ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు అనంతపురం కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు గారి పై చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ అలా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అందుకు దళిత సంఘాల ఆధ్వర్యంలో చలో ధర్మవరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కదిరి నుండి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్ గారు సుమారు 200 మంది 15 వాహనాలలో బయలుదేరుతున్న సమయంలో కదిరి పోలీసులు ఎవరైతే ఉన్నారో టౌన్ C. I. నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జమీందారు రంగనాయకులు గారు క్రైమ్ కానిస్టేబుల్ రామంజి గారు తదితర పోలీసు సిబ్బంది తమ ఇంటి దగ్గరికి వచ్చి గృహనిర్బంధం చేయడం చాలా బాధాకరం ఈరోజు ఈ కార్యక్రమం అయితే ఆపగలరు కానీ రేపు కొన్ని లక్షల కార్యకర్తలు రోడ్ల పైకి ఎక్కితే మీ పోలీస్ బలగాలు ఏవి పని చేయలేవని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్ గారు మేకల నాగార్జున గారు తదితర నాయకులని గృహానిర్బంధం చేయడం జరిగింది.