Header Top logo

నాణ్యతలేని రోడ్లు వేసిన కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలి: సిపిఐ మండల కార్యదర్శి బోయిని

తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామ శివారులో గల డబల్ రోడ్డు గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సగం రోడ్డు పూర్తిగా కూలిపోవడం జరిగింది, ఇది ముమ్మాటికి కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులు చేయడం వల్లనే అని బోయిని తిరుపతి ఒక ప్రకటనలో తెలపడం జరిగిందిఈ రోడ్డు మానకొండూరు నుంచి హుస్నాబాద్ వరకు రెండు వరుసల రోడ్డు వేయడం జరిగింది మొన్నటి వర్షాలకు చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.దీనికి పూర్తి బాధ్యత కాంట్రాక్టర్ వహించాలి అధికారులు తక్షణమే కాంట్రాక్టర్ ను పిలిపించి ఈ రోడ్డు పనులు మళ్లీ చేసేలా చూడాలి లేనిచో అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అలాగే ఈ రోడ్డు ను కూడా పూర్తిస్థాయిలో పని చేయలేదు పొలం పల్లి గ్రామంలో డబుల్ రోడ్డు మొత్తం వేయలేదు అలాగే మట్టి రోడ్డు వదిలిపెట్టి పోయినాడు ఇంతటి నిర్లక్ష్యపు కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని
బోయిని తిరుపతి డిమాండ్ చేయడం జరిగింది.

అలాగే పోలంపల్లి మొగిలి పాలెం మధ్యలో ఒక బ్రిడ్జి ను ఏర్పాటు చేయాలి మొన్నటి వర్షాలకు కల్వర్టు పూర్తిగా ధ్వంసం అయినది ఈ కల్వర్టు మీదుగా పర్లపెళ్లి పరిధిలోని 30 కుంటలు రెండు చెరువులు అవన్నీ నిండుకొని వాటి నీరంతా పొలం పల్లి శివారు మీదుగా ఈ కల్వర్టు ద్వారానే పోవాలి కావున ఈ చిన్నపాటి కల్వర్టు అంతటి నీటి తాకిడిని తట్టుకోలేక పోతుంది
దీనికితోడు పార్లపల్లి లో పెద్ద చెరువు నిండుకుండలా మారడం వల్ల ఆ చెరువు కూడా తెంపడం జరిగింది ఆ నీరు కూడా ఈ కాల్వార్ట్ ద్వారానే వెళ్లడం జరిగింది. కావున ఇంత పెద్ద నీటి ఒత్తిడిని తట్టుకోలేక నీళ్లన్నీ వరి పొలాల మీద పడిపోయాను దాని వల్ల వందల ఎకరాల్లో పంట నాశనం జరిగింది కావున ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఒక బ్రిడ్జి నిర్మించాలని బోయిని తిరుపతి ప్రభుత్వన్ని కోరడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking