AP 39TV 05 జూన్ 2021:
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకుని నగరంలోని ఫస్ట్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు స్కూల్ లో మొక్కలు నాటే కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ కరోనా విపత్తు పర్యావరణ ప్రాముఖ్యత తెలియ చేసిందన్నారు.నేడు ఆక్సిజన్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నామో మనమంతా చూస్తున్నామని ఉచితంగా లభించే ఆక్సిజన్ ను నేడు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడటం ఆందోళన కలిగించే విషయమన్నారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షణ చేయాలని సూచించారు.నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పచ్చదనం పెంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని నగర ప్రజలు కూడా సహకారం అందించాలని మేయర్ సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంత సుధ, శ్రీనివాసులు,చంద్రమోహన్ రెడ్డి, అనీల్ కుమార్ రెడ్డి,నగర పాలక సంస్థ కార్యదర్శి సంగం శ్రీనివాసులు,వైకాపా నాయకులు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.