Caste is an obstacle to the revolution విప్లవోధ్యమానికి ఆటంకం…
Caste is an obstacle to the revolution …
ఆత్మవిమర్శ లేకపోతే అంతం తప్పదు… కులం కుంపటే విప్లవోధ్యమానికి ఆటంకం…విప్లవోధ్యమానికి నవీకరణ తప్పదు…కమ్యూనిస్టులు పునః పరిశీలన అవసరం…
కులం పునాదుల మీద ఒక జాతిని గాని నీతిని గాని నిర్మించాలేవు అన్న అంబేద్కర్ కు ఏకంగా అ కులానికి పరిమితం చేశారు. అలాంటిది ఆర్. కే. ను వదులుతారా.? కాబట్టి ఈ దేశంలో మావోయిస్టులు ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్పు అనివార్యం అని చెప్పిన కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఈ దేశానికి స్వారీ… అణగారిన ప్రజలకు, అడవి మనుషులైన గిరిజన బిడ్డలకు కమ్యూనిజం ఎంతో నేర్పింది. అణగారిన దళిత, బడుగు బలహీన వర్గాలకు ఉద్యమ అడుగులు వేయడం నేర్పింది. అలా కమ్యూనిస్టు లు ఈ దేశాన్ని ఏలుతారూ అనే స్థాయి నుంచి వారి చిరునామా వెతుక్కునే పరిస్థితి వచ్చింది. విప్లవం కోసం కమ్యూనిస్టులు ఈ దేశం గురించి కొత్త కోణంలో చూడాల్సిన రోజు వచ్చింది. అలా చూడకపోవడంతో మూడుగా విడిపోవడమే అసలు సమస్య. సాయుధ పోరాటాల ద్వారా లేక వర్గ పోరాటాల ద్వారా లేక ప్రజాస్వామ్యం ద్వారానా. ఎలా .? ఈ సమాజంలో అసమానతలను, అవమానాన్ని, ఆకలిని రూపుమాపి కూడు గూడు గుడ్డ సాధించుకోగలమా అనేదే అసలు సమస్య. ఈ సమస్యను పరిష్కరించడంలో ఈ దేశంలో దాని వాస్తవికతను గుర్తించడంలో విఫలమయ్యారని ఖచ్చితంగా చెప్పొచ్చు.
అయితే ఆర్కె వీరమరణం ఈ దేశంలో కొత్త చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే కులం కుంపటితో మతం మత్తుతో రంకు రాజకీయాలతో పాలన సాగుతోంది. ఈ తరుణంలో ప్రజానీకం ఏటువైపు నిలుస్తారూ, ఇక్కడ విప్లవం సాధ్యమేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది. సిద్ధాంతం పేరిట భుజాన తుపాకీ వేసుకొని అడవి బాట పట్టిన ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు ఇక అంతేనా అనేలా అనిపిస్తుంది. కానీ ముమ్మాటికీ వారి త్యాగం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఖచ్చితంగా మరో రూపంలో ఉద్యమంగా బయటకు వస్తుంది. నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను అర్పించే వ్యక్తులు, జనమే ప్రాణంగా భావించే వ్యక్తులు వారి త్యాగం ఎప్పుడూ వృధా కాదు. కానీ విప్లవ ఉద్యమ ఒకవైపే నూతన సరళీకరణ ఆర్థిక విధానాలు మరోవైపు ఉన్నప్పుడు వర్గపోరాటం విజయం సాధ్యమే. కానీ మతం దానికి తోడుగా నిలిచే కులం కుంపటి ఈ పోరాటాలను ముందుకు వెళ్లకుండా చేస్తుందనేది అక్షర సత్యం.
ప్రపంచ చరిత్ర అంత ఒక వైపు చూస్తే నాణానికి రెండు వైపులా ఈ దేశంలో విప్లవ ఉద్యమాన్ని మరో కోణంలో చూడాల్సి వస్తుంది. అదే కులం. ఈ కులం గురించి చెప్పాలంటే ఇప్పటికే ఖండాంతరాలను దాటి ఇతర మతాల్లోకి కులం ఎప్పుడో చొరబడింది. ప్రపంచంలోని భారతీయులు ఏ మతంలో ఉన్న ఈ కులం వదలడం లేదు. ఒక కొత్త ఒరవడికి దారితీస్తుంది అన్నది నిజం. ఉదాహరణకు దళిత బహుజనం కొందరూ క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నారు. కానీ ఈ దేశంలో సనాతన ధర్మమో, మనుధర్మమో పుట్టించిన కులం మతాన్ని సైతం విభజిస్తుంది. అక్కడి నుంచి కులం ఏకతాటిపై ఉన్న క్రైస్తవులను విభజించి పాలిస్తుంది. అదెలా అనుకుంటున్నారా.? ఈ కులం మతంలో చొరబడ్డక వర్గీకరణగా రూపాంతరం చెందింది. అందరూ క్రైస్తవులైన ఏసును ప్రార్థించిన చర్చికి వెళ్లిన పెళ్లి స్థితి వచ్చేనాటికి కులం ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ దేశంలో పైకి కనిపిస్తున్న క్రైస్తవం కులాల కుంపటి తో కొట్టుమిట్టాడుతుంది. అక్కడ మనం క్రైస్తవులు కావచ్చు కానీ మన కులం ఒకటి కాదు కదా అనే స్థితికి తీసుకు వచ్చింది. అంటే ఈ దేశంలో పుట్టిన కులం, మనిషి ఖండాంతరాలు దాటి వెళ్ళిన మనిషిని మాత్రం వదలడం లేదు. బౌద్ధం, ఇస్లాం ఇలా మతం ఏదైనా ఈ కుల విభజన రేఖ స్పష్టంగా ఉంది. అలాంటప్పుడు మతం మారిన మారకపోయిన ఏమిటి.? కాబట్టి కులం ప్రాధాన్యత ఖచ్చితమైన చర్చతో కూడిన సిద్ధాంతపరమైన దశ దిశగా గుర్తించాలి.లేదా ఈ దేశంలో విప్లవోద్యమాలు సాధ్యం అనేది ఇంకెన్ని లైన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఆర్ కె బ్రాహ్మణ కులంలో పుట్టిన నమ్మిన సిద్ధాంతం కోసం వెనకడుగు వేయలేదు. అంబేద్కర్ కాలంలోనే బ్రాహ్మణ గురువైన అంబేద్కర్ తన పేరును డాక్టర్ భీమ్ రావుకు అంబెడ్కర్ గా పేరు మార్చిన ఘనత ఇప్పటికీ చెప్పుకుంటామనేది ఒక చారిత్రక సత్యం. ఎక్కడో జరిగిన ఒకటి రెండు సంఘటనలు వాటిని ఒప్పుకోక తప్పదు. అదే సత్యం. అంతమాత్రాన బ్రాహ్మణ వాదం ఈ దేశ పునాదులను ఎటువైపు తీసుకువెళ్లిందో గమనించాల్సిన అవసరం తప్పనిసరి ఉంది.భారతదేశం డిఎన్ఎ లో మతం కంటే కులం ప్రభావం బలంగా ఉంది. దీని ఫలితమే నక్సలిజం అయినా కమ్యూనిజమ్ అయినా ఏ యిజమైన ఈ దేశంలో ఫెయిల్ అయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక కాలం చెల్లిన సిద్ధాంతం అంటున్నాం. ఖచ్చితమైన సిద్ధాంతంతో ఉద్యమాలు వచ్చినప్పుడు అది రూపాంతరం చెందుతుంది. జనం కోరుకునే పద్దతిలో కొత్త కోణంలో బయటకు వస్తాయి అనేది వాస్తవం. అందుకే ఇప్పుడు జనం మార్పు కోసం ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. రాజకీయాలు పార్టీలు వాటిని అవకాశంగా తీసుకొని ఎక్కడికక్కడ వాస్తవాలను బయటకు రాకుండా భూర్జువ రాజకీయ పార్టీలు ప్రజలను కట్టడి చేస్తున్నాయి. చివరకు అర్బన్ నక్సల్స్ పేరుతో నడుస్తున్న నిర్బంధం కనిపిస్తుంది కదా. సకల జనుల ప్రజా ఉద్యమంతో సాదించుకున్న తెలంగాణను ఏప్పుడు సామాజిక తెలంగాణగా చూడగలుగుతాం. Caste is an obstacle to the revolution
జల్, జంగిల్, జమీన్ నేపథ్యంలో కలలుగన్న మనిషికి (ఆర్. కే) నిజంగా నిజమైన మనిషిగా గుర్తింపు లభించింది. కార్పొరేట్ కంపెనీల కబంధహస్తాల కింద పడకుండా అడవి ప్రాంతాలను కాపాడింది తుపాకుల మోతనే కచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ప్రైవేట్ రంగం పేరుతో ప్రపంచీకరణ అంటూ ఈ దేశ, రాష్ట్రాలు చట్టసభలు అనుమతుల పేరుతో అడవులను అన్యాక్రాంతం చేస్తున్నాయని మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాము. మనం మౌనంగా ఉన్నా ఆ మహానుభావులు అడుగుల సవ్వడి ఇప్పుడు మనం చూస్తున్నాం. అదే లేకపోతే అడవి బిడ్డలు ఆర్తనాదాలు వినబడవు, వాళ్లు మనకు కనబడరు. ఇది ముమ్మటి నిజం. ఆర్. కే. వ్రధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం.
ఏడ్ల సంజీవయ్య, సీనియర్ జర్నలిస్టు,
నిజామాబాద్