Header Top logo

Book Review of “Covid – AIDS – I” “కోవిడ్ – ఎయిడ్స్ – నేను” పుస్తక సమీక్ష

Book Review of “Covid – AIDS – I”

“కోవిడ్ – ఎయిడ్స్ – నేను” పుస్తక సమీక్ష

డాక్టర్ దేవునితో సమానం

“వైద్యో నారాయణో హరీ”.!! అంటారు.. వైద్యుడు దేవునితో సమానమని..!! అంత పవిత్రమైన బాధ్యత కలిగిన వృత్తి కాబట్టే వారు అందరికీ అజాతశత్రువులుగా మారతారు..

అటువంటి వారు వృత్తి నిబద్ధతతో పాటు సామాజిక బాధ్యత ను కూడా కలిగిఉంటే..!!
ఆ సామాజిక బాధ్యతకు తోడుగా నిరంతరకృషి, సాధన , అసమానతలపై పోరాడాలన్న సంకల్పం తోడైతే…!!
అపర ధన్వంతరి లాంటి వైద్యుడు మన యనమదల మురళీ కృష్ణ గా కనిపిస్తారు..!
ఆయన రాసిన ” కోవిడ్ – ఎయిడ్స్ – నేను” అనే ఈ పుస్తకం “ఆధునిక చరక సంహిత” గా మనకు వైద్య సలహాలివ్వడం లో సందేహం లేదు.. !!

Book Review of "Kovid - AIDS - I"

డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు

ఈ మధ్యకాలంలో నేను చదివిన పుస్తకాల్లో నాకు నచ్చిన రెండో గొప్ప పుస్తకం ఇది. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. రంగం ఏదైనా తన పరిధికి మించి విస్తృతంగా విషయ సేకరణ చేసి, విస్తృతంగా పరిశీలన, పరిశోధన చేసిన వారు ఖచ్చితంగా రాణిస్తారు. వారికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్వయం కృషితో వారు ఎదగడమే కాకుండా, పదుగురికి సాయపడుతూ చరిత్రపుటల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. అటువంటి వారే డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు. Book Review of “Covid – AIDS – I”

ఎయిడ్స్ వ్యాధి నిపుణుని గా..

కొన్నేళ్ల క్రితం ఎయిడ్స్, ఇటీవల కోవిడ్.. రెండు విపత్కర పరిస్థితుల్లోనూ విస్తృత పరిశోధనలు చేసి తక్కువ కాలంలోనే సమస్యను సమూలముగా పరిష్కరించాలన్న ప్రయత్నం ఆయన్ని మరోసారి వైద్యరంగంలో ముందువరుసలో నిలబెట్టింది. 20 ఏళ్లకు పైగా ఎయిడ్స్ వ్యాధి నిపుణుని గా విస్తృత సేవలు అందించి చికిత్సతో పాటు సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మకమైన పలు సూచనలతో పొందుపరిచి తీసుకొచ్చిన పుస్తకం “కోవిడ్/ ఎయిడ్స్- నేను”.

పుస్తకరూపంలోకి తీసుకురావటం

రెండు చారిత్రక సమస్యలను పుస్తకరూపంలోకి తీసుకురావటం అన్నది చాలా గొప్ప ఆలోచన. ఆలోచన వచ్చిందే తడవు.. పుస్తకరూపం దాల్చిన పరిణామాల అక్షర రూపానికి సమీక్ష చేయడం సాహసమే అవుతుంది. అయినప్పటికీ మరోసారి మీ అందరికీ పరిచయం చేయడం నా సామ్యాజిక బాధ్యతగా చేస్తున్న పుస్తక సమీక్ష…!! Book Review of “Covid – AIDS – I”

Book Review of "Kovid - AIDS - I"

వ్యాధి వ్యాప్తి – నివారణ మార్గాలు

కోవిడ్ వైరస్ వ్యాప్తి, లక్షణాలు, రూపాంతరాలు.. మూడు వేవ్ లలో చోటు చేసుకున్న పరిణామాలు, వైద్య పరంగా అందిస్తున్న చికిత్సలు.. ఇలా ఎన్నో విషయాలను మొదటి అధ్యాయం లోనే తెలియజేశారు. వైరస్ లో వస్తున్న జన్యుపరమైన మార్పులు, వ్యాక్సిన్ వల్ల ప్రభావం, ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ పుస్తకంలో అక్షరీకరించారు. వ్యాధి వ్యాప్తి లో వేగం, ప్రభావంలో తీవ్రతను కూడా ఉదాహరణలతో వివరించారు.

మానసిక ధైర్యమే మొదటి “మందు”

వ్యాధి ఏదైనా సంక్రమించినప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత, మానసిక ధైర్యం రోగికి ఎంత అవసరమో ప్రాక్టికల్ గా తెలియజేశారు. ప్రధానంగా మానసిక ఆందోళన వల్ల పెరుగుతున్న ముప్పును దాని ప్రభావాన్ని స్పష్టంగా తెలిపారు. అప్రమత్తత, సన్నద్ధత లేనప్పుడు ప్రాణ నష్టం జరిగే పరిణామాలు ఎక్కువగా ఉంటాయి . అందువల్ల యంత్రాంగంతో పాటు వ్యక్తిగత రక్షణ కూడా చాలా అవసరం. ఇదే విషయాన్ని స్పష్టీకరించారు తన పరిశీలనల్లో..!!

ఇంటిలోనే వైద్యం

కోవిడ్ వైరస్ విజృంభిస్తున్న వ్యాప్తి సమయంలో వివేకంతో పలు దేశాలు తీసుకున్న నిర్ణయాలు, ఆ దేశ ప్రజలను విపత్తు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలను కూడా ఈ పుస్తకంలో తెలుసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా తెలుసుకోవాల్సిన మరో విషయం కోవిడ్ (తీవ్రత తక్కువగా ఉన్నపుడు)ఇంటిలోనే చికిత్స చేసుకునేలా ఔషధాలను ప్రత్యేక చిత్రాలతో అచ్చు వేయించి మరీ పెట్టడం వల్ల లక్షలాది మందికి మేలు జరిగింది. జరగనుంది. ఇటీవలే పదివేలకు పైగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్ట్ బాగా ఎంతగానో వైరల్ గా మారింది..

వైద్యుల ప్రాణాలకీ తప్పని ముప్పు

ఏసీ గదుల్లో రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ.. కోవిడ్ బారిన పడుతున్నారు. వైరస్ తో కలిసి ప్రమాదకరమైన గాలిని పీలుస్తూ తమకు ప్రాణాంతకమని తెలిసినా సేవలందించిన వైద్యులకు ఎన్నిమార్లు జోహార్లు చెప్పినా తక్కువే..

ఈ హోమ్ కేర్ కిట్ తోనే 71 ఏళ్ల వయసున్న డాక్టర్ గారి అమ్మగారు శ్రీమతి అనంతలక్ష్మి గారు కోలుకున్న విధానం కూడా ఎంతో మందికి మానసిక ధైర్యాన్నిస్తుంది. శరీరంలో ఆక్సిజన్ సాచురేషన్ పెంచుకునే పలు ఆసనాలను కూడా ఈ పుస్తకంలో ప్రచురించారు.

Book Review of "Kovid - AIDS - I"

ప్రతిభకు గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి దశలవారీగా ప్రాణాలు హరిస్తూ, ప్రాణాపాయ స్థితిలోకి నెడుతూ తన ప్రభావం చూపిస్తూనే ఉంది. ఈ వైరస్ నియంత్రణకు ప్రధానంగా ఐసోలేషన్, సత్వర వైద్యాన్ని అనేక ప్రభుత్వాలు అనుసరించాయి. అయితే కాకినాడకు చెందిన సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ మురళీకృష్ణ చేసిన పరిశోధనలకు తగిన గుర్తింపు లభించింది.

2011 నవంబర్ 17 , 18 తేదీల్లో జరిగిన “గ్లోబల్ సబ్మిట్ ఆన్ ఇన్ఫెక్షనస్ డిసీజెస్” పై నిర్వహించిన సదస్సులో అధ్యయన పత్రాన్ని సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా 29 పరిశోధన సారాంశాలు ఉన్న ఈ సదస్సులో మన భారతీయ వైద్యుని పరిశోధనకు చోటు దక్కడం గర్వకారణం..

బ్లాక్ ఫంగస్ వ్యాప్తి, తీవ్రతలు, ఈ వైరస్ పూర్వోత్తరాలు, గతంలో ఈ వైరస్ రూపంతారాల వల్ల వాతావరణంలో కలిగే మార్పులను పూర్తి సమాచారంతో అందించారు.

ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే సమయంలో హెచ్ఐవీ పరీక్షలు చేసినప్పుడు ఎదురైన సంఘటనలో ఆయన సీనియర్ కొంచెం అవివేకంగా అనిపించినప్పటికీ… ఒక విషయంపై ఎంతగా అవగాహన కల్పించాలో అన్న ఆలోచన వస్తుంది..

మూడు ఔషధాల నుంచి రెండు

పుస్తకంలో రెండో ప్రధాన అంశం “ఎయిడ్స్”. క్షయ వ్యాధిగ్రస్తులైన హెచ్ఐవీ రోగుల పై ఆయన చేసిన పరిశోధనలు ప్రస్తుతం ప్రపంచానికే తలమానికంగా నిలిచాయనడంలో అతిశయోక్తి లేదు. ఒక్కో దశనూ ఒక్కో సోపానంగా మలుచుకున్నారు.

క్షయ నిర్దారణ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయిన 107 మంది హెచ్ఐవీ రోగులకు పరీక్షలు జరిపి వైద్యపరమైన సూచనలు చేశారు. విస్తృత పరిశోధన, నిరంతర అధ్యయనం ద్వారా వైద్య పరమైన అంశాన్ని వెలుగులోకి తెచ్చారు.

ఇటీవల కోవిడ్ పీడ రెండో వేవ్ లోనూ, మూడో వేవ్ లోనూ తెలుగు వారికి సరైన రీతిలో అవగాహన కల్పించి, తనదైన చికిత్సను – ఉపశమనాన్ని ప్రజాపక్షం చేసిన డాక్టర్ యనమదల మురళీకృష్ణ, లక్షలాది మందికి ఏడాదికి పైగా భరోసా ఇచ్చారు.

భారతదేశానికే గర్వకారణం

2000 సంవత్సరంలో 13 వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సు దక్షిణఫ్రికాలోని డర్బన్ నగరంలో నిర్వహించారు. అంతకు ముందు జరిగిన అన్ని అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సులూ అభివృద్ధి చెందిన దేశాల్లో జరగ్గా ఇది తొలిసారిగా ఒక వృద్ధిలో వున్న దేశంలో నిర్వహించారు. ఎయిడ్స్ లో అత్యధిక మంది గురయ్యే క్షయ వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి వినియోగిస్తున్న అతి ఖరీదైన ( 2000 సంవత్సరంలోనే 2000 రూపాయలు) సిడి4 లింఫోసైట్ సంఖ్యను చూసే పరీక్ష బదులు మాంటూ – ట్యుబర్ క్యులిన్ పరీక్షను ఉపయోగించ వచ్చునని చూపిన డాక్టర్ యనమదల పరిశోధన పత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి శాస్త్రీయ పరిశోధన. Book Review of “Covid – AIDS – I”

డాక్టర్ మురళీకృష్ణ..

డాక్టర్ మురళీకృష్ణ అప్పుడే తన ఎండీ పూర్తి చేశారు. అంతే కాకుండా క్షయ వ్యాధిని నిర్థారించడానికి హెచ్ఐవి లో మాంటూ పరీక్ష వాడకానికి అప్పట్లో కొన్ని సడలింపులు ఉండేవి. అవి ఉపయోగకరం కావని తన పరిశోధన ల ద్వారా రుజువు చేసారు. సదస్సుకి నివేదించిన 5000 పరిశోధన సారాంశాల్లో “క్షయ – హెచ్ఐవి” పై ఎంపికైన గొప్పవైన పది పరిశోధన పత్రాల్లో ఎనిమిది ఆఫ్రికా ఖండం నుంచి, ఒకటి అమెరికా నుంచి కాగా మరోటి డాక్టర్ యనమదల మురళీకృష్ణది అంటేనే ఆయన పరిశోధన స్థాయి అర్ధం చేసుకోవచ్చు.

అదే స్థాయిలో మరో పరిశోధన…

1996 నుంచి ఎయిడ్స్ వ్యాధి చికిత్స కు మూడు ఔషధాల కాంబినేషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా ఉంది. 2000 సంవత్సరంలో సొంత ప్రాక్టీస్ ప్రారంభించిన నాటినుంచి దాదాపు అందరు పేషెంట్లకు రెండు ఔషధాలతో చికిత్స చేస్తూ 2004 లో ఒక అంతర్జాతీయ సదస్సుకు ఆ మేరకు పరిశోధనల సారాంశాన్ని సమర్పించారు. హెచ్ఐవి రోగుల్లో 2 ఔషధాల కాంబినేషన్ చక్కగా పని చేస్తున్నట్లుగా ప్రపంచ ఎయిడ్స్ నిపుణులు చెబుతున్నారు. “ఇలా ప్రపంచం వ్యాప్తంగా ఆలోచనను అనుసరించే పరిస్థితి నేను చూడలేక పోవచ్చు కానీ నా మేధస్సు, మార్గదర్శనం తప్పకుండా కాలపరీక్షకు నిలుస్తాయి” అని గర్వంగా చెబుతున్నారు.
ఈ పరిశోధనలు “బ్రిటిష్ హెచ్ఐవీ అసోసియేషన్” వారి “హెచ్ ఐ వీ మెడిసిన్ జర్నల్”లో ప్రచురితం కావడం కూడా గర్వకారణమే..!!

శాస్త్రం – జీవితం – దార్శనికం

ఇందులో కేవలం వైద్యపరమైన సూచనలు, పరిశోధనలే కాదు. తన జీవితంలో ఎదురైన అనేక అనుభవాలు, వాటిని తన ఎదుగుదలకు సోపానాలుగా మలుచుకున్న తీరు కూడా చూడొచ్చు. శాస్త్రాన్ని జీవితాన్ని దార్శనిక కోణంలో చూసిన డాక్టర్ గారు చేసిన ఎన్నో పరిశోధనలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన లింక్ లను కూడా ఇక్కడ పొందుపరిచారు. కాల పరీక్షకు ఎదురీది విజేత గా నిలిచే ఆయన ఆలోచనలు పరిశోధనలు మరెన్నో పొందుపరిచిన పుస్తకం కచ్చితంగా ప్రతి ఇంటా పెద్దబాలశిక్ష వంటిది.

చిన్నచూపు తగదు

వ్యాధి సోకిన వారి పై చిన్న చూపు కాకుండా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దానికి అనుగుణంగానే వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యం తో పాటు రోగికి ఆత్మస్థైర్యం కలిగించటం వల్ల కలిగే ప్రయోజనాలను కొన్ని కేస్ స్టడీ ద్వారా అత్యంత మానవీయంగా తెలియజేయడం అరుదైన విషయం. అనారోగ్యం కారణంగా ఎంతోమంది కుటుంబంపై మరింత బాధ్యతగా ఉంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఉదంతాలు కూడా కళ్లకు కట్టారు. Book Review of “Covid – AIDS – I”

ఏప్రాన్ కుట్టిన దర్జీ దగ్గరనుంచి ఆయన దగ్గర వద్ద కోలుకుంటున్న రోగుల వరకు ఎందరో జీవితాలను స్ఫూర్తిదాయకంగా మన ముందుంచారు.

Book Review of "Kovid - AIDS - I"

“మెడికల్ మ్యాగజైన్” లో ప్రత్యేక పాత్ర

రచయిత గారి వైద్య సేవలే కాదు జీవితం కూడా ఎంతోమందికి ఆదర్శం. ప్రయోగము, పరిశీలన, నిరూపణ మీద ఆధారపడిన సైంటిఫిక్ మెదడుపై రాసిన ఆర్టికల్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆధునిక వైద్యం వల్ల ఎన్నో రోగాల నుంచి కలిగిన ఉపశమనం, పెరిగిన జీవన కాలం, మానవ ఆలోచనా విధానం, సుఖమయ జీవితం.. ఇలా ఎన్నెన్నో చదివి తెలుసుకోవచ్చు..

రంగరాయ మెడికల్ కాలేజీలో డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి స్మృతికి అంకిత మిచ్చిన మెడికల్ మ్యాగజైన్ కి ఎడిటర్ గా, సెక్రెటరీగానూ ప్రత్యేక పాత్ర పోషించారు. అయితే పరీక్షలు దగ్గరైన ఈ సమయంలో మ్యాగజైన్ వర్క్ చేయడం పట్ల పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. మంచి మార్కులతో పాసై అందరి విమర్శలకు చెక్ పెట్టారు.

ఎవరు చెప్పినా ఏకపక్షంగా తీసుకోకుండా మనకు గల జ్ఞానాన్ని ఉపయోగించి అన్వేషణ శీలత ద్వారా ఎన్నో సాధించవచ్చని నిరూపించారు. జీవితంలో లో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గుకురావాలో స్పష్టమైన అవగాహన కలిగిన ఉన్నత వ్యక్తి. ప్రధానంగా కుల మత, జాతి వివక్షత ఉన్నప్పటికీ ఆపేక్ష ఎంత అవసరమో తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల ద్వారా తెలుసుకుని పదుగురికి సాయం చేస్తున్నారు.

“నడిపించిన నాన్నకే తండ్రి”గా..!!

మానసిక ధైర్యాన్నంతా కూడగట్టుకొని, శక్తులన్నీ ఏక బిగువుగా వినియోగించి తండ్రిని రక్షించి పునర్జన్మ ఇచ్చిన కొడుకుగానే కాదు.. ఆత్మీయతతో పాటు వృత్తిలో బాధ్యతను కూడా తెలిపారు. వ్యక్తి జీవితాన్ని అధికంగా ప్రభావితం చేయగలిగే జీవిత భాగస్వామి గీతతో… ఆయన పెళ్లి జరిగిన విధానం, దానికి కూడా చిన్నతనంలో జరిగిన ఒక అనారోగ్య సమస్య ద్వారా పెళ్లి కూతురు తరపు వారు వెనక్కు తగ్గడం, ఆయన రాసిన లేఖ ద్వారా వారే ముందుకొచ్చి పెళ్లి చేయడం.. ఆసక్తికరంగా ఉంటుంది.

జై భీమ్.. ఒక పాఠం

“బుద్దిలో లోపాల దిద్దుబాటుకు ఒక పాఠం జై భీమ్ చిత్రం” అంటూ రాసిన అధ్యాయంలో ఎన్నో స్ఫూర్తివంతమైన విషయాలు ప్రస్తావించారు. తన జీవితంలో ఎదురైన ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తితో అనుభవాలను ఏరి కోరి తెచ్చిన పూలతో దండ కూర్చిన్నట్టుగా అందించారు. అంతేకాకుండా వైద్యరంగంలో విశిష్టత కలిగిన డాక్టర్ జాన్ వీరభద్ర ప్రసాద్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, తనకు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్ తనికెళ్ల వెంకట రమణ శాస్త్రి గారు, సుబ్బరాజు గారు, సినీ గేయ రచయిత, కవి విమర్శకుడు అదృష్ట దీపక్ గారు…ఇలా ఎంతో మందితో తన సాన్నిహిత్యాన్ని, తాను నేర్చుకున్న అంశాలను తెలియజేశారు.

"బుద్దిలో లోపాల దిద్దుబాటుకు ఒక పాఠం జై భీమ్ చిత్రం" అంటూ రాసిన అధ్యాయంలో ఎన్నో స్ఫూర్తివంతమైన విషయాలు ప్రస్తావించారు. తన జీవితంలో ఎదురైన ప్రతి సంఘటన,

ప్రజాసంకల్ప యాత్ర.. చరిత్రాత్మక ఘట్టం

తనకిష్టమైన పుస్తకాలతోపాటు జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు కూడా అందంగా ఆవిష్కరించారు. రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ నైపుణ్యం, చరిత్రాత్మక ఘట్టం గా నిలిచిన ప్రజాసంకల్పయాత్ర ద్వారా ఆవిష్కృతమైన ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఇలా ఎన్నేన్నో అంశాలను ప్రస్తావిస్తూ అనంత అనుభవాలకు అక్షర రూపం ఇచ్చారు. Book Review of “Covid – AIDS – I”

“వైద్య శాస్త్రం – మనోవికాస శాస్త్రం” మేళవింపు

తరగతి గదిలో పాటల కన్నా.. బయట నేర్చుకున్న జీవితపాఠాలే మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయనడంలో ఈ పుస్తకం ఒక నిలువెత్తు నిదర్శనం. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్కలా ఈ పుస్తకం అద్భుతం ఔషధం. అటు వైద్యశాస్త్రాన్ని ఇటు మనో వికాసాన్ని మేళవిస్తూ పుస్తక రూపంలో తీసుకొచ్చిన డాక్టర్ శ్రీ మురళీ కృష్ణ గారికి ధన్యవాదాలు.

Book Review of "Kovid - AIDS - I"

పుస్తక సమీక్ష
పుస్తకం : “కోవిడ్ – ఎయిడ్స్ – నేను”
(రెండు ప్రపంచ పీడల నుండి లక్షలాది మందికి భరోసా)
రచయిత: డాక్టర్ యనమదల మురళీ కృష్ణ
ప్రతులకు: 94910 31492
ధర : 200
సమీక్ష : అమ్ము.బమ్మిడి
“ఆధునిక చరక సంహిత”

అమ్ము.బమ్మిడి

Leave A Reply

Your email address will not be published.

Breaking