Header Top logo

I am your object (Poetry) నేనే నీ వస్తువ ( కవిత్వం)

I am your object (Poetry)

నేనే నీ వస్తువు..( కవిత్వం)

ఎప్పుడో ఓ సారి..
నీ కవితకు నేను వస్తువునవుతా..

ఊపిరనుకున్న ఓ స్నేహం
నీ వీపున వంచన కత్తై దిగినప్పుడు
నన్ను అవమానించిన క్షణాల సాక్షిగా
నీకు సాంత్వన నిచ్చే ఎత్తుగడనవుతా

ఐశ్వర్యమెందుకో నీకు
మోయలేని భారమవుతుంటే
నా ప్రమేయమేదీ లేకుండానే
బతుకు లోతుల్లోనుండి మనం
చేదుకున్న కన్నీటి సాక్షిగా
నీ చేతిలో శిల్పంలా చెక్కబడతా

మరణంకన్నా సుఖమేది లేదని
మనసును ఒప్పించడానికి
నీ మెదడు తర్కం వెదుకుతున్నప్పుడు
నిండు భరోసా వాక్యాన్నై
నీ కవనానికి ముగింపు‌నవుతా!

ఎప్పుడో ఓ సారి..తప్పకుండా
నీ కవితకు నేను వస్తువునవుతా!!

tula sreenivs kavi

తుల శ్రీ నివాస్

1 Comment
  1. Kanakaraju Ganisetti says

    Super sir

Leave A Reply

Your email address will not be published.

Breaking