Header Top logo

తల్లి మందలింపుతో కూతురు ఆత్మహత్య

తల్లి మందలింపుతో కూతురు బావిలో పడి ఆత్మహత్య

పిల్లలు మరి సున్నితంగా పెరుగుతున్నారు. చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేక పోతున్నారు. ఇంటి వద్ద బిడ్డను వంట చేయుమని తల్లి మందలిస్తే బిడ్డా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ చదువుతున్న ఆ బిడ్డా బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు జీర్ఱించుకోలేక పోతున్నారు.

మహబూబ్ నగర్, మార్చి 14 : కోయిలకొండ: మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మి 17 తన తల్లి మందలించిందన్న మనస్థాపనతో బావిలో పడి ఆత్మహత్య చేసుకుని సోమవారం మృతి చెందింది.

కోయిలకొండ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి బూరుపల్లి గ్రామానికి చెందిన నాగమ్మ పోశయ్య దంపతుల కుమార్తెను నాగలక్ష్మి కోయిలకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది. 12వ తేదీన సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన నాగలక్ష్మి తల్లి వంట చేయమని మందలించింది.

భోజనం చేసిన తర్వాత తమ కూతురితో సహా ముగ్గురు అక్కడి నిద్రపోయారు. నాగలక్ష్మి మనస్థాపానికి చెంది గ్రామంలోని వెంకటరెడ్డి బావి దగ్గరకు వెళ్లి అర్ధరాత్రి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున తమ కూతురు బహిర్భూమికి వెళ్లిందేమో అని కొద్దిసేపు చూసినా తిరిగి రాలేదు. బావిలో పడి ఉన్న నాగలక్ష్మి శవాన్ని గమనించిన గ్రామస్తుడు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో హుటాహుటిన భావి వద్దకు  చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. నాగలక్ష్మి తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు కోయిలకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking