Header Top logo

Ideology in journalism జర్నలిజంలో బ్రాహ్మణ భావజాలం

Ideology in journalism

జర్నలిజంలో బ్రాహ్మణ భావజాలం

వీరభద్రరావు : ఈ జర్నలిజం అనే దాన్లో బ్రాహ్మణ భావజాలం చాలా విపరీతంగా కనిపిస్తుందోయ్ నీ మొహం మండ

వేలు : అలా ఎలా అనిపించిందండయ్య నా మొహం మండ

వీరభద్ర : ఇప్పుడూ ఎవరైనా పొలిటీషియన్ పార్టీ మారితే ఫలానా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్న అని రాస్తారేవిటయ్యా… అవతల పార్టీ పార్టీ వాడేమైనా పూజారా? బార్ వెయిటరా తీర్థం పోయడానికి నీ మొహం మండ

వేలు : నిజమేనండయ్యా నా మొహం మండ

వీరభద్ర : ఇంకా చెప్తా వినూ నీ మొహం మండా… ఎవడేనా చిట్టి పండు… అదే చిట్ ఫండు వాడు డబ్బు ఎగ్గొడితే శటగోపమ్ పెట్టాడు అంటారేవిటయ్యా విడ్డూరం కాకపొతేనూ…

వేలు : అంటేనయ్యా తొలినాల్ల విలేఖరులు వారేకదండయ్యా.. నా మొహం మండ

వీరభద్ర : అదే నీ మొహం మండ. విలేకరులు అనొచ్చు కదయ్యా. ఖరులు ఏవిటయ్యా మరీనూ గాడిదా అనడమే కాదుటయ్యా

వేలు : ఏదో బుద్ది గడ్డి తిని అనేశా. అక్షింతలు దాచేయండి చెప్తాను దాచేయండి

వీరభద్ర : ఇదిగో ఈ అక్షింతలు వేయడం కూడా బ్రాహ్మణ పదమే నీ మొహం మండా.

వేలు : నిజమేనండయ్యా.. చూడబోతే తమరేదో ఘట్టిగానే పరిశోదించినట్టున్నారు నా మొహం మండ

bharadwaja, journalist

భరద్వజా రంగవఝల, సీనియర్ జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking