Header Top logo

Gandhiji is slapped unknowingly గాంధీజీని తిట్టెవారికి ఏమి తెలియదు

Gandhiji is slapped without knowing what

గాంధీజీని తిట్టెవారికి ఏమి తెలియదు

గాంధీజీని తిట్టే మహాపురుషులందరూ ఈ రోజు బయటకి వస్తుంటారు. ఇలా తిట్టే వాళ్ళల్లో చాలామందికి గాంధీజీ ఎవరు ఏమిటనేది తెలియదు. తెలుసుకోవాలని ఇంట్రెస్టు కూడా ఉండదు. గాంధీజీ గురించి తెలుసుకోవాలంటే మొదటగా ఆయన ఉన్నప్పటి కాల చరిత్రను చదవాలి. రెండవది ఆయన ఆ కాలాన్ని ఎలా దర్శించాడో తెలుసుకోవాలంటే ఆయన రాసిన పుస్తకాలు చదవాలి.

“నాకు గాంధీజీ భావజాలం నచ్చలేదు” అన్నాడొకాయన.

“ఆయన రాసిన ఏ పుస్తకం లో భావజాలము నచ్చలేదు?” అనడిగాను.

“గాంధీజీ పుస్తకాలు కూడా రాశాడా?”. అని మళ్ళీ ప్రశ్న వేశాడు. ఇలా ఉంటుంది!!.

గాంధీజీ భావజాలం తెలియాలంటే ఆయనతో కలిసి పయనించాలి. ఇపుడు ఆయన లేరు కాబట్టి ఆయన పుస్తకాలు చదివితే తప్ప ఆయన భావజాలం ఏంటో తెలిసిరాదు.

గాంధీజీ భావజాలం నచ్చలేదన్న ఆ మిత్రుడికి గాంధీజీ పుస్తకాలు రాశారన్న విషయమే తెలియదు . ఏ భావజాలం రాశారో తెలియదు. కానీ గాంధీజీ ని విమర్శిస్తాడంట. ఇలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు.

“ఇంతకీ గాంధీ గురించి ఎక్కడ చదివావు”. అని అడిగాను.

“మొన్న వాట్సప్ లో వచ్చింది”. అన్నాడు.

వాట్సప్ జ్ఞానం అన్నమాట. చూడండి ఇది సీరియస్ సమస్య. మనం జ్ఞాన మార్గాల మార్పు గురించి గతంలో చర్చించుకున్నాం. టీవీలు వాట్సాప్ లు లేని కాలంలో ఎవరైనా గాంధీని తెలుసుకోవాలన్నా విమర్శించాలన్నా పుస్తకాలే ఆధారం. గాంధీజీ రాసిన పుస్తకాలు చదివితే ఆయన గురించి మనకు వచ్చే అవగాహన First hand direct understanding అవుతుంది. Gandhiji is slapped unknowingly

సోషల్ మీడియాలో..

కానీ ఇపుడు పుస్తకాలు జ్ఞాన మార్గాలుగా లేవు. యూట్యూబ్ వాట్సప్ లు జ్ఞాన మార్గాలయ్యాయి. కాబట్టి అందులో వచ్చిన ప్రతీది నిజమనుకునే ఒక తరం మొదలైంది. ప్రత్యక్షమైన అనుభూతి లేని first hand direct undrstanding లేని తరం. గాంధీజీ గురించి తెలుసుకోవాలంటే గాంధీజీ బుక్స్ చదవాలి అని కాక వాట్సప్ లో వచ్చే విషయాలు చదవాలి అనుకోవడం.. లేదా యూట్యూబ్ లో ఎవరో చెబితే వినాలి అనుకోవడం స్వీయ మరుగుజ్జు తనాన్ని తెలివిగా కప్పేసే చర్యగా భావించాలి.

నోట్ల మీద కూడా గాంధీజీ బొమ్మనే..

అధ్యయనం నశించిన ఒక భయంకరమైన బ్లా బ్లా తరమొకటి తయారుకాబోతున్నది. ఇలాగే వాట్సప్ లో వచ్చిన ఏదో రాత చదివి గాంధీని తెగ తిట్టేసిన ఇంకో మిత్రుడు..ఒకప్పుడు మా ఇంట్లో గాంధీ ఫోటోలుండేవి.. అన్ని చింపేసి కాల్చేశానని ఊగిపోతూ సంబరపడ్డాడు. “బాబూ నోట్ల మీద కూడా గాంధీజీ బొమ్మనే ఉంటుంది. పొరపాటున కాల్చేసేవు. నీ ఆవేశం పాడుగాను” అని తిట్ఞి పంపాను.

పుస్తకాలు రాసే నాయకులు లేరు..

గాంధీజీ దాదాపు 45 పుస్తకాలు రాశారు. రాజకీయాల్లో తలమునకలై ఉంటూ కూడా 45 పుస్తకాలు రాయడమంటే ఆయన స్పిరిట్ ఏమిటో అర్థం చేసుకోవాలి. అలా పుస్తకాలు రాసిన రాజకీయ నాయకుడు మరొకరు కనబడరు. నెహ్రూ కూడా పుస్తకాలు రాశారు. ఒకరకంగా చెప్పాలంటే రామచంద్ర గుహ వంటి వారు గాంధీజీని నెహ్రూని ఆధునిక భారత నిర్మాతలుగా పేర్కొనడానికి కారణం వారి పుస్తకాలే. పుస్తకాలు రాయగలగడమే వారిని ఇతరులకంటే విశిష్టంగా నిలబెట్టింది. ప్రస్తుతం పుస్తకాలు రాయగలిగిన రాజకీయ నాయకులు లేరు. విస్తృతంగా చదవగలిగిన గుణాలు లేవు.

ఫోటోలకు ఫోజులకే..

ఫోటో షూట్లకే సెల్ఫ్ ప్రమోషన్లకే సమయం దొరకని వారు ఒక గాంధీజీ లాగా పదుల సంఖ్యలో పుస్తకాలు రాయగలరా?. మీడియా ను సోషల్ మీడియాను manipulate చేసి ఎలక్షన్లు గెలవాలని తాపత్రయ పడే మన ప్రస్తుత నాయకుల నుండి గాంధీజీ వంటి మహాత్ముడిని ఊహించగలమా?. ఒట్టి మొద్దు శుంఠల్లాగా ఉంటారు కదూ..! ఊహించలేమని కవి భావం. Gandhiji is slapped unknowingly

Gandhiji is slapped unknowingly

డాక్టర్ విరించి విరివింటి

Leave A Reply

Your email address will not be published.

Breaking