Header Top logo

లవర్ కోసం ఫ్రెండ్ ను హత్య చేసి గిప్ట్..

లవర్ ను ప్రేమించాడని చంపి గుండె కోసి

ఫోటోలు పంపిన యువకుడు..

వెరీగుడ్ అంటూ రిప్లే ఇచ్చిన ప్రియురాలు

ప్రేమ- స్నేహం.. ఈ రెండు అక్షరాలకు సమాజంలో ఎంతో ప్రధాన్యత. కష్ట, సుఖాలలో ఆదుకునేది స్నేహితుడు. ప్రేమతో లాలించేది లవర్. మరి లవర్ ను ఫ్రెండ్ ప్రేమించాడని హత్య చేసి లవర్ కు గిప్ట్ ఇచ్చి పైశాచిక ఆనందం పొందాడు ప్రేమికుల జంట.

నల్గొండ : సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కాలంలో యువత అక్రమదారిలో ప్రయాణం చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. బీటెక్ చదువుతున్న ఇద్దరి మధ్య లవర్ రావడంతో జీవితాలే చిన్నభిన్నమయ్యాయి.

నల్లగొండ ఎంజీ యూనివర్సిటీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న హరహర కృష్ణ, నవీన్ స్నేహితులు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. తాను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమించాడని నవీన్‌ను దారుణంగా చంపాడు కృష్ణ.

ప్రియురాలి మెప్పు కోసం ‘‘ఈ వేలే కదా నిన్ను తాకింది అంటూ వేలు, గుండె కోసి ఫోటోలు తీసి లవర్‌కు పంపాడు కృష్ణ. అందుకు బాధ పడక పోగా  ఆమె వెరీ గుడ్ అంటూ రిప్లై ఇచ్చింది. నవీన్ హత్య కేసును విచారణ చేస్తున్న పోలీసులు ఈ ఇద్దరు ప్రేమికులను  అదుపులోకి తీసుకున్నారు. ఉన్నత విద్యా చదువుతున్న విద్యార్థులు ప్రేమ పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపు కోతలను మిగల్చడంను జీర్ణించుకోలేక పోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking