Header Top logo

జర్నలిస్టులకు శుభవార్త

AP 39TV 03 మే 2021:

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా ఉన్నటువంటి విషయం తెలిసిందే. జర్నలిస్టులను కాపాడుకునేందుకు వెంటనే కోవిడ్ వ్యాక్సిన్ టీకాను జర్నలిస్టులకు వెపించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు మచ్చా రామలింగారెడ్డి (రాష్ట్ర అధ్యక్షులు, A.P.J.D.S) అన్నారు.అనంతపురం నగరం ప్రెస్ క్లబ్ నందు అనంతపురం వర్కింగ్ జర్నలిస్టులందరికి వారి కుటుంబసభ్యులకు కరోనా టీకా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని అని తెలిపారు.అనంతపురంలో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులందరు సోమవారం ఉదయం 10 గంటలకు అనంతపురం ప్రెస్ క్లబ్ నందు కరోనా వ్యాక్సినేషన్ వేసుకోవాలని ఆసక్తిగల జర్నలిస్టులు వారి పేర్లను నమోదు చేసుకోవాలని మచ్చా రామలింగరెడ్డి విజ్ఞప్తి చేశారు.వర్కింగ్ జర్నలిస్టులందరు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు, చిన్న పత్రికలు, సీనియర్ జర్నలిస్టులు అందరికీ కూడా అనంతపురం ప్రెస్ క్లబ్ లోనే వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయించడం జరుగుతుందని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల డెవలప్మెంట్ సొసైటీ తెలిపారు.వ్యాక్సినేషన్ టీకా వేసుకోవాలనే ఆసక్తి ఉన్న జర్నలిస్టులు వారి ఐడి, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల డెవలప్మెంట్ సొసైటీకి అందజేయాలని విజ్ఞప్తి చేశారు.వెంకటేశ్వర్లు, భాస్కర్ రెడ్డి, విజయరాజు,బాలు, జాని, షాకీర్ వద్ద జర్నలిస్టులు వారి పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking