Breathe to the country దేశానికి శ్వాస
Breathe to the country
దేశానికి శ్వాస
నిద్రపోని సరిహద్దుకు భద్రత కల్పిస్తూ
నిద్రెరుగని రాత్రులలో
నిత్యం కాపలా కాస్తూ
మరణానికి ఎదురెల్లే మహా వీరులు
దేశానికి వెన్నెముకైన మన సైనికులు
ఎముకలు కొరికే చలిలో
ఏ క్షణమేమౌనో తెలియని క్షణంలో
నిప్పుకణికలు కూడా నివ్వెరపోయేలా
నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యమై నిలుస్తారు
అయినవారి ప్రేమలు ఆవలి ఒడ్డుకు వదిలేసి
అలుముకున్న ఆశయాలు గుండెలనిండా ఎగరేసి
నేనంటే దేశమని
నేనుంటేనే దేశమనీ
నిక్కచ్చిగ నినదించే నిస్వార్థపు వీరులు
ఋతువులెన్ని మారినా
రూపం మారని ఆశయం వారిది
రక్త తర్పణాలెన్ని చూసినా
దిగాలుపడని మనసులు వారివి
ఛేదించడం తప్ప
శోఖించడం తెలియదు వారికి
దేశానికి శ్వాస వారు
దేహాన్ని తృణప్రాయంగా త్యజించేస్తారు
నరనరాన దేశభక్తి నింపుకున్న ధీరులు
కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్న సైనికులు
సాహసమే ఊపిరైన సైనికులారా
సాగిలపడి మొక్కుతోంది భరతజాతి..
మచ్చరాజమౌళి
దుబ్బాక, 9059637442