Header Top logo

ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ నందు ఆకస్మికంగా తనిఖీ చేసిన -శ్రీయుత సంయుక్త కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్

ఏపీ 39టీవీ 08ఫిబ్రవరి 2021:

ఉదయం 11.00 గంటలకు శ్రీయుత సంయుక్త కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్  గ్రామ పంచాయతీ ఎన్నికల నిమిత్తమై కదిరి డిగ్రీ కాలేజీ నందు జరుగుతున్న ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ నందు ఆకస్మికంగా తనిఖీ చేయడమైనది; మెటీరియల్, బ్యాలెట్ బాక్సులు మరియు ఇతర ఎలక్షన్ సామాగ్రిని పరిశీలించి డమైనది; అక్కడే ఉన్న ఆర్డిఓ ని మరియు tahsildar ని ప్రశ్నించగా మొత్తం 14 పంచాయతీలకు గాను 142 PS లు కదిరి మండలము నందు ఉన్నవి;ఏ పీ ఓ లు/ పి వో ల ఓ పి వో లు/ మైక్రో అబ్జర్వర్ హాజరైనారు; వీరు సదరు ఎన్నికల సామాగ్రిని తీసుకుని అధికారులు ఏర్పాటు చేసిన బస్సులలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు;
సదరు విధులకు ఎవరైతే హాజరు కాని వారిపై వెంటనే తగు క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్  అధికారులను ఆదేశించారు; హాజరైన సిబ్బందికి నీటి వసతులు మెడిసన్; ఫుడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు; అదేవిధంగా ఆర్డిఓ ని కదిరి డివిజన్ లో గల ఇతర మండలాల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యవేక్షణ చేయాలని కోరారు; ఏ విధమైన ఇబ్బంది కలిగిన వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలపాలని కోరారు; ఈ కార్యక్రమంలో శ్రీ వేంకట రెడ్డి రెవిన్యూ డివిజనల్ అధికారి  కదిరి శ్రీ మారుతి tahsildar, కదిరి, ఎంపీడీవో కదిరి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking