Header Top logo

GS Melkote Jayanti on October 17 జి.ఎస్.మేల్కోటే జయంతి

GS Melkote Jayanti on October 17

అక్టోబర్ 17న  జి.ఎస్.మేల్కోటే జయంతి

జి.ఎస్.మేల్కోటే, గా ప్రసిద్ధిచెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యులు, పరిపాలనా దక్షుడు. ఆయన సుబ్బుకృష్ణ దంపతులకు ఒడిషా రాష్ట్రంలోని బరంపురంలో 1901 అక్టోబరు 17 విజయ దశమి రోజున జన్మించాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎల్.ఎం.ఎస్ పరీక్షలో 1927లో మొదటి తరగతిలో మొదటి వారుగా ఉత్తీర్ణులై బంగారు పతకం అందుకున్నాడు. దేశీయ వైద్య విధానాన్ని, యోగాసనాల ప్రభావాన్ని జోడించి ఉత్తమ వైద్యులుగా ఖ్యాతి పొందాడు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, హైదరాబాదు అధ్యక్షులుగా పనిచేశాడు. ఇతను పతంజలి యోగ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించాడు.

స్వతంత్ర భారతదేశంలో ఆయన ఎన్నో బాధ్యతాయుత పదవులు నిర్వహించాడు. హైదరాబాదు శాసనసభలో 1952 నుండి 1956 వరకు సభ్యులై మొదట ప్రజా పనుల శాఖలో తర్వాత ఆర్థిక శాఖలో మంత్రి పదవి నిర్వర్తించాడు. ఆయన ముషీరాబాదు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో రాయచూరు లోకసభ నియోజకవర్గం నుండి తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. 1962 నుండి 1977 వరకు భారత పార్లమెంటు సభ్యుడిగా హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఆగ్నేయాసియా ప్రాంతీయ ప్రపంచారోగ్య వ్యవస్థా మహాసభ, కామన్ వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లలో పాల్గొన్నాడు. హైదరాబాదు లోని ఐ.ఎన్.టి.యు.సి. శాఖకు అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశాడు. ఆయన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. 1916లో స్వదేశీ ఉద్యమంలో మొదటి సారిగా పాల్గొన్నాడు. GS Melkote Jayanti on October 17

ఉప్పు సత్యాగ్రహంలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం వద్ద, కర్ణాటక రాష్ట్రంలోనూ ఉప్పు తయారుచేసి పోలీసులచే నిర్బంధితుడై హింసలకు గురయ్యాడు. కరాచీ కాంగ్రెస్ లో హైదరాబాదు ప్రతినిధిగా 1931 లో పాల్గొన్నాడు. హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ సభ్యుడై 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. 1947, ఆగస్టు 15 న జాతీయ స్వాతంత్ర్యం సందర్భంగా భారత జాతీయ పతాకాన్ని హైదరాబాదులో ఎగుర వేయటకు ప్రయత్నించి నిజాం ప్రభుత్వం చేత జైల్లో నిర్బంధించబడ్డాడు. పోలీసు చర్య అనంతరం విడుదలయ్యాడు. ఆయన సతీమణి విమలాబాయి కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంది. వీరి మాతృభాష కన్నడం అయినా వీరు ఆంధ్ర దేశానికి చేసిన సేవ గణనీయం. మెల్కోటే 1982 మార్చి 10 వ తేదీన పరమ పదించాడు.GS Melkote Jayanti on October 17

Ramakistaiah sangabhatla

రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking