కడప ఉక్కు సాధనకోసం- విశాఖ ఉక్కు ప్రైవేటి కరణకు వ్యతిరేకంగ అనంతపురం నుండి కడప వరకు జరిగే బైక్ యాత్ర పోస్టర్ విడుదల
AP39TV, 14.02.2021, అనంతపురం:
అనంతపురం నగరంలో స్దానిక గణేనాయక్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ, సిఐటియీ, డివైఎస్ఐ నాయకులు సూర్యచంద్ర యాదవ్, పరమేష్, రా. వి నాయుడు, నూరుల్లా కడప ఉక్కు సాధన కోసం ,విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా జరిగే బైక్ యాత్రకు సంబంధించిన పోస్టర్ల విడుదల చేశారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు విశాఖ ఉక్కు పరిరక్షణ- కడప ఉక్కు సాధనకై” బైక్ జాతా విద్యార్థి, యువజన, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 14 నేడు కర్నూల్ జిల్లాలో ప్రారంభమైందన్నారు. రేపు ఉదయం జిల్లాలో అనంతపురం గుంతకల్లు హిందూపురం ప్రాంతాలనుండి మూడు బృందాలుగా బయలుదేరి కడప కు చేరుకుంటారు అన్నారు. అనంతపురం నగరంలో ఉదయం 9 గంటలకు టవర్ క్లాక్ నుండి ప్రారంభమవుతుందిఅన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గుంటూరు 14 నుంచి 17వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ వరుకు జరిగే బైక్ జాతా కూడా గుంటూరులో ప్రారంభమైందని తెలియజేశారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆంధ్ర ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి, 32 మంది ఆత్మ బలిదానాలు తర్వాత ఆంధ్ర హక్కుగా సాధించుకున్నారు. భారత్ లోనే ఒక పెద్ద ఉక్కు ఫ్యాక్టరీ గా లాభాలతో నడుస్తున్న విశాఖ స్టీల్స్ లో 32 వేల మంది ఉద్యోగులు గా పనిచేస్తున్నారు.ఇంకా భూములిచ్చిన_ _రైతులకు దాదాపు 16 వేల మందికి ఉద్యోగాలు రావాల్సి ఉన్నది. స్టీల్ ప్లాంట్ ను నమ్ముకొని ప్రత్యక్షంగా ,పరోక్షంగా విశాఖ ప్రాంతంలో లక్ష కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పడానికి సిద్ధపడింది.
కడప ఉక్కు నిర్మాణం ఎన్నికల హామీగానే మిగిలిపోయింది.
బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో కడప ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు అయితే 6సం పూర్తవుతున్న హామీ హామీగానే మిగిలిపోయింది తప్పా ఎటువంటి నిర్మాణం పనులు చేయడంలో బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందింది మరి దానికి తోడు గా గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే కడప ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభిస్తాం నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు అయితే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తామన్నారు శంకుస్థాపన శంకుస్థాపన గానే ఉంది. ముఖ్యమంత్రి అయి 2సం అవుతున్న శంకుస్థాపన శంకుస్థాపన గానే ఉంది ఒక్క అంగుళం కూడా ముందుకు రాని పరిస్థితి కనపడుతుంది. కావున కడప ఉక్కు సాధన కోసం జరిగే బైక్ జాతలో విద్యార్థులు, యువత, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దూత్ ఫిరా, సంజీవ్, అల్లాజీ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.