AP 39TV 30 ఏప్రిల్ 2021:
వివిధ అనారోగ్య కారణాలతో 39 డివిజన్ లక్ష్మీ నగర్ కు చెందిన తిరుపాల్రెడ్డి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి గత సంవత్సరంలో మరణించడం జరిగింది. ఆర్థిక పరిస్థితి ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న సందర్భంలో ఆ కుటుంబం పరిస్థితి గురించి ఎమ్మెల్యే శ్రీ అనంత వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో ఆయన స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తిరుపాల్రెడ్డి భార్య నాగరత్నమ్మకు 90000 చెక్కును ,అదేవిధంగా లక్ష్మీ నగర్ కు చెందిన మెహ్రూన్ బి చేతి వేలు తెగిపోవడంతో ఆసుపత్రిలో చేరి వైద్యం కోసం కొంత డబ్బును ఖర్చు చేయడం జరిగింది. ఆమె కూడా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కును ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వసీం,చింతకుంట మధు ,పెనో ఓబులేసు, గోపాల్ మోహన్ ,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.