Header Top logo

నిష్పక్ష పాతంగా ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికల నిర్వహణ

శాంతి భధ్రతలకు ఎటువంటి ఆటంకము కలగకుండా పోలీస్ వ్యవస్థ 24×7 ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తా తిరుపతి అర్బన్ జిల్లా నూతన యస్.పి. శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్…

ఆదివారం తిరుపతి అర్బన్ జిల్లా నూతన యస్.పి గా శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు పదవీ భాధ్యతలు స్వీకరించారు. తిరుపతి ప్రపంచ ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం శ్రీవారి సన్నిధిలో తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి గా పదవి భాద్యతలు స్వీకరించడం సంతోషంగా ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారితో సత్సంబంధాలు కొనసాగించి పోలీస్ సేవలను మరింత ముందుకు తీసుకువెలుతాను. స్థానికల ఎన్నికల సమయం తక్కువగా ఉంది క్షేత్రస్థాయిలో ఎనికలు జరుగు ప్రాంతాలను సందర్శించి అవగాహనతో ముందుకు వెలుతాను. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోనడానికి పోలీస్ యంత్రాంగం సిద్దంగా ఉంది. సమస్యాత్మక మైన ప్రాంతాలను గుర్తించి పూర్తి స్థాయిలో భందోబస్తూ ఏర్పాటు చేస్తామన్నారు.

ఇంతకు ముందు చిత్తూర్ జిల్లా యస్.పి గా పని చేసిన అనుభవం ఉంది.

రాబోవు కాలంలో తిరుపతి అర్బన్ జిల్లా పరిసర ప్రాంతాలలో ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తాము.

ప్రజలు యొక్క అవసరాలకి అందుబాటులోఉంటూ సకాలంలో స్పందించేటట్లు జిల్లా పోలీస్ యంత్రాంగం ఉంటుంది.

ప్రజల్లో విశ్వసనీయత పొందేటట్లు, వారిలో సురక్షిత మరియు భద్రత చూడటం మా విధిగా, భాద్యతగా మేము భావిస్తున్నాము. దానికనుగుణంగా మా కార్యాచరణ, ప్రణాళిక సిద్దం చేసుకొని ముందుకు సాగుతాము.

జరగబోవు ఎన్నికలు కూడా ప్రతి ఒక్కటి స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ప్రజాస్వామ్యబద్ధంగా సంఘర్షణలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేటట్లు చర్యలు తీసుకుంటాను.

ప్రజలకు కూడా పోలీస్ పై ఒక నమ్మకం వచ్చేటట్లు పోలీస్ యంత్రాంగాన్ని ముందుకు తీసుకువెళ్తాను.

పోలీస్ సంక్షేమం మీద ఒక దిశ ఉండేటట్లు చూడటం కూడా నా భాద్యతగా భావిస్తున్నాను.

ప్రజల యొక్క మద్దతు అదేవిధంగా వారి యొక్క సహకారం కూడా చాలా అవసరం.

ముఖ్యంగా మీడియా మిత్రుల యొక్క సహకారం కూడా వుంటుందని భావిస్తున్నాను.

మీ అందరి సహకారంతో విజయవంతంగా ముందుకు వెళ్తానని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా జిల్లా యస్.పి తెలిపారు.

 

మల్లయ్య
రిపోర్టర్
AP39TV

Leave A Reply

Your email address will not be published.

Breaking