- పుడింగ్ అండ్ మింక్ పబ్ పై దాడులు
- మీడియాతో మాట్లాడిన డీసీపీ జోయల్ డేవిస్
- పబ్ లో 148 మంది ఉన్నారని వెల్లడి
- మీడియాలో కస్టమర్ల జాబితా చూపిస్తున్నారని ఆరోపణ
గతేడాది ఆగస్టు నుంచి ఈ పబ్ కొత్త మేనేజ్ మెంట్ చేతుల్లోకి వచ్చిందని డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. పూర్తి వివరాలు సేకరించిన మీదట పబ్ ఓనర్ అర్జున్ వీరమాచినేని, అభిషేక్ ముప్పాల, పబ్ జీఎం అనిల్ లపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
ఈ పబ్ లో ఎవరైనా అడుగుపెట్టాలంటే ఓ యాప్ సాయంతో ఓటీపీ ఎంటర్ చేస్తేనే అనుమతి లభిస్తుందని వివరించారు. తాము దాడి చేసిన సమయంలో పబ్ లో 148 మంది ఉన్నారని, వారిలో ప్రతి ఒక్కరినీ నిశితంగా పరిశీలించడం జరుగుతుందని స్పష్టం చేశారు.