Header Top logo

రాయదుర్గం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక కార్యాలయంలో దీక్ష

AP 39TV 08మే 2021:

రాయదుర్గం:కరోనా సెకెండ్ వెవ్ నివారణలో మరియు కరోనా బాధితులకు ఆసుపత్రిలో బెడ్లను,ఆక్సిజన్ అందించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పట్టణ టీడీపీ నాయకులు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 18 సం, లు నిండినా వారందరికీ కరోనా వ్యాక్సిన్ చేయాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలనే నినాదంతో పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మస్కులు ధరించి, నిరసన దీక్ష చేపట్టారు. కౌన్సిలర్ ప్రశాంతి, నాయకులు పోరాళ్ల పురుషోత్తం, కడ్డిపూడి మహబూబ్ బాషా లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం, అసమర్థతకు నేడు రాష్ట్ర ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాలు టీకా కొనుగోలుకు పోటీపడుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యర్థులపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికి పోటీ పడుతున్నారన్నారు. 18 ఏళ్ళు దాటినా వాళ్లందరికీ వ్యాక్సిన్ ఉచితంగా వెయిస్తామని చెప్పి ఇంతవరకు వేయించలేదన్నారు. ఒకపక్క ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితుల ప్రాణాలు పోతుంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారన్నారు. కావున 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ చేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో 29 వ వార్డు కౌన్సిలర్ బుళ్లారి జ్యోతి, మండల కన్వీనర్ హనుమంతు, మాజీ ఎంపీపీ రాఘవ రెడ్డి నాయకులు బండి భారతి, పూజారి తిప్పయ్య, నాయకుల తిప్పేస్వామి,పైతోట సిద్ధప్ప,దానవేంద్రప్ప, మల్లీ, నాగరాజు నాయక్, యువత పైతోట అంజి, జానకి రాముడు, భరత్, దాసరి నవీన్, దాసరి సత్తి, బాషా తదితరులు పాల్గొన్నారు.

 

 

 

R.ఓబులేసు,
ఏపీ39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.

Leave A Reply

Your email address will not be published.

Breaking