌టికే నాలుగు బ్యాచ్ లు తీసుకున్న‌ట్లు 1100 మందికి నెల‌కు 50 వేల రెంట్స్ వ‌చ్చేవి. దుర‌దృష్టం అలా జ‌ర‌గలేదు. కాలం గిర్రున తిరిగే స‌రికి 14 ఏండ్ల వ‌న‌వాసం త‌ర్వాత సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కేటాయించిన జాగా మీదే అభివృద్ది చేసుకోవ‌చ్చు. జ‌ర్న‌లిస్టులను ప‌బ్లిక్ స‌ర్వేట్స్ తో పొల్చ‌వ‌ద్ద‌ని సోసైటీల‌న్నింటికి చెక్ పెడుతూ ఇచ్చేశారు.

అయితే ఆ తీర్పు ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు అంద‌రి జ‌ర్న‌లిస్టుల‌కు , సోసైటీల‌కు అనుకూలంగా లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వం అలోచ‌న‌లో ప‌డింద‌ని తెలుస్తుంది. ఈ క్ష‌ణంలోనే ఇందుకు కొంతమంది జర్న‌లిస్టుల మ‌ధ్య చిచ్చు పెట్టి చ‌లి మంట‌లు కాగుతున్నారని కొంద‌రు – స‌భ్య‌త్వం ఇచ్చినప్పుడు మా 35 మందికి అన్యాయం జ‌రిగింద‌ని వారి వ్య‌క్తిగ‌తం విష‌యాల‌తో సోష‌ల్ మీడియాలో తెగ కొట్టుకుంటున్నారు.

ఈ మొద‌టి ర‌కం ఇళ్లు రాని జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌భుత్వం చాలా లెక్కులు వేసుకుంటుంది. 1100 మంది కి ఇస్తే.. ఈ 15 యేళ్ల‌లో 19 సంవ‌త్స‌రాల సినియార్టీ ఉన్న జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి ఎంటీ..? ఆంధ్ర‌కి వెళ్లిపోయినా.. అక్క‌డ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో ల‌బ్ది పొందుతున్న వారికి తెలంగాణ‌లో ప‌నిచేసే జ‌ర్న‌లిస్టుల‌ను కాద‌ని ఇస్తే.. 4000 మంది ఓట్లు వేసే జ‌ర్న‌లిస్టుల కుటుంబాల ప‌రిస్థితి పై అలోచిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

ఇంకో 100 ఎక‌రాలు ఇస్తే అంద‌రికి వ‌స్తాయి క‌దా అని అనుకుంటే.. అందుకు మ‌న‌స్సు ఒప్ప‌డం లేదు. ఇప్ప‌టికే భూములు అమ్మి ఖ‌జానా నింపుకోవాల‌నుకుంటున్న ప్ర‌భుత్వం 2000 కోట్ల అస్తిని 900 మందికి ఎలా ఇస్తామ‌నుకుంటున్నారో చెప్పా    ల‌ని స‌న్నిహితుల వ‌ద్ద చెప్పిన‌ట్లు వినికిడి. ఇలా అన్నింటిని క‌ల‌గ‌లిపితేనే అసెంబ్లీలో కేటీఆర్ రియాక్ష‌న్ అని ఫీడ్ బ్యాక్.

ఇవేమి లేకుంటే.. వారంలో క్లియ‌ర్ చేసి.. హైద‌రాబాద్ లో అంద‌రి జ‌ర్న‌లిస్టుల‌కు జాగా ఇచ్చామ‌ని చెప్పుకునే వారు. ఈ విష‌యాల‌ను ఎలా అవ‌రోదించాలో మొదటి త‌రం ఇళ్లు రాని దోస్తులు అలోసించి మీటింగ్ లో గ‌ట్టిగా వాద‌న‌లు వినిపించాలి.

2. ఎన్నో త‌రాలుగా భూములు తీసుకున్న జూబ్లిహిల్స్ హౌజింగ్ సోసైటీ స‌భ్యుల‌ది. ఇక్క‌డ క‌డుపు కాలి ఇళ్లు రాని స‌భ్యులు ఎడుస్తుంటే.. కొడిగుడ్డు పై ఈక‌లు పీకుతూ జర్న‌లిస్టుల ఇళ్లంటేనే పెద్ద స‌మ‌స్య‌గా ప్ర‌భుత్వం భావించేలా చేశారు ఇళ్లు తీసుకున్న పెద్ద మ‌నుషులు. గోప‌న్ ప‌ల్లిలో వివాదంలో ఉన్న 9 ఎక‌రాల 18 గుంట‌ల‌ను ఎలా మ‌న కుటుంబాల‌కు ఇవ్వాల‌నే జాస లేకుండా.. వారి స్వార్ధం కోస‌మే కోట్లాడుకుంటున్నారు.

అందులో మ‌రో 1200 మంది వ‌ర‌కు నాన్ అలాంటీస్ ఉండ‌టం.. స‌భ్య‌త్వం పైన్నే హై కోర్టు దాక చేరుకోవ‌డంతో ప్ర‌భుత్వం ఈ సోసైటీకి న్యాయం చేసేలా క‌నిపించ‌డం లేదు. వీరికి గ‌తంలో లా భూములు కేటాయించినా స‌రైన మార్గంలో న‌డిపించే వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డం ఆ సోసైటిని రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు తిరస్క‌రించి కొత్తది పెట్టించారంటే.. ఇప్పుడు ఆ సోసైటీ నుంచి ఎలా ఇవ్వ‌గ‌ల‌మోన‌ని ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేస్తుంది.

మ‌రి ఈ 72 ఎక‌రాలు క్లియ‌ర్ చేస్తే.. ప్ర‌భుత్వం మ‌ధ్య జ‌ర్నలిస్ట్ సోసైటీ వివాదం ఉన్న ఈ 9 ఎక‌రాల భూమిని ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని అది ఇచ్చేసినా 5 సంవ‌త్స‌రాల సినియార్టీ ఉన్న వారంద‌రికి ఇవ్వ‌గ‌ల‌మా.. క‌నీసం తెలంగాణ కంటే ముందు ఒక్క ఏడాది ప‌ని చేసిన జ‌ర్న‌లిస్టులంద‌రికి ఇవ్వోచ్చాని అలోసిస్తే.. అలా కూడా సాధ్యం కాద‌నుకున్న‌ర‌ట‌.. ఈ అంశం పై ఈ సోసైటీలో ఉన్న స‌భ్యులు గ‌ట్టిగా వాద‌న‌లు వినిపించాల్సి ఉంది.

3. ఏ సోసైటీలో లేకుండా.. తమ యూనియ‌న్ సోసైటీ పెడితే అంద‌రు వ‌స్తార‌ని ఫీల్ అయి స‌భ్య‌త్వం తీసుకున్న వారు ఇలా మ‌రో 2 వేల మంది జ‌ర్న‌లిస్టులు ఉన్నారు. ఇందులో కెమెరా మెన్స్, ఫోటో జ‌ర్న‌లిస్టుల‌కు పెద్ద పీట వేశారు. కేసీఆర్ గారు ఖ‌మ్మంలో రాసేవారే కాదు ఫోటో, కెమెరా జర్న‌లిస్టులు చాలా ముఖ్యం అన్నారు. అంటే వారి అర్ధిక ప‌రిస్థితి, క‌నీస వేత‌నం రాకుండా ప‌నిచేస్తున్నార‌ని ఇప్ప‌టికే ఇళ్లు ఉండి.. ఆర్ధికంగా నిల‌దొక్కుకున్న వారే ఎగ‌బ‌డిపోతున్నారు.

పేద వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి ఏంటో తెలుసు కాబ‌ట్టే నేనే మీ నాయ‌కున్ని అని చాలా సార్లు క‌లిసిన‌ప్పుడు చెప్పారు కూడా.. సో.. వీరదంరికి న్యాయం చేయాలంటే అంద‌రిని ఓకే తాటి పై క‌ట్టేలా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. 900 మంది ఒక వైపు అయితే 2900 మంది మ‌రో వైపు ఉన్నార‌ని భావిస్తున్నారు. ఇచ్చిన హామి మేర‌కు ఎలా న్యాయం చేయాలో కుస్తీలు ప‌డుతున్నారు.

కాని మ‌న‌మే ఒక్క యూనిట్ గా.. కాంప్ర‌మైజింగ్ గా ఉంటేనే ఈ ఎన్నిక‌ల లోపు ఎదైనా, స‌రైనా నిర్ణ‌యం రాబోతుంది. లేదంటే మ‌ళ్లీ కోర్టుల చుట్టు తిర‌గాల్సి వ‌స్తుంది. బ్యూరో చీఫ్ లు, ఎడిట‌ర్స్ మాత్ర‌మే డిస్క‌స్ చేసుకుని ఓ నిర్ణ‌యానికి రావ‌ద్ద‌ని వీడియో, ఫోటో , వీడియో, పైన రెండు సోసైటీలో లేని వారు అంటున్నారు.

ఇక సి.ఎం. అనుకుంటే 5 నిమిషాల ప‌ని. కాని ఆ దిశ‌గా అడుగులు వేయ‌డం క‌ష్టం. రాజకీయ ల‌బ్ధి ఆ రోజు జ‌ర్న‌లిజం, ఈనాటి సోష‌ల్ మీడియా ప్ర‌భావం, పేద జ‌ర్న‌లిస్టులు, కార్పోరేట్ జీతాల జ‌ర్న‌లిస్టుల ఆర్ధిక స్తోమ‌త కూడా ఈ నిర్ణ‌యానికి అడ్డుచెప్పుతున్నాయ‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. సో.. వీట‌న్నింటికి ప‌రిష్కారం దొర‌కాలంటే.. సుప్రీం కోర్టు ఆర్డ‌ర్ సంజీవ‌నీ కాద‌ని, మాకు ఇప్పుడు 19 యేళ్ల సినియార్టీ వ‌చ్చింది. అన్యాయం జ‌రిగింద‌ని బ‌ట్ట‌లు చింపుకోకుండా.. ఎలా అయితే అంద‌రికి న్యాయం జ‌రుగుతుందో ఆ దిశ‌గా అంశాల‌ను చ‌ర్చించాల‌ని, కొంద‌ర‌గా సొంతింటి క‌ల నేర‌వేరాలంటే అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా ఎలా ఉండాలో నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

నోట్ ; ప్ర‌భుత్వంతో ఫైట్ కూడా చేయ‌వ‌చ్చు. కాని నిర్మించిన డ‌బుల్ బెడ్ రూంల‌నే ఇచ్చే ధైర్యం చేస్తాలేరంటే.. మ‌న‌కు ఇళ్ల జాగా ఇవ్వం అంటే ఏమి చేసేది లేదు. కాని ఇళ్ల కోస‌మే ఇంకా ఈ వృతిలో ఉండి జీవితాంతం నాశ‌నం చేసుకున్న వారు ఉన్నారు. వాళ్ల కోస‌మైనా అలోచించాలి. ప్ర‌భుత్వ‌మే 10 యేళ్ల క్రితం హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంటే అంద‌రికి భారీగా న‌ష్టం వాటిళ్లుతుంది.

చాల మందికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కాని ప్రాక్టిక‌ల్ గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇట్లు,
సి.హెచ్. దేవేంద‌ర్ రెడ్డి
9848070809.

Leave A Reply

Your email address will not be published.

Breaking