Header Top logo

GTSSS అధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వాపురం మండల కేంద్రంలో గాస్ఫేల్ ఫర్ ట్రైబల్స్ సోషల్ సర్వీస్ సోసైటి క్రైస్తవ సేవా సంస్థ చైర్మన్ జాకోబ్ అయ్య గారి ఆదేశాల మేరకు 300 మంది దళితులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ముందుగా మంచికంటి నగర్ లోని 86 కుటుంబాలకు 860 కిలోల బియ్యం, 86 కేజిల కందిపప్పు, 86 కేజిల చక్కెర, 86 కేజిల గోధుమ పిండి, 86 కేజిల ఉప్పు ప్యాకెట్లను భారజల కర్మాగారం అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పి. రమణబాబు GTSSS సంస్థ ఇంఛార్జి రోకటి రామారావు గార్ల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది. అనంతరం దోసపాటి రంగారావు- భారతి గార్ల కళ్యాణ మండపంలో 220 కుటుంబాలకు 22 క్వింటాళ్ల బియ్యం, 2.5 క్వింటాళ్ల కందిపప్పు, 2.5 క్వింటాళ్ల ఉప్పు ప్యాకిట్లు, 220 కిలోల చక్కెర, 220 కిలోల గోధుమ పిండిలను మండల ఆయుర్వేద వైద్యాశాల వైద్యాధికారిని గుమ్మడి అరుణ, ASO పి. రమణబాబు, రోకటి రామారావు గార్ల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం పట్ల రామారావు గారిని ప్రత్యేకంగా అభినందించారు.. ఈ కార్యక్రమంలో మాదిగ జేఎసి రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు, మైనారిటీ నాయకులు షేక్ నయ్యిమ్, సయ్యద్ యాకుబ్ వలి, నజీర్ షోను, యస్ సి సెల్ నాయకులు గద్దల రామకృష్ణ, ఇసంపల్లి కృష్ణ, కాలవ సంసోన్, జూపల్లి కిరణ్, భాస్కర్, రాంబాబు, రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking