నిద్రవస్థలో నార్సింగ్ పోలీసులు
ముగ్గురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
రంగారెడ్డి : నార్సింగీ పోలీసు స్టేషన్ పరిధిలో పేలిన బ్లాస్టింగ్… మై హోమ్ అవతార్ సమీపంలో పేలిన డిటోనేటర్ తోముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఈ ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే.. తప్పిన పెను ప్రమాదం. బ్లాస్టింగ్ పేలడంతో ఆకాశం లోకి ఎగిరి కింద పడ్డ బండ రాళ్లు. పేలుడు శబ్దానికి భయంతో పరుగులు తీసిన స్థానికులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
గత మూడు రోజుల క్రితం డిటోనేటర్లు అమర్చిన కాంట్రాక్టర్ ఒక్కసారిగా పేలిన డిటోనేటర్. కంట్రాక్టర్ నిర్లక్షంతోనే బ్లాస్టింగ్ జరిగిందంటున్నారు స్థానికులు.
గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చట్ట విరుద్దంగా బ్లాస్టింగ్ లు జరుగుతున్న నార్సింగ్ పోలీసు స్టేషన్ పోలీసులు మాత్రం నిద్ర మత్తులో ఉన్నారు.