AP 39TV 05మే 2021:
అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరోనా రోగులని తరలించటానికినికి ఉచిత వాహన సదుపాయాన్ని కల్పిస్తుమనమని,ఈ వాహన సదుపాయం కొరకు సంప్రదించటానికి నలుగురు సభ్యులతో కోవిడ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామని, అనంతపురం నగర ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట PCCఅధ్యక్షులు డా.సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ర్టంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ ని కట్టడి చేయమని రాష్ర్ట ప్రజలు హాహాకారాలు చేస్తుంటే, ఆయన మాత్రమె మద్యం వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ,, వాటికోసం ప్రత్యకమైన GO లు తీసుకొచ్చి మరి మందు అమ్మిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా కాలంలో వారికి అవసరమైన పడకలు,ఆక్సిజన్, సమకూర్చకుండా,కరోనా ని పర్యవేక్షించడం లో జగన్మోహన్ రెడ్డి విఫలం చెందారన్నారు. ఎప్పటికైనా CM గారు ఆ రాజభవనం వదిలి బయటికి వచ్చి కోవిడ్ ని CM గారే ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఆసుపత్రులకు వెంటనే సౌకర్యాలు కల్పించాలన్నారు.కరోనా కట్టడి కర్ఫ్యూ కాకపోతే పూర్తి స్థాయిలో లోక్డౌన్ పెట్టండి.అయితే ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మా వంతు బాధ్యతగా రాష్ర్ట వ్యాప్తంగా కరోనా బాధితులకు అండగా వారికి సహాయ,సహకారాలు అందించటానికి ఒక వాహనాన్ని అందుబాటులో ఉంచుతూ,బాధితులకు అందుబాటులో మా కోవిడ్ కంట్రోల్ రూమ్ సభ్యులు అందుబాటులో ఉంటారని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి,అధికార ప్రతినిధి శంకర్ యాదవ్,ప్రధాన కార్యదర్శి కడియాల పక్రుద్దీన్, NSUI రాష్ర్ట నాయకులు నరేష్ యనుమల,మంజుల దీప్తి,అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.