Header Top logo

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి Dr. నీలకంఠాపురం రఘువీరారెడ్డి జన్మదిన వేడుకలు

ఏపీ 39టీవీ 12 ఫిబ్రవరి 2021:

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు,మాజీ మంత్రి Dr. నీలకంఠాపురం రఘువీరారెడ్డి  జన్మదిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించడము జరిగినది.ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుల నాగరాజు మాట్లాడుతూ రఘువీరారెడ్డి  రాష్ట్ర మంత్రి గా చేపట్టిన సేవలను కొనియాడుతూ,ముక్యంగా అనంతపురం జిల్లాకు ఆయన చేసిన సేవలు చాలా గొప్పవి, ముక్యంగా జిల్లాలో అగ్రి పాలిటెక్నిక్, వెటర్నరీ పాలిటెక్నిక్ లు,తాగడానికి శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం, జిల్లా రైతాంగానికి సాగునీటి సమస్య పరిష్కారం కోసం హంద్రీనీవా జలాలను జిల్లా కు తీసుకుని రావడం లో కీలకమైన పాత్ర పోషించారు, ఇంకా వెనుకబడిన కళ్యాణదుర్గం, అభివృద్ధి, రైల్వే లైను తీసుకు రావడం, రెండు రెవిన్యూ డివిజన్ లు ఏర్పాటు, ప్రాజెక్టు అనంత ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రఘువీరారెడ్డి  మార్క్ గా నిలిచారు. ఇలాంటి నాయకులు అనంతపురం జిల్లాలో ఉండడం మన అదృష్టం గా భావిస్తున్నాము,ఆయన సేవలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కి చాలా అవసరం అని భవిష్యత్ లో యువత కు ఈయన మార్గం యెంతో ఉపయోగపడుతుంది అని తెలుపుతూ, ఈ జన్మదిన సందర్భంగా ఆయనకు మంచి ఆరోగ్యం, శక్తి ని ఇవ్వాలని కోరుతూ ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీ నిర్మాణం లో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల వాసు ,జిల్లా ప్రధాన కార్యదర్శి మసాలా రవి,నాయకులు శర్మాస్ వలి,రమేశ్, రామాంజనేయులు,సాకే ప్రకాశ్, ఆదినారాయణ,మిత్రులు సాకే శివ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking