రాప్తాడు నియోజకవర్గం రూరల్ మండలం కక్కలపల్లి మరియు కొడిమి పంచాయితీ చెందిన టిడిపి నాయకులు సుంకన్న, మస్తాన్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 80 కుటుంబాలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే తోపుదుర్తిప్రకాష్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తోనే రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు బండి పవన్ , గోవింద్ రెడ్డి , రూరల్ జెడ్పిటిసి అభ్యర్థి చంద్ర , మండల యూత్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాసులు మండల గ్రీవెన్స్ సెల్ ఇంచార్జ్ రాజ, మండల నాయకులు తిరుపాల్, మనోజ్ కుమార్,మండల నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు. ,