Header Top logo

MLA KIDNAPPED BY NAXALS-02 నక్సల్స్ చెరలో ఎమ్మెల్యే

కిడ్నాప్..

MLA KIDNAPPED BY NAXALS

నక్సల్స్ చెరలో ఎమ్మెల్యే-02

ఒకప్పుడు ఎన్నిలంటే.. గోడ నిండా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సీపీఐ, సీపీఎం, బిఎస్పి పొలిటికల్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని వాల్ రైటింగ్ చేసే వారు.. రోడుపై పార్టీ జెండాలు.. బ్యానరులు కట్టెవారు.. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. బూటకపు ఎన్నికలను బహిష్కరించాని పీపుల్స్ వార్ గ్రూప్ నక్సల్స్ పిలుపు ఇచ్చింది. వారి భయానికి పల్లెల్లో పార్టీ కార్యకర్తలు ధైర్యం చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేరు. వాల్ రైటింగ్ రాయించలేరు. వాల్ పోస్టర్లు అంటించలేరు. బ్యానర్లు కట్టలేరు.. కానీ, రోడ్ పక్కన ఉన్న ఇళ్ల గోడలకు వేసిన తెల్లని సున్నంపై ఎర్రటి కలరుతో నక్సల్స్ రాసిన నినాదాలపై నా దృష్టి పడ్డది.

` నక్సలైట్లే దేశభక్తులు..

` అమర వీరులకు విప్లవ జోహార్లు..

` బూటకపు ఎన్నికలను బహిష్కరించాలి..

` నూతన ప్రజాస్వామిక విప్లవ వర్ధిల్లాలి..

దున్నే వానిదే భూమి కావాలి..

` తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తోంది..

` దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తాం..

` ఎన్ కౌంటర్ లు అన్ని బూటకమే..

గోడలపై కనిపించే ఆ నినాదాలు చదువుతుంటే పేదల బతుకులు గుర్తుకు వచ్చాయి.

‘‘భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించి నాలుగు దశాబ్దాలు గడిచింది. అయినా.. కూడు.. గూడు.. గుడ్డ ఈ మూడు లేని నిరు పేదలు ఈ సమాజంలో కోట్లాల్లో ఉన్నారు.. బ్రిటీష్ పాలకులను పారదోలి.. భారత మాతను విముక్తి చేసి.. ఇన్నేళ్లుగా మన వాళ్లు పరిపాలన చేస్తుంటే కూడా పేదల జీవితాలో ఎందుకు మార్పు రాలేదు.

ధనవంతుడు కోటీశ్వరుడయ్యాడు

దేశంలో పేదోడు నిరుపేదగా మారాడు.. ధనవంతుడు కోటీశ్వరుడయ్యాడు.. మధ్యతరగతి వర్గీయులు అటు ఇటూ కాకుండా జీవితాలను వెళ్ల దీస్తున్నారు. దోపీడి.. అవినీతి, అక్రమాలు.. ఆకలి చావులు.. రైతు ఆత్మహత్యలను చూసి పాలకులుగా సిగ్గు పడాలి. అందుకే పేదలను దోపీడి చేయని వ్యవస్థ కోసం నక్సల్స్ పోరాటాలు చేస్తున్నారు. MLA KIDNAPPED BY NAXALS

అయినా.. నక్సల్స్ కేంద్రంగా నిలిచిన రామడుగు గ్రామంలో వందలాది మంది ప్రజలు తనకు స్వాగతం పలుకడం నిజంగా జీవితంలో మరిచి పోలేను.’’ అనుకున్నాను.

అరగంట తరువాత మా ర్యాలీ గ్రామ పంచాయతీ భవనానికి చేరుకుంది.

అప్పటికే చాలా మంది జనం ఆ ర్యాలీతో అక్కడికి వచ్చారు.

నూతన జనశిక్షణ నిలయం కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి లోనికి వెళ్లాను.

నాతో పాటు లోనికి వచ్చారు రఘువీరరెడ్డి.. ముత్తయ్య.. హన్మండ్లు.. గ్రామ పెద్దలు..

డప్పు కొట్టడం ఆపడంతో ఒక్కసారి వాతవరణం నిశ్చబ్దంగా.. ప్రశాంతంగా కనిపించింది.

ఆ సమయంలోనే ధన్.. ధన్.. తుపాకులు పేలిన శబ్దాలు వినిపించాయి.

ఆ కాల్పుల శబ్దం వచ్చిన వైపు తిరిగి చూసారు గ్రామస్తులు..

పీపుల్స్ వార్ గ్రూప్ సిర్నాపల్లి నక్సల్స్ దళం..

దళ కమాండర్ ప్రసాద్.. డిప్యూటీ దళ కమాండర్ కూర మల్లన్న.. మరో ముగ్గురు దళ సభ్యులు..

అల్వీన్ గ్రీన్ డ్రెస్ లో ఉన్న వారంతా ఆ గ్రామస్థుకు పరిచయమే.. భుజాన తుపాకి.. మెడలో తూటల మాల.. నడుము చుట్టు బెల్టుకు బాంబులు.. వీపు వెనుక వేలాడుతున్న కిట్ బ్యాగ్స్..

నక్సల్స్ దళంను చూసి ఒక్క క్షణం ఆశ్చర్య పోయారు ప్రజలు..
ఏదో కీడు జరుగుతుందని భావించారు వారంతా..

ఎమ్మెల్యేను ఏమి చేస్తారో

‘‘ నక్సల్స్ వచ్చారు.. ఇగ.. ఎమ్మెల్యేను ఏమి చేస్తారో..’’ ఓ వృద్దుడి నోటి నుంచి వచ్చిన మాట విని తిరిగి చూసాను.
రెప్పపాటులో దళ కమాండర్ ప్రసాద్ నా వద్దకు వచ్చాడు. ‘‘హ్యండ్సాప్.. నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం.. మాతో మర్యాదగా రావాలి..’’ హెచ్చరించాడు అతను. అతని మాటకు షాక్ అయ్యాను.

ఆ క్షణంలో ఏమి జరుగుతుందో అర్థం కాలేదు నాకు.. నక్సల్స్ నన్ను కిడ్నాప్ చేసి ఆ తరువాత ఏమి చేస్తారోనని ఆందోళన చెందాను. నక్సల్స్ కార్యకలపాల గురించి విన్నాను. కానీ.. వారిని ప్రత్యక్షంగా చూసిన సందర్భం లేదు.

ఆయుధలు ఉన్నాయెమోనని

జన శిక్షణ కార్యాలయం లోంచి నన్ను బయటకు తీసుక వచ్చాడు దళ కమాండర్ ప్రసాద్. ఆ రోడ్డు మధ్యలో నన్ను నిలబెట్టి చుట్టుగా గీసిన గుండ్రం లోపలికి ఎవరు రావద్దని హెచ్చరించాడు అతను.. అక్కడక్కడ దళ సభ్యులు సెక్యూర్టీ చేస్తున్నారు.. ఓ దళ సభ్యుడు ఆయుధలు ఉన్నాయెమోనని నా కారు చెక్ చేశాడు.. నన్ను నక్సల్స్ కిడ్నాప్ చేసారని తెలియగానే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

‘‘ఎన్నిక ప్రచారం చేయద్దని చెప్పినా.. ఎమ్మెల్యేతో తిరుగుతావా..?’’ నాతో పాటు వచ్చిన సిర్నాపల్లి సర్పంచ్ రఘువీర్ రెడ్డిని చితుక బాదారు నక్సల్స్..

నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. కళ్ల ముందే రఘువీర్రెడ్డిని కొడుతున్న నిశ్చేష్టుడిగా ఉండి పోయాను. మౌనంగా జరుగుతున్న సంఘటనను చూస్తున్నాను.

‘‘మన ఊళ్లే ఎమ్మెల్యేను కిడ్నాప్ చేస్తే.. పోలీసులు వచ్చి ఊరును వల్ల కాడు చేస్తారు..’’ ఓ వృద్ద మహిళ అంది.

నక్సల్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టే పోలీసులు అమాయకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టిన సంఘటను ఆ గ్రామస్తులకు గుర్తుకు వచ్చాయేమో.. వారి మొఖాలో భయం కనిపిస్తోంది.

మా ఎమ్మెల్యే చాలా మంచోడు

‘‘మా ఎమ్మెల్యే చాలా మంచోడు.. వదిలి పెట్టండి.’’ ధైర్యం చేసి నక్సల్స్ ను ప్రాధేయపడ్డారు కొందరు మహిళలు.‘‘ఎన్టీఆర్ ప్రభుత్వంలో మన వారిని ఎన్ కౌంటర్ పేరిట కాల్చి చంపారు.. చాలా మంది మన కామ్రెడ్స్ ను అక్రమంగా అరెస్టు చేసి ఏళ్ల తరబడి జైళ్లలో పెట్టారు. ఈ విషయాలు ఎమ్మెల్యేతో మాట్లాడి వదిలి పెడతాం..’’ నిదానంగా అన్నాడు దళ కమాండర్ ప్రసాద్.. MLA KIDNAPPED BY NAXALS

జరుగుతున్న సంఘటనను అలా చూస్తూ నిలబడ్డాను.

నా చుట్టూ ఆయుధాలతో నిబడిన నక్సల్స్.. వారి చుట్టూ జనం..

అక్కడి నుంచి నన్ను కిడ్నాప్ చేసుకుని వారి వెంట తీసుకెళుతున్నారు నక్సల్స్..

‘‘నేను.. మీతో రాను..’’ అని అనే ధైర్యం చేయలేక పోయాను.

‘‘సాయంత్రం ఐదు గంట వరకు ఈ రామడుగులోనే ఉండు అప్పటి వరకు మీ ఎమ్మెల్యే తిరిగి వస్తాడు.. పోలీసులకు సమాచారం ఇచ్చారంటే పరిస్థితులు సీరియస్ గా ఉంటాయి.’’ కారు డ్రైవర్ నారాయణను హెచ్చరించారు నక్సల్స్.

ఆ డ్రైవర్ అక్కడే ఆగి పోయాడు.

‘‘పొరపాటున నేను తప్పు చేశానా.. నిజానికి తెలిసి నేనేప్పుడు తప్పు చేయలేదు.. నక్సల్స్ తప్పు చేసిన వారిని శిక్షిస్తారు..’’ మనసులోనే ఆ మాటను చాలా సార్లు అనుకున్నాను. నక్సల్స్ గురించి తెలిసిన నేను నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను.

ఆ ఐదుగురు నక్సల్స్ అడవి బాట పట్టారు.. వారి మధ్యన నేను, రఘువీరరెడ్డి నడుస్తున్నాము.

నాకు నక్సల్స్ సిద్దంతాలు తెలుసు… వారి లక్ష్యం తెలుసు..

నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం సాయుధ పోరాటం చేస్తున్నారని తెలుసు..

దున్నె వాడిదే భూమి కావాలని ఉద్యమాలు చేస్తున్నారని తెలుసు..

తుపాకి గొట్టంతోనే రాజ్యాధికారం వస్తుందని నక్సల్స్ నమ్ముతారని తెలుసు..

తెలంగాణ జిల్లాలలో నక్సల్స్ రాకతోనే దొర పెత్తనం తగ్గిందని తెలుసు..

సారా ధర తగ్గించడానికి.. తునికాకు ధరలు పెంచడానికి నక్సల్స్ చేసిన ఉద్యమాలు తెలుసు..

కానీ.. ఆ నక్సలైట్లను ఎప్పుడు ప్రత్యక్షంగా ఇది వరకెప్పుడు చూడలేదు నేను.

నక్సలైట్ల వెంట నడుస్తునే వారిని పరిశీలనగా చూసాను.

ఆ నక్సలైట్లంతా ఇరువై నుంచి ముప్పయి ఏళ్ల వయస్సున్న యువకులే..

వారిది ఏ ఊరో తెలియదు.. నిజమైన పేర్లు ఎవిరికి తెలియవు..

కానీ.. వారిని ప్రేమతో అందరూ ‘అన్నా..’ అంటూ పిుచుకుంటున్నారు అనుకున్నాను.

తూర్పు దిశన ఉన్న గోవింద్ పల్లి అడవుల వైపు చెరువు పక్క నుంచి నడుస్తున్నాము.

‘‘చెరువులో నీళ్లు తాగుతావా..?’’ నా వైపు చూస్తూ అడిగాడు డిప్యూటీ దళ కమాండర్ కూర మల్లన్న.

చెరువులోని నీళ్లను దోసేళ్లతో తీసుకుని అలసిన మొఖం కడుక్కున్నాను.

5నిన్ను కిడ్నాప్ చేసాం గదా.. భయమనిపిస్తాలేదా..? ’’ డిప్యూటి దళ కమాండర్ కూర మల్లన్న ప్రశ్న.

‘‘ఎందుకు భయం..’’ కూల్ గా సమాధానం ఇచ్చాను.

బూటకపు ఎన్ కౌంటర్ లో కాల్చీ

‘‘తెలుగు దేశం ప్రభుత్వ హయంలో మా అనుచరులను పట్టుకపోయి బూటకపు ఎన్ కౌంటర్ లో కాల్చీ వేసిన సంఘటనున్నాయి. అందుకే ప్రతికారంగా మండలాధ్యక్షుడు మల్హోల్ రావును చంపింది తెలియదా..?’’

‘‘ఎన్నో ఏళ్లుగా ఇదే ఏరియాలో తుపాకులు పట్టుకుని మీరు తిరుగుతున్నారు. దొరల దౌర్జన్యాలపై ఉద్యమాలు చేస్తున్నారు. అన్యాయాలను చేసే వారినే టార్గెట్ చేసి శిక్షిస్తున్నారు.. మేము ఓట్లను నమ్ముకుని తిరుగుతున్నాము. అయినా.. ఏదో ఒక రోజు ఇలాంటి సంఘటన తప్పదనుకున్నాను.’’

‘‘హా.. అట్లానా.. పేదల కోసం పోరాటాలు చేస్తున్న మా అనుచరులను అక్రమంగా అరెస్టు చేసి ఏళ్ల తరబడి జైల్లో పెడుతున్నారు.. వారిని విడిపించుకోవడానికి నిన్ను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది.’’ అన్నాడు దళ కమాండర్..

‘‘ప్రభుత్వం షరతులను అంగీకరించి జైల్ నుంచి మా అనుచరులను రిలీజ్ చేయక పోతే అప్పుడు మా సత్తా ఏమిటో చూపుతాము. అవసరమనుకుంటే మా షరతు కోసం నిన్ను ఖతం చేస్తాం..’’ కోపంతో అన్నాడు డిప్యూటి దళ కమాండర్ కూర మల్లన్న.

ఇద్దరు గీత కార్మికులు మాకు ఎదురుగా వస్తున్నారు..

నడుము చుట్టూ తోలుతో చేసిన ముస్తాద్ కట్టుకున్నారు.. ఆ ముస్తాద్ లో గీయడానికి మూడు కత్తున్నాయి.. భుజన వేసుకున్న మోకు.. మోకాళ్ల కాడికి లాగి కట్టుకున్న దోతి.. తాడి చెట్ల నుంచి తీసుక వస్తున్న కల్లు గొబ్బలను భుజాన పెట్టుకుని నడిచి వస్తున్నారు ఆ గీత కార్మికులు.

‘‘అగో.. మన ఎమ్మెల్యేను.. నక్సల్స్ తమ వెంట తీసుకెళుతున్నారు..’’ గీత కార్మికులు గట్టిగానే అనడం నక్సలైట్లకు వినిపించింది.

‘‘నిన్ను ఆ గౌండ్లోళ్లు కూడా గుర్తు పడుతారా..’’ అడిగాడు దళ కమాండర్.

‘‘ఎమ్మెల్యేను కదా.. గుర్తు పడుతారు. వారే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించారు’’ అన్నాను.

ఆ చెరువులో చాపలు పడుతున్న మత్స్య కార్మికులు దూరం నుంచి చూస్తున్నారు. అడవిలోనికి నడుస్తూనే ఓ సారి వెనుకకు తిరిగి రామడుగు గ్రామం వైపు చూసాను.. మా వైపు దూరం నుంచి గ్రామస్థులు వస్తూ కనిపించారు..

చెరువు ఎగువ పై బాగంలో ఉన్న అడవిలో కనిపించిన వాగులో కొంత సేపు కూర్చున్నాము.
దళ కమాండర్ ప్రసాద్ తన బ్యాగ్ లోనుంచి నోట్ బుక్ తీసి రాయడం ప్రారంభించాడు.

(దళ కమాండర్ ప్రసాద్ ఎవరికి లేఖ రాస్తాడో.. ఆ లేఖలో ఏమి డిమాండ్స్ ఉంటాయో.. రేపటి వరకు ఆగాల్సిందే..)

mallesh yatakarla

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking