Header Top logo

భర్త చనిపోయిన రెండు రోజులకే భార్య వార్డు మెంబర్ గా నామినేషన్- అభ్యర్థిగా రమాదేవి .

ఏపీ 39టీవీ 08ఫిబ్రవరి 2021:

చనిపోయిన తన భర్త తిరిగి రాడని చేతులు ముడుచుకొని కూర్చుంటే స్వార్థపరులు అందలమెక్కే ప్రమాదం ఉందని అనంతపురం రూరల్ మండలంలో ఓ మహిళ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి వెళ్తే అనంతపురం రూరల్ గ్రామపంచాయతీ కి చెందిన రమాదేవి కుటుంబం గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో రమాదేవి వార్డు మెంబర్ గా పోటీచేసేందుకు అన్నిఏర్పాట్లు చేసుకుంది. అయితే అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యపరిస్థితుల కారణంగా ఈ నెల 6 న రమాదేవి భర్త ధర్మరాజు మరణించాడు.భర్త ధర్మరాజు మరణంతో పుట్టెడు కష్టాల్లో మునిగిపోయిన రమాదేవి వాటిని లెక్కచేయకుండా అదేరోజు భర్త అంత్యక్రియలు ముగించుకొని ఎన్నికలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 8 న రూరల్ పంచాయతీ పరిధిలోని 14 వ వార్డు మెంబర్ గా టీడీపీ తరపున నామినేషన్ దాఖలు చేసింది.కొన్నేళ్లుగా రూరల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి కి నోచుకోలేదని గతంలో చేతకాని వాళ్ళు ఎన్నికై ప్రజలకు ఏ ఉపయోగమూ లేకుండా పోయిందని రమాదేవి ఆవేదన వ్యక్తం చేసింది. చనిపోయిన తన భర్త ధర్మరాజు తిరిగి రాడని అయితే తానే వార్డు మెంబర్ గా ఎన్నికై ప్రజాసేవ చేస్తే తన భర్త ఆత్మ శాంతిస్తుందని రమాదేవి మీడియా తో అంటోంది. తాను వార్డు మెంబర్ గా ఎన్నికై పంచాయతీ అభివృద్ధికి పాటుబడాలన్నదే తన భర్త ఆశయమని ఆయన ఆశయం మేరకే ప్రజా సేవలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని 14 వ వార్డు మెంబర్ టీడీపీ అభ్యర్థి రమాదేవి స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking