Header Top logo

శింగనమల మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

AP 39TV 08మార్చ్ 2021:

మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ వైయస్సార్ పార్టీ. వైయస్సార్ పార్టీ మహిళా ఇన్చార్జ్ జి. చెన్నమ్మ  సోమవారం శింగనమల మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శింగనమల మండలంలో విలేకరుల సమావేశంలో జి. చెన్నమ్మ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ వైయస్సార్ పార్టీ అని, మహిళా సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మహిళల పక్షాన నిలిచిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి . మహిళా లోకం ప్రవేశపెట్టిన అనేక పథకాలు, చేపట్టిన సంస్కరణలు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రతి గ్రామంలో, పట్టణంలో ప్రచారం కల్పించడానికి మహిళా కృషి చేయాలని నిర్ణయించారు. ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కోసం “సుకన్య సమృద్ధి యోజన”, పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం “ఉజ్వల” పథకం, త్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా మైనారిటీ మహిళలకు పూర్తి మద్దతు తెలిపి సాంఘిక మత దురాచారాల బారిన పడకుండా వారికి రక్షణ కల్పించారు. సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. వాస్తవంగా కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం. ఈ దినోత్సవం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. కుటుంబ, ఆర్థిక భారాలను సైతం నేడు స్త్రీ శక్తి లాగుతోంది. ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది. మేం ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారని  వైఎస్ఆర్ పార్టీ మహిళా ఇంచార్జ్ జి. చెన్నమ్మ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking