AP 39TV 19ఏప్రిల్ 2021:
యస్ సి జన సంఘం జాతీయ అధ్యక్షుడు దాసగానిపల్లి కుళ్లాయప్ప ఆధ్వర్యంలో అనంతపురం లో టవర్ క్లాక్ దగ్గర ఎస్సీ కార్పొరేషన్ నిధులు మళ్లింపు మరియు పథకాల రద్దుపై ఒక్క రోజు చేపట్టిన నిరాహార దీక్ష. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన 15 స్కీములు యధావిధిగా కొనసాగించాలని మరియు బహుజనుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ నిధులు కచ్చితంగా అమలు పరిచేలా ఏ పరిస్థితుల్లో ఉన్న పక్కదారి మళ్ళించకుండా న్యాయం చేయాలని యస్ సి జన సంఘం నిరాహార దీక్ష చేపట్టారు. ఆ దీక్షకు మద్దతుగా బహుజనుల సంక్షేమ సంఘం నాయకులు గోగుల ఆంజనేయులు, డాక్టర్ కుల్లాయప్ప, బీసీ సంక్షేమ సంఘం సాకే నరేష్, రాయలసీమ ప్రజా సేవా సమితి అధ్యక్షుడు శ్రీరాములు తదితరులు తెలిపారు.