Header Top logo

గిరిజన గురుకుల పాఠశాలలో విదేశీ విద్యార్థులు సందడి

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, నాగర్గుల్ గిరిజన గురుకుల పాఠశాలకు ప్రపంచంలోని నలు మూలల నుండి 17 దేశాలకు చెందిన 20 మంది విద్యార్థులు సందర్శనకై వచ్చారు.

తెలంగాణ రాష్ట్రలోని గిరిజన పాఠశాలల్లో బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసంను  పరిశీలన చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల విద్య బోధను అభ్యసన స్థాయిలతో ఇక్కడి బోధన  స్థాయిలను వారు పోల్చుతాడు.

ఈ విద్యార్థులు ఇక్కడ 5 రోజులపాటు మా విద్యార్థులకు ఆటపాటలతోపాటు పాటు ” లర్నింగ్ బై డూయింగ్ మెళకువలను నేర్పుతున్నరంటున్నారు ఇన్ చార్జీ ప్రిన్సిపల్ మామిడి నారాయణ. విద్యార్థుల మాతృ భాష, బోధనాభ్యసన భాషల మధ్య అంతరాలను, ఆటంకాలను సునాయ సంగా అధిగమించే సులభతర నైపుణ్యాలను నేర్పుతున్నరన్నారు.  అలాగే ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను గూర్చి కూడా విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు  తెలుసుకుంటున్నరన్నారు నారాయణ.

అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనెడా, టాంజానియా, పోర్చుగల్, సిరియా, మొజాంబిక్, ఇరాన్, తజికిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, కెన్యా వంటి వివిధ దేశాలకు చెందిన మొత్తం 20 నుండి విద్యార్థులు ఈ డిసెంబరు 30వ తేదీ వరకు ఇక్కడి పిల్లలతో గడుపుతారు.

ఈ” విదేశీ విద్యార్థుల సందర్శన కార్యక్రమం’ హైద్రాబాద్ లోని ప్రఖ్యాత ” ఆగాఖాన్ సొసైటీ” వారి సౌజన్యం, అనుసంధానంతో నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమం మా పాఠశాలలో నిర్వహింయి చడం మాకెంతో గర్వకారణం అని పాఠశాల ఇంఛార్జి ప్రిన్సిపల్  మామిడి నారాయణ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల దేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సమ్మేళనాలు జరగుటకు, నేటి సమాజంలో మౌళిక మార్పులకు బాటలు వేస్తుందని అభిప్రాయ పడ్డారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking