Header Top logo

భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు కాపాడుకుందాం

భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు

దానిని కాపాడుకోవడం పౌరులందరి బాధ్యత

ఎవరైనా ఏదైనా చట్ట వ్యతిరేకంగా లేదా చట్ట విరుద్ధంగా మాట్లాడిన ప్రవర్తించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. ఎవరు ఎవరిపైన దాడులకు పాల్పడరాదు.

తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న మతోన్మాద రాజకీయ శక్తులు ఆడుతున్న రాజకీయ వికృత క్రీడనే నేడు హేతువాదులు, నాస్తికులు, బహుజనులపై జరుగుతున్న ఈ దాడులు. వీటిని ప్రజాస్వామిక వాదులందరం ఖండిస్తున్నాం.

హేతువాదం, నాస్తికత్వం, భౌతిక వాదం చార్వాకులు లోకాయతులు, బుద్ధుడి నుండి మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భగత్సింగ్ లు అందించిన భారతీయ తాత్విక వారసత్వం.

ఎన్నో ఏళ్లుగా నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తున్న బైరి నరేష్ పై, పాటలు పాడుతున్న రేంజర్ల రాజేష్ పై మతోన్మాదం, మనువాదుల దాడులను ఈ సమావేశం ఖండిస్తున్నది.

నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలోని కోటగిరి గ్రామంలో పాఠశాలలో పనిచేస్తున్న దళిత టీచర్ మల్లికార్జున్ ను అత్యంత దారుణంగా అవమానించి, తన నమ్మకాలకు విరుద్ధంగా గుడిలోకి తీసుకెళ్లి బలవంతంగా క్షమాపణలు చెప్పించి బొట్టుపెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి చట్టాన్ని ఉల్లంఘించి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. టీచర్ మల్లికార్జున్ గారిపై జరిగిన దాడిని ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తున్నది.

ప్రొ.సూరేపల్లి సుజాత, POW సంధ్య, సామాజిక కార్యకర్త. దేవి, తదితరులపై బూతులతో మతోన్మాదులు చేస్తున్న దాడులను సమావేశం తీవ్రంగా ఖండిస్తున్నది.

మనమంతా కలసికట్టుగా ఈ దాడులకు వ్యతిరేకంగా భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కును కాపాడుకోవడం కోసం ఐక్య కార్యాచరణను చేపట్టడం కోసం ఈ సమావేశం జరిగింది.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking