అమరావతి, గోదావరి ముంపు ప్రాంతాల ఏరియల్ సర్వేలో సిఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్నినాని ఉన్నారు.
అంతకుముందు గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ‘‘అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నేను ఏరియల్ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నానని’ ఆయన అన్నారు.