Header Top logo

Defeat is not new to me ఓటమి నాకు కొత్త కాదు

Defeat is not new to me

ఓటమి నాకు కొత్త కాదు

Defeat is not new to me ఓటమి నాకు కొత్త కాదు

అప్పుడప్పుడు గుండె
సముద్రమైపోతూ ఉంటుంది..
దుఃఖం అనంతఘోషలా
మదిలో కదులుతుంది

వేదనల కెరటాలు
బ్రతుకుతీరాన్ని బలంగా
తాకుతూనే ఉంటాయి..

అయినా పెదవులపైనవ్వు చెక్కుచెదరదు…
కళ్ళల్లో మెరుపు
కాస్తయినా తగ్గదు…
జీవితంతో పోరు
ఎప్పటికీ ఆగదు…

ఓటమిరుచిని వేల సార్లు
చవిచూసిన హృదయమిది
కరుకు మాటల గాయాలతో
రక్తమోడిన గుండె ఇది..

ఓటమి నాకు కొత్తేమీ కాదు
భయపడి వెనకడుగు వేయడానికి
గాయాన్ని గేయంగా పాడుకుంటూ
కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటూ
సాగుతున్న గమనం నాది..

అందుకే నాకు నేనే పోటీ..
నాతో నాకే రాజీ
గెలుపు కథగా నేను మిగిలేందుకు
చేస్తున్న నిరంతర యత్నంలో…

ఓటమి నాకు కొత్తేమీ కాదు భయపడి వెనకడుగు వేయడానికి గాయాన్ని గేయంగా పాడుకుంటూ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటూ సాగుతున్న గమనం నాది.. అందుకే నాకు నేనే పోటీ.. నాతో నాకే రాజీ గెలుపు కథగా నేను మిగిలేందుకు చేస్తున్న నిరంతర యత్నంలో

హరిజీవన్ వేముల, కవి

ఆర్మూర్, జిల్లా: నిజామాబాద్

Leave A Reply

Your email address will not be published.

Breaking