హైదరాబాద్ : టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గొట్టిపర్తి భాస్కర్ గౌడ్ నియమితులయ్యారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా మూడవ మహాసభలలో గత 32 ఏళ్లుగా జర్నలిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న యాదాద్రి భువనగిరి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు రోమింగ్ న్యూస్ దిన పత్రిక చీఫ్ ఎడిటర్ గొట్టిపర్తి భాస్కర్ గౌడ్ చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర అధ్యక్షులు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆదేశాల మేరకు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు.
టీజేఎఫ్ ఏర్పాటు నుంచి నేటి వరకు జరిగిన అనేక పోరాటాలలో గొట్టిపర్తి భాస్కర్ భాగస్వాములయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కేసులు ఎదుర్కొని ఆంధ్ర వలస వాదులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అల్లం నారాయణ నాయకత్వంలో జరిగిన అనేక పోరాటాలలో ఆయన పాలుపంచుకున్నారు. మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన భువనగిరి సభ నుంచి మొదలుకొని యాదాద్రి లో నిర్వహించిన లక్ష్మీనరసింహునికి వేయ్యొక్క బోనాల కార్యక్రమం వరకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమ కేసులు ఎన్నో ఎదుర్కొని నిలబడ్డారు. ప్రస్తుతం ఆయన రోమింగ్ న్యూస్, జీ9తెలుగు టీవీ దినపత్రిక ఎడిటర్ గా కొనసాగుతున్నారు.
గొట్టిపర్తి భాస్కర్ నియామకం పట్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారి మారుతి సాగర్, టెంజు రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, అవ్వారి భాస్కర్, కట్ట కవిత, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వజ్జె వీరయ్య, నల్గొండ జిల్లా అధ్యక్షులు గుండ గాని జయ శంకర్ గౌడ్, యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి జూకంటి అనిల్, మహాసభల ఆహ్వాన కమిటీ సభ్యుడు గుండ్లపల్లి శ్రీరాం గౌడ్, యాదగిరిగుట్ట జర్నలిస్టులు కళ్లెం సంపత్, వెంకటేష్, నరేందర్, ఉపేందర్ గౌడ్, గౌలికారి భాను, పుష్పగిరి స్థానిక ప్రజాప్రతినిధులు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల జర్నలిస్టులు అభినందించిన వారిలో ఉన్నారు.