Header Top logo

పశువులొచ్చాయని ఫైన్ వేసిన ములుగు కలెక్టర్

ఇగో గీ వార్త చదువుతుంటే నవ్వు రావచ్చు..

మరీ.. మీరు ఈ వార్త చదువుతున్నట్లు నవ్వుతున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్  కృష్ణ ఆదిత్య ఐ.ఎ.ఎస్ గారికి తెలిసిందనుకో..

Telangana: ఇదేంది సారూ..! తన వాహనానికి పాడి గేదెలు అడ్డొచ్చాయని కాపులాదారుడికి కలెక్టర్ ఫైన్

మీకు జరిమానా వేయచ్చు..

ఒకవేళ జరిమానా వేస్తే వార్త రాసినందుకు నన్ను తిట్టు కోవద్దు. ఇంతకు ఈ వార్త స్పెషల్ ఏమిటో మీరే చదువండి.

ములుగు జిల్లా కలెక్టర్  కృష్ణ ఆదిత్య కారులో వెళ్లుతున్నడట..

పాపం ఆ పశువులకు ఏమి తెలుసు..

ఆ పశువులకు కలెక్టర్ కారైనా.. కామన్ మెన్ కారైనా ఒక్కటే రోడ్ లో నిదానంగా నడుస్తు వెళ్లుతుంటే కలెక్టర్ కు కోపం వచ్చిందట..

అంతే.. కింది అధికారులకు ఫోన్ చేసి ఆ పశువుల కాపారికి ఫైన్ వేయించడట..

ఐఎఎస్ చదివిన గీ కలెక్టర్ గిట్ల ఎందుకు చేసిండని అనుకుంటున్నారా..

కోపం వస్తే మీరైనా.. నైనైనా ఒక్కటే.. గిట్లాంటి నిర్ణయాలు తీసుకుంటాం.

ఇగో ఇలా వార్త రాసినందుకు నాకు కూడా  ములుగు జిల్లా కలెక్టర్  కృష్ణ ఆదిత్య గారు ఫైన్ వేస్తారో.. ఇంకెమైనా శిక్షిస్తారో..

ఈ వార్త నేనేందుకు రాసానంటే..

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇగో ఈ వార్త పూర్తిగా చదువుండ్రి..

—– —–


వివాదాస్పదమైన ములుగు జిల్లా కలెక్టర్ తీరు…

కారుకు అడ్డంగా పశువులొచ్చాయని ఫైన్ వేసిన కలెక్టర్..

వాహనానికి పశువులు అడ్డొచ్చాయని కాపరిపై ములుగు జిల్లా కలెక్టర్‌ శ్రీ ఎస్ కృష్ణ ఆదిత్య

కన్నెర్ర చేశారు.

కింది స్థాయి అధికారులను పిలిచి చర్యలు తీసుకోమని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ఆ పశువులకాపరిపై చర్యలకు ఉపక్రమించారు.

ఏకంగా అతడి పశువులు హరితహారంలో నాటిన మొక్కలను నాశనం చేస్తున్నాయనే నెపంతో రూ.7,500 జరిమానా విధించారు.

లేదంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. చేసేదేమీ లేక భయంతో ఆ కాపరి జరిమానా చెల్లించాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.

ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన బోయిని యాకయ్య రైతుల పాడి గేదేలను అడవికి తీసుకెళ్లే క్రమంలో కలెక్టర్‌ వాహనానికి అడ్డుగా వచ్చాయి.

హారన్‌ కొట్టినా పట్టించుకోకుండా యాకయ్య ఫోన్‌ మాట్లాడటంలో బిజీ అయ్యాడు.

ఇది చూసి చిర్రెత్తిన కలెక్టర్ యాకయ్యపై ఫైర్ అయ్యారు.

వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు యాకయ్య పశువులు హరితహారంలో నాటిన మొక్కలు మేస్తున్నాయనే నెపంతో జరిమానా విధించారు.

కలెక్టర్, అధికారుల తీరుపై పలువురు పశువుల కాపర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking