AP 39 TV 26 మార్చ్ 2021:
సి ఐ టి యు భగత్ సింగ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారత్ బంద్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నరేంద్ర మోడీ బిజెపి కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, వీటితో పాటు విశాఖ ఉక్కు ను అదేవిధంగా రైల్వే బిఎస్ఎన్ఎల్ లతోపాటు రైతులకు తెచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని భగత్ సింగ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆటోకు డీజిల్ వేసుకో లేని పరిస్థితుల్లో తాడుతో లాక్కుంటూ ఎన్టీఆర్ విగ్రహం నుండి సప్తగిరి సర్కిల్ ధర్మవరం బస్ స్టాప్ వరకు తాడుతో లాక్కొని ర్యాలీగా గా పోవడం జరిగింది. మా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవర్లు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ నగర కార్యదర్శి ఎస్ లతీఫ్, ఆటో యూనియన్ అధ్యక్షులు నాగరాజు , ఆటో యూనియన్ ఆఫీస్ బేరర్ నాయకులు శీన, శివ, నాగరాజు, మళ్లీ, కుళాయి, నాగేంద్ర, సీఎం రామాంజనేయులు,ముర్తుజా హరి, భాస్కర్ బాబు, కృష్ణారెడ్డి మిగతా నాయకులు ఆటో డ్రైవర్స్ పాల్గొనడం జరిగింది. మీ అందరికీ నమస్కారాలతో భగత్ సింగ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ నగర కార్యదర్శి TSF లతీఫ్.