Header Top logo

ఐజెయు మహాసభలకు తరలి వచ్చిన జర్నలిస్టులు

ఔను… మీరు చదివింది నిజమే.. తెలంగాణలోని జిల్లాల నుంచి జర్నలిస్టులు తరలి వచ్చారు. ప్రత్యర్థి జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసినా.. జర్నలిస్టులు భారీగా తరలి రావడంతో సభా ప్రాంగణం కిటకిటలాడింది.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెెరువులోని జిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రారంభమైన  తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ద్వితీయ మహాసభలు మరియు మూడు రోజుల ఇండియన్ జర్నలిస్టు యూనియన్ మూడు రోజుల ప్లీనరకి పెద్ద ఎత్తున జర్నలిస్ట్ లు తరలి వచ్చారు. 

రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన జర్నలిస్టులతో సభా వేదిక కిక్కిరిసిపోయింది.
తెలంగాణ అమరవీరులకి జర్నలిస్టు అమరవీరులకి మౌనం పాటించి సంతాపం తెలిపింది జర్నలిస్టు మహాసభ.

మహాసభలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ఆప్కారి శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి టి యు డబ్ల్యూ జే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, ఇస్మాయిల్       హాజరయ్యారు.

మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి సారథ్యంలో ఏర్పడిన టి యు డబ్ల్యూ జే తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిందని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆరోగ్యాన్ని కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా వార్తల సేకరణలో జర్నలిస్టుల శ్రమ వర్ణనాతీతం అయినా ఉద్యోగ భద్రత కరువైందని అన్నారు.

జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. టాలెంట్ ఉన్న జర్నలిస్టుల కు డిజిటల్ మీడియా ప్రత్యామ్నాయంగా మారిందని అన్నారు. మీడియా ముసుగులో కొంతమంది వక్రీకరించి వార్తలు రాస్తున్నారని మండపడ్డారు. ప్రధానమంత్రి మోడీ గడిచిన తొమ్మిది సంవత్సరాలలో ఒక్కసారి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 350 మంది జర్నలిస్టులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని అన్నారు.

రాష్ట్రంలో భర్తలను కోల్పోయిన జర్నలిస్టు భార్యలకు 3000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జర్నలిస్ట్ కుటుంబాలకు ప్రభుత్వం మరియు టియూడబ్ల్యూజే అండగా నిలుస్తుందని అన్నారు.

తెలంగాణ ఉద్యమానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించి యూనియన్లలో రాజకీయాలు చేసిన యూనియన్ నాయకులు ఈరోజు నీతులు చెప్పటం సిగ్గు చేటు అని మండిపడ్డారు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న యూనియన్లు మాపై విమర్శించడం సరికాదని హెచ్చరించారు. టీయూడబ్ల్యూజే బలమేంటో తెలుసుకొని, చూసి మాట్లాడాలని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో టీయుడబ్ల్యూజే 10,000 మంది జర్నలిస్టులతో బలపడిందని అన్నారు. సభకు సహకరించిన పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సభ ఏర్పాట్లను అద్భుతంగా చేసిన మెదక్ జిల్లా జర్నలిస్టులను అభినందించారు.

తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న‌ అనుబంధం ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపు సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు.

వాడు ఎవడో ఆంధ్ర ఏడవ… జనాలు రారు అన్నారు…ఇది ఒరిజినల్ ఫోటో ర బాబు….మార్ఫింగ్ కాదు… మాది తెర చాటు పైరవిల యూనియన్ కాదు..ఉన్నది ఉన్నట్టు..కుల్లామ్ కుల్లా…

Leave A Reply

Your email address will not be published.

Breaking