AP 39TV 26 ఫిబ్రవరి 2021:
రాయదుర్గం పట్టణం లోని శాంతినగర్ లో గల బాలగంగాధర్ తిలక్ స్కూల్లో చదువుతున్న చిన్నారి శ్రావణి (9సం, వయసు), మూడవ తరగతి చదువుతున్న చిన్నారి మృతి. చదువు ముగించుకుని ఇంటికి వెళ్లి ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కిందకు పడిపోయింది గమనించిన బంధువులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డ్యూటీలో ఉన్న డాక్టర్స్ చూస్తే అప్పటికే ఆ చిన్నారి ప్రాణం వదిలినట్టు డాక్టర్ లు తెలిపారు.కాగా పాప తల్లితండ్రులు బెంగళూరు వలస వెళ్లినట్టు బంధుమిత్రులు తెలియజేశారు.పాప మృతికి గల సమాచారం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
R.ఓబులేసు,
ఏపీ39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.