Header Top logo

How far is this journey ఈ త్రోవ ఎక్కడి వరకు..

How far is this journey

ఈ ప్రయాణం ఎక్కడికి..

త్రోవ ఎక్కడ

కాళ్ళ కింద నేల ఎక్కడ?
మాదనే అస్తిత్వం ఎక్కడ?

ఎక్కడి గాలి ఎవరిది?
ఎక్కడి నీరు ఎవరిది?

ఈ ఆకలికి ఊరేది?
ఈ దాహార్తికి పేరేదో?

మనసుల ఊరెక్కడ
మమతల మాటల ఊటెక్కడ?

విదేశాంగ విధానాలు
నెట్టేసిన చితుల మీద
మండుతోన్న మంటల చలి కాచుకుంటున్నదెవరో?

ఏ పాలకుడి బూటు కాలి కింద
వణుకుతోన్న శ్వాస ఇది?

ఎవడి దాయాదక్షిణ్యాల
జాలి చూపుల కింద రెపరెపలాడుతోన్న ఊపిరి ఇది?

ఎక్కడ నుంచి ఎక్కడి వరకూ
ప్రవహించే నెత్తుటి వలస ఇది?

నాగరికత గేలి చేసే బతుకు
పెట్టుబడి పగబట్టే ఉనికి.

మనుషుల్ని తిని డాలర్లు ఊసే కాలంలో
అపహాస్యం అయ్యే మనిషీ కన్నీళ్లు.

ఏది దారి
ఇక త్రోవ ఎక్కడ?


 డాక్టర్ నూకతోటి రవికుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking