Header Top logo

భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు..

పొలిటికల్ లీడర్ లు ఏది చేసినా వారు ఆశించేది రాజకీయ లబ్ది మాత్రమే. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకటంలో పెట్టే ఆరోపణలు లేదా విమర్శలు చేయడం వారి లక్ష్యం. కానీ.. ఆ తరువాత లీడర్ మాట్లాడే మాటల వల్ల ఎదురయ్యే సమస్యల గురించి ముందుగా ఊహించలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షనాయకులు భట్టి విక్రమార్క మత్స్యకార వృత్తి పై మాట్లాడిన తీరు ముదిరాజ్- బెస్త – గూండ్ల కులాలకు ఆగ్రహం తెప్పించాయి.

మత్స్యకార వృత్తి పై భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు పిట్టల రవీంధర్ వీడియో..

మత్స్యకార వృత్తి పై చేసిన వ్యాఖ్యలు

వెనక్కు తెసుకోవాలి

: తెలంగాణ ముదిరాజ్ మహాసభ డిమాండ్

హైదారబాద్ : తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. రతరాలుగా కొనసాగుతున్న మత్స్యకారుల వృత్తిని ఇతర కులాలకు తాకట్టు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభ నాయకుడు భట్టి విక్రమార్క శాసనసభలో మాట్లాడడాన్ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ తీవ్రంగా ఖండించింది. కులవృత్తుల పైన ఆయనకు అవగాహన కలిగి ఉన్నప్పటికిని ఉద్దేశపూర్వకంగా మత్స్యకారుల వృత్తిని వేరే కులాలకు కట్టబెట్టాలనడం విక్రమార్క లాంటి నాయకునికి తగదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు పిట్లల రవీంధర్ ముదిరాజ్, పగిడాల సుధాకర్ ముదిరాజ్, గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, అల్లుడు జగన్ ముదిరాజ్, విఠల్ ముదిరాజ్, కరాటే రమేష్ ముదిరాజ్,  డిమాండ్ చేశారు.

ఆయన ఆ ప్రకటనను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేసారు..లేకుంటే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా బట్టి విక్రమార్కను మత్స్యకారులు నిలదీయాలని పగిడాల సుధాకర్ పిలుపు నిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ బెస్త కులలకు తప్ప చేపల వేటలో ఇతర కులాలకు అవకాశం లేదని జీవోలు ఉన్నప్పటికీ మత్స్యకారుల పైన కక్ష కట్టడం ఇతర కులాలకు తాకట్టు పెట్టాలనుకోవడం ఒక ప్రదాన రాజకీయ పార్టీగా నేతకు తగదన్నారు. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఎక్కడకక్కడ తిప్పి కొట్టాలని పగిడాల సుధాకర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking