ఎన్ కౌంటర్ అంటే ఏంటో తెలుసా..
హైదరాబాద్ : దిశా ఎన్ కౌంటర్ ఏంటో తెలుసు గదా.. గదే ఒంటరిగా ఉన్న అమ్మాయిని పట్టుకుని రేప్ చేసిన సంఘటన.. గా అమ్మాయిని రేప్ చేసినోళ్లను పట్టుకున్న పోలీసులు ఎన్ కౌంటర్ చేసినప్పుడు పబ్లిక్ సంతోషం పట్టలేక గాళ్ల మీద పూలు పోసిండ్రు.. దునియంతా సంతోష పడి పోలీసోళ్లు తోపుగాళ్లు రేప్ చేసినోళ్లను కాల్చీ మంచి పని చేసిండ్రని కూడా మెచ్చుకున్నారు.
ఎన్ కౌంటర్ చేయచ్చా…
ఔను.. గిప్పుడు ఎన్ కౌంటర్ అనే మాట కామన్ అయ్యింది. ఓళ్లన్న పెద్ద తప్పు చేస్తే గాళ్లను పోలీసులు ఎన్ కౌంటర్ చేయాలని పబ్లిక్, పొలిటికల్ లీడరులు కూడా డిమాండ్ చేస్తుండ్రు.
కానీ.. ఎన్ కౌంటర్ అంటే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరుపడం.. ప్రాణపాయం ఉందని భావించినప్పుడు పోలీసులు కాల్పులు జరుపచ్చు..
పదేళ్ల కిందట మన తెలంగాణలో నక్సలైట్లు ఉన్నప్పుడు ఎన్ కౌంటర్ లు రోజు జరిగేవి. గప్పుడు ఓళ్లన్న గీ ఎన్ కౌంటర్ లు బూటకం అంటే గాళ్లను కూడా నక్సలైట్లు అనేటోళ్లు పోలీసులు..
దిశా ఎన్ కౌంటర్ పై విచారణ
గీ ప్రజాస్వామ్య దేశంలో ఓళ్లు తప్పు చేసినా.. పోలీసులు అరెస్టు చేసినంకా కోర్టులో విచారణ పూర్తయిన తరువాత గా జడ్జీ చెప్పితే శిక్ష అమలు చేయాలి.
కానీ.. దిశా ఎన్ కౌంటర్ లో పోలీసులు కావాలని కాల్పులు జరిపి ఎన్ కౌంటర్ పేరిట నలుగురు నిందితులను పోలీసులు హత్య చేశారని సిర్పూర్కర్ కమిషన్ నివేధిక పేర్కొంది.
గీ నివేధికపై దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు హైదరాబాద్ లోని హైకోర్టులో విచారణ చేయాలని ఆదేశించింది.
అంతే.. గత నెల 19న హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో నేడు మరోసారి. విచారణ జరగనుంది. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని బాధితుల తరపు పిటిషనర్ హైకోర్టును కోరారు.
- వయ్యామ్మెస్ ఉదయశ్రీ