Header Top logo

ఢిల్లీ లిక్కర్ స్కాం సస్పెన్స్ ..  థ్రిల్లర్ ఎపిసోడ్ కు త్వరలో ముగింపు..

క్లైమాక్స్ దశకు ఢిల్లీ లిక్కర్ స్కాం

సస్పెన్స్ ..  థ్రిల్లర్ ఎపిసోడ్ కు త్వరలో ముగింపు..

కవితను అరెస్టు చేసి సత్తా చూపేందుకు బీజేపీ రడీ..

డ్యామేజ్ శాతం ఎంత ఉంటుంది..

ఎలా పూడ్చాలని అంతర్మాదనంలో కేసీఆర్..

హైదరాబాద్, మార్చి 21 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఈ పేరు మంచికో చెడుకో తెలంగాణ ప్రజల నోట్లో నానుతుంది. సోషల్ మీడియాలో.. ప్రింట్ మీడియాలో.. ఎలక్ట్రానిక్ మీడియాలో అంతా కవిత గురించి కథనాలే. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా ఈడీ అధికారులు ముచ్చటగా మూడో రోజు విచారణ ఎపిసోడ్ ను ముగించారు.  

కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహరం బీఆర్ ఎస్ పార్టీకి పెద్ద దెబ్బనే. తనదైన శైలిలో రాజకీయంగా ప్రత్యార్థిని దెబ్బ తీసే సీఎం కేసీఆర్ తన ముద్దుల కూతురు కవితను ఆ కేసు నుంచి ఎలా బయటకు తీసుకు రావాలనే ఆలోచనలోనే బిజీగా ఉన్నారు. తెలంగాణలో అన్ని సమస్యల కంటే కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం ముఖ్యమని మంత్రులు,  కార్పోరేషన్ చైర్మన్ లు, ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలోనే మాకం పెట్టారు.

ఆ మంత్రుల మాటల తీరులో ‘‘తెలంగాణ ఆడబిడ్డ కవితమ్మను లిక్కర్ స్కాంలో ఇరికించారు.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కేసీఆర్ దృష్టిలో పడటమే వారి ఉద్దేశ్యం.

గత వారం రోజులుగా జరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును పరిశీలిస్తే బీజేపీ – బీఆర్ ఎస్ మధ్య రాజకీయ లాభం కోసం పావులు కదుపుతున్నట్లుగానే ఉంది.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వ్యూహంలో భాగమే ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ విచారణ ఎపిషోడ్ కొనసాగుతుంది. రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థులను చిత్తు చేసే చతురత గల కేసీఆర్ ను తెలంగాణలో దెబ్బ తీయడానికి ఢిల్లీ లిక్కర్ స్కాంను తమకు అనుకూలంగా మలుచుకుంటుంది బీజేపీ.

మొదటి రోజు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ కోసం కవిత వెళ్లిన రోజు ఉన్న హడావుడి మూడో రోజు లేదు. ఆమెను అరెస్టు చేస్తారనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్టేట్, నేషనల్ న్యూస్ ఛానల్స్ కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. అయినా.. ఈడీ అధికారులు టీవీ ఛానల్స్ లోని సీరియల్స్ లా ఎపిసోడ్ లు పెంచుతూ పరోక్షంగా, ప్రత్యక్షంగా బీజేపీకి మైలేజ్ పెంచుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి కల్వకుంట్ల కవితను రక్షించాడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిటిని పక్కన పెట్టింది. రాజకీయంగా ఆ ఆంశం దెబ్బనే.. అయినా.. సీఎం కేసీఆర్ తన ముద్దుల కూతురు కవితను ఆ కేసు నుంచి తప్పించడానికి న్యాయ పరంగా పోరాటం చేయడానికి సిద్దమయ్యారు.

కమ్యూనికేషన్ వ్యవస్థలో తప్పు చేసినోళ్లు తప్పించుకోవడం కష్టమే. అయినా.. సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తుంటారు. తప్పు చేసినా కూడా రాజకీయ మైలేజ్ కోసం ప్రయత్నాలు చేసే వారు ఉంటారు. ఇగో.. కవిత కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటునే మీడియాను ఆకర్శిస్తోంది. ఈడీ ఆఫీస్ కు వెళ్లేటప్పుడు.. బయటకు వచ్చేటప్పుడు తాను విజయం సాధించినట్లు చేతితో విక్టరీ చూపిస్తూ చెరగని చిర్నవ్వుతో, విజయ సంకేతం చూపుతూ రావడం కూడా అలాంటిదే.

మూడో రోజు ఈడీ విచారణకు వెళ్లేటప్పుడు కవిత తాను ఉపయోగించిన సెల్ ఫోన్ లను మీడియాకు చూపిస్తూ వెళ్లడంతో సోషల్ మీడియాలో ‘‘కవిత మోబైల్ షాపు పెట్టుకుందా..? అన్ని ఫోన్ లు ఎందుకు కొన్నట్లు..’’ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. నిజానికి కవిత ఏది చేసినా లీగల్ గా అడ్వాజ్ తీసుకుని నడుచుకుంటున్నారు.

అయినా.. కవిత తాను ఉపయోగించిన ఫోన్ లను ధ్వంసం చేసారని ఈడీ అధికారులు పేర్కొన్న సందర్భంలో ‘‘లేదు.. నా వద్దనే ఆ ఫోన్ లు ఉన్నట్లు కవిత చెబితే సరి పోయేది.’’ కానీ.. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు మంగళ వారం ఈడీ ఆఫీస్ కు వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ కవర్ లో ఆ సెల్ ఫోన్ లను చూపుతూ వెళ్లడం కొంత చర్చా కొనసాగింది.

కవిత గారు అన్ని ఫోన్ లు ఎందుకు ఉపయోగించినట్లు అనే చర్చాకు సమాధానం ఆమెనే చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారుల కవిత ఎపిషోడ్ లో ముగింపు ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలు అసక్తిగా ఎదురు చూస్తున్నారు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు గురించి మీడియా ఎవరికి తోచింది వారు తమకు అనుకూలంగా రాసుకుంటున్నారు.

కవిత ఎఫిషోడ్ లో మూడో దఫా విచారణ ముగియడంతో ఇక కవితను పిలిచే అవకాశం లేదని వార్త కథనాలు వస్తున్నాయి. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆడుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంను డ్యామేజ్ చేయడమే ధ్యేయంగా వెలిసిన కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ మాత్రం కేసీఆర్ కుటుంబం బట్టలు ఊడ దీసి బజారులో పెడుతున్నారు.

మూడవ రోజు ఈడీ విచారణ ఎపిసోడ్..

ఢిల్లీ లోని ఈడీ ఆఫీస్ ప్రాంతం మీడియా హడావుడి కనిపించింది. కవిత చిరు నవ్వుతో విజయం సాధించినట్లు విక్టరి సంకేతం చేయి చూపిస్తూ లోనికి వెళ్లిన విజ్యువల్స్ తో రోజంతా విశ్లేషణలు కొనసాగాయి. అవే మాటలు.. అవే విశ్లేషణలు.. తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం కవిత ఎపిషోడ్ పై ఫోకాస్ పెట్టింది. ఇంతకు ఈ ఎపిషోడ్ ఉగాది పండగ తరువాత ముగుస్తోందనేది నిజం. ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో పొలిటికల్ గా చాలానే నష్ట పోయిందనేది జగమెరిగిన సత్యం.

ఉగాది పండగ తరువాత ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత విచారణ తేదీని ఈడీ అధికారులు నోటీస్ ఇచ్చిన తరువాతే తెలుస్తోంది. సస్పెన్స్.. థ్రిల్లింగ్.. క్రైమ్ సీన్ లతో కొనసాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం ఎపిసోడ్ కు ముగింపు ఎప్పుడో…???

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking