Header Top logo

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ కెటాయించాలి

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బడ్జెట్ కెటాయించాలి

జగిత్యాల జిల్లా : గల్ప్ బాధితులను ఆదుకొవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది తెలంగాణ గల్ఫ్ జేఏసీ. మెట్ పల్లి సమావేశ మందిరంలో గల్ఫ్ JAC ఆధ్వర్యంలో ఎర్పాటు చేసిన సమావేశంలో  తెలంగాణ గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవి గౌడ్ మాట్లాడారు.

నాటి నుండి నేటిదాకా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులకు అన్యాయం చేస్తునే ఉన్నాయని ఈ అసెంబ్లీ మరియు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలోనైన గల్ఫ్ కార్మికులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలన్నారు రవి గౌడ్ .

రాష్ట్ర ప్రభుత్వం చివరి బడ్జెట్ లో 500 కోట్లు కెటాయించి గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవాసి భారతీయ బీమా యోజన 10 లక్షల పాలసీని సాధారణ మరణాలకు కూడా వర్తింపజేయాలన్నారు.

హైదరాబాద్ లో గల్ఫ్ కాన్సులేట్ లు ఏర్పాటు చెయ్యాలన్నారు.  ఒక వేల ఈసారి రాష్ట్ర కేంధ్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని MLA MP MLC ల ఇండ్లను ముట్టడిస్తామని గ్రామాల్లోకి రానివ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు

తెలంగాణ కళాకారులు లింగంపల్లి నరేష్ ప్రభుత్వాల పనితీరును ఆటపాటలతో ప్రశ్నించారు.
గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు రోదిస్తూ వారి కుటుంబాలను ప్రభుత్వాలే ఆదుకోవాలని ప్రాధేయపడ్డారు.

మెట్పల్లి పట్టణానికి చెందిన తెలంగాణ గల్ఫ్ వెల్పేర్ అసోసియేషన్ ఖతార్ అధ్యక్షులు ఖాజా నిజామోద్దీన్ వీడియో కాల్లో మాట్లాడుతూ గల్ఫ్ లో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న తెలంగాణ బిడ్డలను విడిపించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షులు సుంధరగిరి శంకర్ గౌడ్ , న్యాయవాది లింబాద్రి , MD అజీమ్, బైరి రవి, కోట శ్రవణ్ మరియు గల్ఫ్ అమరుల కుటుంబీకులు గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking