Header Top logo

Everything is Jantar Mantar అంతా జంతర్ మంతర్

Everything is Jantar Mantar

అంతా జంతర్ మంతర్

ఇది జంతర్ మంతర్ లోకం..
కొందరు దగాకోరులున్న నివాసం…
ఈ తరహా దుర్మార్గుల చేతిలో చిక్కిన
నిస్సహాయ నిర్భాగ్యులెందరెందరో!!??

ఇది కళ్ళకు గంతలు కట్టే కాలం…
కనికట్టు కథలు చెబుతూ…
మంత్రాలంటూ మత్తునునింపి…
యంత్రాలంటూ ఎత్తులువేసి..
తంత్రాలంటూ మర్మంలాగి…
కళ్ళు మూసి కళ్ళుతెరిచే లోపే
మస్కాకొట్టే చిట్కాలెన్నో…
మాయ మాటల మర్మాలెన్నో చేస్తారు…

చుట్టూ అంతా రంగులమయం…
చూసే వాళ్లకు చమక్ చమక్..
తమషాహోరు..తారుమారు జోరు..
తెగించి ఆడే జంతర్ మంతర్…
ఆస్తులు చూపి..ఆశలురేపి
అసలైన రూపంతో అంతాదోచేస్తారు..
ఆత్మీయతను ఆసరాగా చూపి
స్నేహంతో చేరువై…
చివరకు వేదనను నింపి…
ఎప్పటికీ కోలుకోలేని దెబ్బకొడతారు…

చూసేకళ్లకు గంతలుకట్టి
ఉన్నది దోచేస్తారు..
భయాన్ని పుట్టించి బ్రహ్మలో పడేస్తారు..
అభం శుభం తెలియని జనాలకు
మెత్తని మాటలతో వెచ్చని చూపులతో
గొంతును నులిమి గుండెను పిసికి
ఉన్నది అంతా ఊడ్చేస్తారు…

వీరిని కనిపెట్టే కాలం రాదా!!??
వీరి పని పట్టే ధైర్యం లేదా!!??
ముసుగులతోమోసం చేసి…
లొసుగులతో లూటిచేసి
దగాకోరుల దొంగలెందరో!!??…
వారిని పసికట్టండి!! పనిపట్టండి!!..
ఇలాంటి దగుల్బాజీలు ఉన్నన్నాళ్ళు
లేదు మనకు సుఖం…
బ్రతుకంతా దుఃఖం…దుఃఖం!!..

ఇలాంటి నయవంచక
నల్లముసుగులు పోయేదెప్పుడో!!??
స్వార్థపుక్రీడలో అధికారపు దాహానికి
బలవుతున్న జనాలెందరో!!??…

అంబటి నారాయణ

నిర్మల్, 9849326801

Leave A Reply

Your email address will not be published.

Breaking