Header Top logo

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 60 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక

ap39tv , కళ్యాణదుర్గం (అనంతపురం జిల్లా)

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 60 కుటుంబాలలోని సుమారు 300 మంది తిమ్మసముద్రం గ్రామస్తులు తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చాలామందికి అందక పోవడంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వ్యవహార శైలి నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తిమ్మసముద్రం గ్రామానికి చెందిన వెంకటేశులు అభిప్రాయపడ్డారు .ఈ సందర్భంగా ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ యని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తోందని అన్నారు. అందరు సమిష్టిగా పని చేసేయ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నారాయణ మురళి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking